conditiion
-
రీఎంట్రీ అనంతరం డైరెక్టర్లకు కొత్త కండిషన్లు పెడుతున్న ‘బాద్షా’
బాలీవుడ్ బాద్ షా మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. ప్రస్తుతంషారూఖ్ చేతిలో పఠాన్ , జవాన్ , డంకీ వంటి భారీ సినిమాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో షారుక్‌కు నాన్ ఇంటర్ ఫియరింగ్ యాక్టర్‌గా పేరుంది. అంత క్యాజువల్‌గా ఉంటాడు షారూఖ్. అయితే ఇవన్నీ ఇంతకుముందు వరకే. ఇప్పుడు మాత్రం షారూఖ్ చేత సినిమా ఓకే చేయించడానికి డైరెక్టర్లు నానా తిప్పలు పడాల్సి వస్తుందట. చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్ తాజాగా షారుక్ డైరెక్టర్లకు కొత్త కండిషన్లు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో తన సినిమాల్లో యంగ్ హీరోయిన్లను తీసుకోవద్దని చెబుతున్నాడట. తన వయసుకు సరిపోయే వారినే హీరోయిన్లుగా తీసుకోవాలని డైరెక్టర్లకు సూచిస్తున్నాడట. అందుకే ఇప్పుడు షారుక్ చేస్తున్న సినిమాల్లో చేస్తున్న హీరోయిన్లందరు సీనియర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన దీపికా పదుకోనే, నయనతార, తాప్సీ లాంటి సీనియర్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చదవండి: ఎట్టకేలకు సెట్లో అడుగుపెట్టిన అనుష్క.. ‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ..’ ఇక ముందు కూడా అంతేనట. అలాగే స్క్రీప్ట్ విషయంలో కూడా కొన్ని కండిషన్స్ పెడుతున్నాడని బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కథలో క్యారెక్టరైషన్ తన వయసుకు సరిపోయాలే ఉండాలట. మరి యంగ్‌గా అసలు ఉండకూడదని డైరెక్టర్లకు స్ట్రీక్ట్‌గా చెబుతున్నాడట బాద్షా. అంతేకాదు లవ్ స్టోరీపై కాకుండా ఛాలెంజెంగ్ రోల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట. అందుకే ప్రజెంట్ షారూఖ్ చేస్తున్న సినిమాలన్నీ యాక్షన్ ,స్పై, మాస్ మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి. మరి ఇలా కండిషన్స్ పెడుతున్న షారుఖ్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తాడో చూడాలి. -
టెస్లాకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్
ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గిస్తే టెస్లా ఎస్ ప్లెయిడ్ కార్లను భారత్‌కు తీసుకువస్తామంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. భారత ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వంలో ఉన్నతాధికారి చేసిన చేసిన ప్రకటన ఎలన్‌మస్క్‌ని ఇరుకున పడేలా చేసింది. దీనికి ఓకేనా తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పుతామని ప్రకటిస్తే అది సాధ్యం’ అంటూ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. అంతేకాదు ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని ఆ అధికారి చెప్పినట్టు ఈటీ వివరించింది. టెస్లా బేరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి 40 వేల డాలర్లు లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది. ప్రస్తుతం టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర మన కరెన్సీలో కోటి రూపాయలలకు పైగానేగా ఉంది. దిగుమతి సుంకం కలిపితే ఈ కారు ధర రెండు కోట్లు దాటుతుంది. దీంతో పన్ను మినహాయింపు కోరుతోంది టెస్లా కంపెనీ. ఇరుక్కుపోయిన ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ, చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. ఇండియాలో కార్ల తయారీ పరిశ్రమ పెడతామంటే పన్ను మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇండియా ఇచ్చింది. దీంతో బాల్ ఎలన్ మస్క్ కోర్టులో పడినట్టయ్యింది. భారత ప్రభుత్వం వదిలిన ఫీలర్కి ఎలన్‌మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. -
బస్సు కండీషన్లో ఉండాల్సిందే...
l గ్యారేజీ సిబ్బందికి అవగాహన l ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ అరుణకుమారి శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కండీషన్లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత గ్యారేజీ సిబ్బందిపై ఉందని ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ నంబాళ్ల అరుణకుమారి అన్నారు. ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీకాకుళంలోని రెండో డిపో గ్యారేజీ ఆవరణలో మెయింటినెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్ కండిషన్, బ్రేక్‌లు, హెడ్‌లైట్ తదితరవన్నీ బాగుండేలా చూడాలని సూచించారు. హ్యాండ్‌బ్రేక్ కండిషన్ సరిగా ఉందా, లేదో చూసుకోవాలని, స్టీరింగ్ కండీషన్ సక్రమంగా ఉందో, లేదో చూడాలన్నారు. సేఫ్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్యారేజీ మెకానిక్‌లకు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ(ఇంజన్ మెకానిక్), ఎం.రవికాంత్(బ్రేక్ మెకానిక్), ఎస్.కోటేశ్వరరావు(బ్రేక్ మెకానిక్), జె.నూకరాజు(టైర్ మెకానిక్). బి.సతీష్‌బాబు(ఎలక్రీ్టషియన్), జి.కాళి(ఈఓసి మెకానిక్), కేవీ రావు(స్పోర్ట్స్ సూపర్వైజర్), జేవీకే రాజు(లీడింగ్ హ్యాండ్) తదితర ఉత్తమ గ్యారేజీ మెకానిక్, సూపర్వైజర్లకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రెండో డిపో అసిస్టెంట్ మేనేజర్, ఎం.ఎఫ్ తదితరులు పాల్గొన్నారు.