Shah Rukh Khan Puts Down New Conditions To Directors - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: రీఎంట్రీ అనంతరం డైరెక్టర్లకు స్ట్రిక్ట్‌ కండిషన్స్‌ పెడుతున్న బాద్‌షా

Published Fri, Jul 22 2022 3:27 PM | Last Updated on Fri, Jul 22 2022 5:05 PM

Shah Rukh Khan Puts Down New Conditions To Directors - Sakshi

బాలీవుడ్ బాద్ షా మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. ప్రస్తుతంషారూఖ్ చేతిలో పఠాన్ , జవాన్ , డంకీ వంటి భారీ సినిమాలు ఉన్నాయి.  అయితే ఇండస్ట్రీలో షారుక్‌కు నాన్ ఇంటర్ ఫియరింగ్ యాక్టర్‌గా పేరుంది. అంత క్యాజువల్‌గా ఉంటాడు షారూఖ్. అయితే ఇవన్నీ ఇంతకుముందు వరకే. ఇప్పుడు మాత్రం షారూఖ్ చేత సినిమా ఓకే చేయించడానికి డైరెక్టర్లు నానా తిప్పలు పడాల్సి వస్తుందట.

చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్‌ షాకింగ్‌ రియాక్షన్‌

తాజాగా షారుక్‌ డైరెక్టర్లకు కొత్త కండిషన్లు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో తన సినిమాల్లో యంగ్‌ హీరోయిన్లను తీసుకోవద్దని చెబుతున్నాడట. తన వయసుకు సరిపోయే వారినే హీరోయిన్లుగా తీసుకోవాలని డైరెక్టర్లకు సూచిస్తున్నాడట. అందుకే ఇప్పుడు షారుక్‌ చేస్తున్న​ సినిమాల్లో చేస్తు‍న్న హీరోయిన్లందరు సీనియర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన దీపికా పదుకోనే, నయనతార, తాప్సీ లాంటి సీనియర్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

చదవండి: ఎట్టకేలకు సెట్‌లో అడుగుపెట్టిన అనుష్క.. ‘17 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ..’

ఇక ముందు కూడా అంతేనట. అలాగే స్క్రీప్ట్‌ విషయంలో కూడా కొన్ని కండిషన్స్‌ పెడుతున్నాడని బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కథలో క్యారెక్టరైషన్‌ తన వయసుకు సరిపోయాలే ఉండాలట. మరి యంగ్‌గా అసలు ఉండకూడదని డైరెక్టర్లకు స్ట్రీక్ట్‌గా చెబుతున్నాడట బాద్‌షా. అంతేకాదు లవ్ స్టోరీపై కాకుండా ఛాలెంజెంగ్ రోల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట. అందుకే ప్రజెంట్ షారూఖ్ చేస్తున్న సినిమాలన్నీ యాక్షన్ ,స్పై, మాస్ మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి. మరి ఇలా కండిషన్స్ పెడుతున్న షారుఖ్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తాడో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement