Control projects
-
ఆ భారం కేంద్రంపైనే వేద్దాం!
• ప్రాజెక్టుల నియంత్రణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం • కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయాన్నిబట్టే ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ • కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన రాష్ట్రం.. గోదావరిలోనూ ఇదే వైఖరి సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలం గాణ ప్రాజెక్టులన్నింటినీ తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆయా బోర్డులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. బోర్డులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నందున.. ఈ విషయాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టాలని యోచిస్తోంది. ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణపై కేంద్రం ఎలా చెబితే అలా నడుచుకుంటామంటూ తెలంగాణ ఇప్పటికే కృష్ణా బోర్డుకు సమర్పించిన వర్కింగ్ మాన్యువల్లో స్పష్టం చేసింది. గోదావరిలోనూ ఇదే వైఖరి అనుసరించాలని భావిస్తోంది. అరుుతే రెండు బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డుల పరిధిలోకి తేవాలంటున్న ఏపీ ఒత్తిళ్ల ఫలితం ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. ప్రాజెక్టుల వారీ లెక్కలు తేలకుండా ఎలా? కృష్ణా, గోదావరి నదుల పరిధిలో తెలంగాణ, ఏపీలు కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటినుంచో కోరుతోంది. అరుుతే కృష్ణాలో ప్రధాన ప్రాజెక్టులను ప్రస్తావించిన ఏపీ, గోదావరిలో మాత్రం కేవలం ధవళేశ్వరం ప్రాజెక్టును మాత్రమే ప్రస్తావించింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగా ణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమంటూ ఏపీ కేంద్రానికి లేఖలు రాసింది. వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వీలుగా ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాలని విన్నవించింది. దానిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో కృష్ణా బోర్డు శ్రీశైలం, సాగర్తో పాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెం పాడు, కోరుుల్సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీలు తమ పరిధిలోకి తెచ్చుకుంటామని తెలిపింది. ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణను తెలంగాణ గట్టిగా వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేశాక, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక... కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలని తేల్చిచెప్పింది. కేంద్ర జల వనరులశాఖ ఏ ప్రాజెక్టులను సూచిస్తే వాటిని మాత్రమే బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు సమ్మతిస్తామని.. అప్పటివరకు నియంత్రణపై తొందర అక్కర్లేదని స్పష్టం చేసింది. దీన్ని కేంద్రం నోటిఫై చేస్తూ గెజిట్ ఇవ్వాల్సి ఉంది. గోదావరి ప్రాజెక్టులనూ.. ప్రస్తుతం గోదావరిపై నిర్మితమైన ఎస్సారెస్పీ, కడెం, సింగూరు, నిజాంసాగర్లతో పాటు ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెచ్చుకుంటామని ఆ బోర్డు చెబుతోంది. దీనిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. అసలు గోదావరిలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని.. ప్రాజెక్టుల వారీ కేటారుుంపులు తేలకుండా నియంత్రణ వద్దని స్పష్టం చేస్తోంది. ఒకవేళ ప్రాజెక్టులపై నియంత్రణ ఉండాలంటే మాత్రం.. కేంద్రం సూచించే ప్రాజెక్టులకు సమ్మతిస్తామని చెప్పాలని నిర్ణరుుంచింది. ఇదే సమయంలో ఏపీ పేర్కొనని పట్టిసీమ, పోలవరం, పుష్కర, తాడిపుడి, వెంకటాపురం ప్రాజెక్టులను సైతం బోర్డు పరిధిలోకి తేవాలని కోరనుంది. అరుుతే డ్రాఫ్ట్ వర్కింగ్ మాన్యువల్ గోదావరి బోర్డు నుంచి అందాక తన అభిప్రాయాలను చెప్పనుంది. వచ్చే నెలలో ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపాక ఓ స్పష్టత వస్తుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. -
పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే!
ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాల్లేవన్న కేంద్రం * అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే స్పష్టత * ట్రీబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగానే నీటి వినియోగం * ప్రాజెక్టుల నియంత్రణ అంశం సైతం ఇప్పట్లో లేనట్లే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ఒక అడ్డు తొలిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఆంధ్రప్రదేశ్ చేసిన వాదన అపెక్స్ కౌన్సిల్ ముందు వీగిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాలేమీ లేవని.. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగా నీటి వినియోగానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించడం రాష్ట్రానికి ఊరటనిచ్చింది. అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ ఎప్పటికి పూర్తి చేస్తుంది, ఏ మేరకు నీటి వాటాను కేటాయిస్తుందన్నది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. కేటాయింపుల మేర వాటా దక్కేనా? బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత లెక్కన మొత్తంగా 2,060 టీఎంసీలను లెక్క తేల్చింది. అందులోంచి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాలు, మరో 227 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు దక్కగా.. తెలంగాణకు 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు దక్కాయి. అయితే మొత్తంగా కూడా తెలంగాణ 200 టీఎంసీలకు మించి వినియోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే 120 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టింది. ఇక ఏపీ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు కృష్ణాలో అదనంగా 90 టీఎంసీల వాటా రావాలని స్పష్టం చేస్తోంది. మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొత్తగా 65 శాతం నీటి లభ్యత అంచనాలతో కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత జలాలున్నట్టు తేల్చింది. ఈ లెక్కన మరో 163 టీఎంసీల నికర జలాలు, 285 టీఎంసీల మిగులు జలాలు (మొత్తం 448 టీఎంసీలు) అదనంగా ఉన్నట్లు చూపింది. ఈ అదనపు జలాల్లో కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81, ఏపీకి 190 టీఎంసీలు కేటాయించింది. కానీ బచావత్ తీర్పుకు వ్యతిరేకంగా మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు పంచడమేమిటని.. వాటిని దిగువ రాష్ట్రాలకే పంచాలని ప్రస్తుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తోంది. దీనిపై విచారణ ముగిస్తే తెలంగాణకు మిగులు జలాల్లో మరింత వాటా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన మొత్తంగా పాలమూరు, డిండిలకు నిర్ణీత నీటిని వాడుకోవచ్చని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై వాదనలు విన్న కేంద్రం వాటాలు తేల్చే పనిని తిరిగి ట్రిబ్యునల్కే అప్పగించింది. తెలంగాణ వాదనలకు అనుగుణంగా నీటి వాటా పెరిగితే పాలమూరు, డిండికి ఎలాంటి నష్టం ఉండదని.. లేకపోతే ఇబ్బందేనని రాష్ట్ర నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ ఇప్పట్లో లేనట్లే కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా నివేదికను సమర్పించాలని ఇప్పటిదాకా కృష్ణా బోర్డు తొందరపెట్టిందని.. ప్రస్తుతానికి ఆ అంశం మరుగున పడినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ చెబుతోంది. అపెక్స్ భేటీలో ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని తెలంగాణ వాదించింది. అసలు ప్రాజెక్టుల వారీగాఎవరి వాటా ఎంత, వినియోగం ఏ రీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే ప్రాజెక్టుల నియంత్రణ చేపట్టాలని సూచించింది. ఈ వాదనతో కేంద్రం ఏకీభవించిందని, ఏపీ మౌనం దాల్చిందని పేర్కొంది.