గిన్నీస్ పిల్లి కార్డురోయ్ చనిపోయింది
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత వయసుగల పెంపుడు పిల్లి చనిపోయింది. గిన్నీస్ రికార్డులో కూడా చేరిన కార్డురోయ్(27) అనే ఈ పిల్లి కొద్ది వారాలుగా కనిపించకుండాపోయి తిరిగి ఎక్కడా జాడ దొరక్కపోవడంతో అది చనిపోయినట్లుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఈ పిల్లిని అల్లారు ముద్దుగా పెంచుతూ వస్తున్న కుటుంబ సభ్యులు ఆశ్లే రీడ్ ఒకురా ఆమె భర్త ఆరన్ మసురు ఒకురా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రెస్టారెంటు యజమానులైన వీరింట్లో 1989 ఆగస్టు 1న జన్మించిన కార్డురోయ్ 2014, జూన్లో అత్యంత వయస్సుగల పెంపుడు పిల్లిగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ పిల్లికి ఇంటర్నెట్లో పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. గత ఆక్టోబర్ నెలలో ఇంట్లో నుంచి బయటకెళ్లిన కార్డురోయ్ తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు దానికోసం వెతకని చోటంటూ లేదు. సామాజిక మాధ్యమం సహాయం ద్వారా కూడా దీని ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఇప్పటి వరకు దాదాపు లక్షా 86వేలమంది ఫాలోవర్స్ ఈ పిల్లికి ఉన్నారు.