ఈ పిల్లి వయసు 26 ఏళ్లు!
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యధిక వయసున్న పిల్లిగా అమెరికాకు చెందిన కార్డ్‌రాయ్ గిన్నిస్ రికార్డు సాధించింది. ఆరెగాన్‌కు చెందిన ఆష్లే రీడ్ అనే వ్యక్తి ఈ పిల్లిని పెంచుకుంటున్నారు. 1989 ఆగస్టు 1న జన్మించిన కార్డ్‌రాయ్ ఈ ఏడాదితో 26 ఏళ్లు పూర్తి చేసుకొని ఎక్కువ కాలం జీవించి ఉన్న పిల్లిగా రికార్డు సాధించింది.
గతంలో టిఫానీ అనే పిల్లి 27 ఏళ్లు జీవించి రికార్డులకెక్కింది. అది ఇటీవల చనిపోవడంతో ఆ రికార్డు ఇప్పుడు కార్డ్‌రాయ్ సొంతమైంది. సాధారణంగా పిల్లులు సగటున 15 ఏళ్లు జీవిస్తాయి. అయితే ఏకంగా 38 ఏళ్లు జీవించి క్రెమె ఫఫ్ అనే పిల్లి రికార్డు సృష్టించింది. ఇది 2005లో మరణించింది.