worlds oldest
-
గిన్నిస్ బుక్‌లో సీసా సందేశం
లండన్: ఏకంగా 108 ఏళ్లపాటు సముద్రంలో ప్రయాణించిన ఓ బాటిల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1906లో బ్రిటన్‌కు చెందిన మెరైన్ బయెలాజికల్ ఆసోసియేషన్ (ఎన్బీఏ) ప్రతినిధులు ఓ ఖాళీ సీసాలో ఉత్తరాన్ని ఉంచి సముద్రంలోకి విసిరివేశారు. అప్పటి నుంచి సముద్రంలో ప్రయాణించిన ఆ బాటిల్ 2015లో జర్మనీలోని అమురమ్ దీవుల్లో మరియన్నే వింక్లర్ అనే ఆవిడ కంటపడింది. బాటిల్‌ను తెరిచి చూసిన ఆమెకు అందులోని ఉత్తరంపై ఎన్బీఏ అడ్రస్‌కు తిరిగి పంపాలనే సూచన కనబడింది. దీంతో మరియాన్నే బాటిల్ దొరికిన ప్రదేశం తదితర వివరాల్ని నింపి ఎన్బీఏకు పంపించింది. ఈ ఉదంతాన్ని గిన్నిస్ ప్రతినిధులు గుర్తించి ‘బాటిల్లో అతి ఎక్కువ కాలం ప్రయాణించిన సందేశం’గా గుర్తింపునిచ్చారు. -
ప్రపంచంలోనే అతి ప్రాచీన డ్రెస్ ఇదే..
ప్రపంచంలోనే అతి ప్రాచీన డ్రెస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈజిప్ట్‌లో లభించిన వస్త్రాన్ని రేడియో కార్భన్ డేటింగ్ పద్దతి ద్వారా 5500 ఏళ్ల కిందటికి చెందిందిగా తేల్చారు. తర్కాన్ డ్రెస్‌గా పిలిచే ఈ వస్త్రాన్ని ఈజిప్ట్ టాంబ్లో తొలుత కనుగొన్నారు. అనంతరం 1990లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో ఉన్న ఈజిఫ్షియన్ ఆర్కియాలజీ పీటర్ మ్యూజియానికి తరలించారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ నిపుణులు కార్భన్ డేటింగ్ పద్దతులతో ఈ డ్రెస్ 5100 నుంచి 5500 సంవత్సరాల కిందటికి చెందిందిగా తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటి వరకు లభ్యమైన అతి ప్రాచీన నేసిన వస్త్రంగా తర్కాన్ డ్రెస్ నిలిచింది. వివిధ రకాల నారలతో తయారు చేసిన ఈ డ్రెస్ వీ(V) ఆకారంలో ఉన్న నెక్ ఉంది. స్లీవ్ దగ్గర మడతలు మడతలుగా ఉంది. పురాతన కాలంలోనే ఈజిప్ట్‌లో నివసించే సంపన్న వర్గాల వారు తమ వస్త్రాల కోసం ప్రత్యేకంగా పనివారు ఉండేవారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చరిత్రకారులు చెబుతున్నారు. -
ఈ పిల్లి వయసు 26 ఏళ్లు!
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యధిక వయసున్న పిల్లిగా అమెరికాకు చెందిన కార్డ్రాయ్ గిన్నిస్ రికార్డు సాధించింది. ఆరెగాన్‌కు చెందిన ఆష్లే రీడ్ అనే వ్యక్తి ఈ పిల్లిని పెంచుకుంటున్నారు. 1989 ఆగస్టు 1న జన్మించిన కార్డ్రాయ్ ఈ ఏడాదితో 26 ఏళ్లు పూర్తి చేసుకొని ఎక్కువ కాలం జీవించి ఉన్న పిల్లిగా రికార్డు సాధించింది. గతంలో టిఫానీ అనే పిల్లి 27 ఏళ్లు జీవించి రికార్డులకెక్కింది. అది ఇటీవల చనిపోవడంతో ఆ రికార్డు ఇప్పుడు కార్డ్రాయ్ సొంతమైంది. సాధారణంగా పిల్లులు సగటున 15 ఏళ్లు జీవిస్తాయి. అయితే ఏకంగా 38 ఏళ్లు జీవించి క్రెమె ఫఫ్ అనే పిల్లి రికార్డు సృష్టించింది. ఇది 2005లో మరణించింది.