ప్రపంచంలోనే అతి ప్రాచీన డ్రెస్ ఇదే..
ప్రపంచంలోనే అతి ప్రాచీన డ్రెస్ను పరిశోధకులు గుర్తించారు. ఈజిప్ట్లో లభించిన వస్త్రాన్ని రేడియో కార్భన్ డేటింగ్ పద్దతి ద్వారా 5500 ఏళ్ల కిందటికి చెందిందిగా తేల్చారు. తర్కాన్ డ్రెస్గా పిలిచే ఈ వస్త్రాన్ని ఈజిప్ట్ టాంబ్లో తొలుత కనుగొన్నారు. అనంతరం 1990లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో ఉన్న ఈజిఫ్షియన్ ఆర్కియాలజీ పీటర్ మ్యూజియానికి తరలించారు.
అయితే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ నిపుణులు కార్భన్ డేటింగ్ పద్దతులతో ఈ డ్రెస్ 5100 నుంచి 5500 సంవత్సరాల కిందటికి చెందిందిగా తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటి వరకు లభ్యమైన అతి ప్రాచీన నేసిన వస్త్రంగా తర్కాన్ డ్రెస్ నిలిచింది.
వివిధ రకాల నారలతో తయారు చేసిన ఈ డ్రెస్ వీ(V) ఆకారంలో ఉన్న నెక్ ఉంది. స్లీవ్ దగ్గర మడతలు మడతలుగా ఉంది. పురాతన కాలంలోనే ఈజిప్ట్లో నివసించే సంపన్న వర్గాల వారు తమ వస్త్రాల కోసం ప్రత్యేకంగా పనివారు ఉండేవారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చరిత్రకారులు చెబుతున్నారు.