టయోటా భారీ రీకాల్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద భారత అనుబంధ వాహనతయారీసంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో భారీగా వాహనాలను రీకాల్ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా వాహనాల కొనసాగుతున్న రీకాల్ భాగంగా సెడాన్ వాహనాలను వెనక్కి తీసుకోనుంది. భారత్ లో 23,157 టయోటా కరొల్లా ఆల్టిస్ వాహనాలను రీకాల్ చేయనుంది.
ఎయిర్ బ్యాగ్ లో లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ధర రూ 15.87 లక్షలు, రూ 19.91 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) రేంజ్ లో ఉన్నాయి. జనవరి 2010, డిశెంబర్ 2012 మధ్య తయారైన కరొల్లా వాహనాలను రీకాల్ చేస్తున్న టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రతినిధి పిటిఐకి చెప్పారు.
కాగా జపాన్ కుచెందిన టకోటా ఎయిర్‌బ్యాగ్ లోపాల కారణంగా ఇండియా, జపాన్, చైనాలతోపాటు ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా గ్లోబల్ గా 2.9 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తోంది. హోండా కంపెనీ కూడా భారీ రీకాల్ చేపట్టింది. గత జనవరిలో 41,580 వాహనాలను వెనక్కి తీసుకుంది.