ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత
ఆదిలాబాద్: గిట్టుబాటు కాని ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించిన రైతన్నలు మార్కెట్ యార్డు కార్యాలయంపై దాడి చేసి అధికారులను నిర్బంధించారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం అయింది. అదిలాబాద్ మార్కెట్ యార్డులో గత శుక్రవారం ఉన్న ధర కంటే తక్కువకు కొనగోలు చేస్తున్నట్టు అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదాలతో రైతులు అధికారులను నిర్బంధించి కార్యలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.