ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత | farmers dharna at adilabad marcket yard | Sakshi

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత

Nov 2 2015 11:20 AM | Updated on Sep 3 2017 11:54 AM

గిట్టుబాటు కాని ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించిన రైతన్నలు మార్కెట్ యార్డు కార్యాలయంపై దాడి చేసి అధికారులను నిర్బంధించారు.

ఆదిలాబాద్: గిట్టుబాటు కాని ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించిన రైతన్నలు మార్కెట్ యార్డు కార్యాలయంపై దాడి చేసి అధికారులను నిర్బంధించారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం అయింది. అదిలాబాద్ మార్కెట్ యార్డులో  గత శుక్రవారం ఉన్న ధర కంటే తక్కువకు కొనగోలు చేస్తున్నట్టు అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదాలతో రైతులు అధికారులను నిర్బంధించి కార్యలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement