council members
-
లాస్య నందిత మృతిపై కౌన్సిల్ సంతాపం
-
Sandy Reddy: ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే!
హైదరాబాద్: భాగ్యనగరానికి చెందిన ఆ యువతి ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా సేవలు అందిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో నివసించే పట్లోళ్ల శంకర్‌రెడ్డి, సరళారెడ్డి దంపతుల కూతురు శాండీరెడ్డి ప్రస్తుతం స్ట్రాత్ ఫీల్డ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అబిడ్స్‌లోని స్టాన్లీ స్కూల్లో 10వ తరగతి వరకు, మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసిన శాండీరెడ్డి వివాహ అనంతరం సిడ్నీ వెళ్లారు. అక్కడి పౌరసత్వం తీసుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్‌లో స్వచ్ఛంద సేవలు అందించారు. ఆమె సేవలకు ముగ్ధులైన ఆ ప్రాంతవాసులు గత ఏడాది జరిగిన స్ట్రాత్ ఫీల్డ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలని ప్రోత్సహించారు. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో చేసి విజయం సాధించారు. ఇటీవల సంక్రాంతికి పండగ కోసం ఆమె నగరానికి వచ్చారు. అక్కడ కౌన్సిలర్‌గా విధులు, ప్రజలకు చేస్తున్న సేవలను వివరించారు. స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఏడుగురు కౌన్సిలర్లు ఉంటారు. అందులో నేను ఒకదానిని. మాకు ప్రతి నెలా 8 షెడ్యూల్డ్ మీటింగ్స్ కౌన్సిల్లో ఉంటాయి. మాకు వచ్చే ఫిర్యాదులను ఈ సమావేశాల్లోనే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తుంటాం. అక్కడ ఎక్కువగా ఈ–మెయిల్ ద్వారానే ఫిర్యాదులు అందుతుంటాయి. ప్రతి ఫిర్యాదును స్వీకరించి కౌన్సిల్లో పెడతాం. ఆ సమస్యకు గల కారణం, ఎప్పుడు పరిష్కారం అవుతుంది? తదితర అంశాలను ఫిర్యాదు చేసిన వ్యక్తికి తిరిగి ఈ–మెయిల్లోనే పంపించడం జరుగుతుంది. మా కార్పొరేషన్లో ఖర్చు చేసే ప్రతి పైసాను స్థానికులు అడిగి తెలుసుకుంటారు. దేనికైనా డబ్బులు ఖర్చు పెడితే అనవసరమైన పక్షంలో ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీస్తారు. మేం చెల్లించే పన్నుల ద్వారా జరిగే అభివృద్ధి పనులను మాకు తెలియకుండా చేయకూడదని, ఖర్చు కూడా పెట్టొద్దని అంటుంటారు. తమ ప్రాంతంలో ఏదైనా కొత్త పని కావాలన్నా మాకు ఈ–మెయిల్ చేస్తుంటారు. లైట్లు వెలగకున్నా ఫోన్ చేస్తుంటారు. వాటిని మేం సమావేశాల్లో పెడతాం. ప్రతి వారం చెత్త తీసుకెళ్తారు.. మా కార్పొరేషన పరిధిలో వారానికి ఒకసారి చెత్తను తీసుకెళ్తారు. ఈ వారం రోజుల పాటు ప్రజలు తమ ఇళ్లల్లోని చెత్తను రోడ్డు పక్కన పెద్ద పెద్ద డబ్బాల్లో వేస్తుంటారు. రోడ్డు మీద చెట్టు నుంచి రాలిపడ్డ ఆకు కూడా కనిపించదు. ఇక వారంలో రెండు సార్లు రీసైక్లింగ్ వ్యర్ధాలను, చెట్ల నుంచి రాలి పడ్డ ఆకులు, పెరిగే గడ్డి, విరిగిపడే చెట్ల కొమ్మలను తీసుకెళ్తుంటారు. ఎవరైనా తమ ఇంట్లో కుర్చీలు, టేబుళ్లు విరిగిపోయినా, పాత వస్తువులు పేరుకుపోయినా, పరుపులు, దిండ్లు, ఇతర వస్తువులు ఉంటే వాటిని తీసుకెళ్లాలని కౌన్సిల్‌కు సమాచారం ఇస్తారు. వారం రోజుల్లోనే కౌన్సిల్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి ఆ మొత్తం వ్యర్థాలను తరలిస్తారు. అంతేగాని ఎక్కడంటే అక్కడ వాటిని వేయడం కుదరదు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిడ్నీలో ప్రజలకు భారీగా జరిమానాలు విధిస్తారు. జరిమానాలకు భయపడి చాలా మంది తప్పులు చేయరు. హైదరాబాద్‌లో హెవీ ట్రాఫిక్.. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా వివిధ ప్రాంతాలకు వెళుతున్నాను. విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. కాలుష్యం కూడా బాగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు ఇరుక్కుంటున్నాయి. ఈ దృశ్యాలు నా మనసును కలచివేశాయి. ప్రజల్లో బాగా చైతన్యం రావాల్సి ఉంది. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో అంబులెన్స్ వస్తుంటే వాహనాలు రెండు వైపులకు తప్పించి అంబులెన్స్‌ను ముందుకు పంపిస్తారు. ఇక్కడ ఆ అవగాహన కనిపించడం లేదు. ట్రాఫిక్, కాలుష్యం తగ్గాలంటే వాహనల సంఖ్య కూడా తగ్గి ప్రజా రవాణా వ్యవస్థ సిడ్నీ నగరంలా పెరగాలి. (క్లిక్ చేయండి: భారత సంతతి వైద్యుడికి యూఎస్ సీడీసీలో కీలక పదవి) -
రెచ్చిపోయిన గంగిశెట్టి : వైస్ చైర్మన్ వెకిలి చేష్టలు
కర్నూలు, బొమ్మలసత్రం: అధికార పార్టీకి చెందిన నంద్యాల మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ రెచ్చిపోయారు. కౌన్సిల్ సమావేశంలో హుందాగా ప్రవర్తించాల్సింది పోయి.. వెకిలిచేష్టలతో వెగటు పుట్టించారు. చేతిలో ఉన్న మైకుతో ఏకంగా సభ్యులపై దాడికి యత్నించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా.. సభా సమయాన్ని వృథా చేస్తూ ఆయన ప్రవర్తించడంపై సభ్యులు మండిపడ్డారు. స్థానిక మునిసిపల్ కౌన్సిల్ హాలులో సోమవారంచైర్ పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ముందుగా జమ్మూ కశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అజెండాను ప్రారంభించే ముందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ భవానీ ప్రసాద్‌ను పరిచయం చేశారు. సమావేశం సజావుగా కొనసాగే సమయంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ చైర్పర్సన్ అనుమతి లేకుండానే లేచి నిలబడ్డారు. ‘మాట్లాడేది పూర్తయ్యిందా... అయ్యిందా?’ అంటూ వెకిలి చేష్టలతో కౌన్సిల్‌హాలు మధ్యలో నిలబడి హల్చల్ చేశారు. మధ్యలో లేచి మాట్లాడటం సభ్యత కాదని, సభ్యులకు సమాధానం చెప్పేటప్పుడుఅడ్డుతగలటం సరైన పద్ధతి కాదని చైర్పర్సన్ వారించినా వినలేదు. పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ అడ్డు తగులుతుండడంతో చైర్పర్సన్ సమావేశం మధ్యలోనే వెళ్లి పోయారు. తర్వాత వైస్‌చైర్మన్ అక్కడున్న సభ్యులను పరుష పదజాలంతో దూషిస్తూ అడ్డుపడిన వారిపై మైకు విసిరారు. రౌడీలా వ్యవహరించిన ఆయనతో వాదించలేక సభ్యులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంగిశెట్టి విజయ్‌కుమార్ గతంలో కూడా మహిళా కౌన్సిలర్లు ఉన్న వాట్సాప్ గ్రూపులో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. మరోసారి అనుచిత ప్రవర్తనతో హల్చల్ సృష్టించడం గమనార్హం. సభాగౌరవం మంట కలుపుతున్నారు – శోభారాణి, కౌన్సిలర్ కౌన్సిల్ మీట్లో టీడీపీ సభ్యులు కావాలనే అడ్డు తగులుతున్నారు. గందరగోళం సృష్టిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా చేస్తున్నారు. సభా మర్యాదను పాటిస్తూ ప్రశ్నలు వేయకుండా.. ఇష్టానుసారం మధ్యలో నిలబడి ఏకవచనంతో సంబోధించటం సరైంది కాదు. సభలో రాజకీయాలు పనికిరావు – దేశం సులోచన, చైర్పర్సన్ ప్రజలు ఎన్నుకున్నది వారి సమస్యల పరిష్కారం కోసం. కౌన్సిల్‌మీట్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదు. ఎదుటి వారు పార్టీలు మారారని విమర్శించే ముందు ఇప్పుడు టీడీపీలో ఉన్న వారంతా ఏపార్టీ గుర్తుతో గెలిచారో చెప్పాలి. సభలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదు. సభాసమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే బయటికి వచ్చేశా. -
టీడీపీకి ‘మండలి’ భయం
ఏపీ మండలిలో అధికారపక్షానికంటే ప్రతిపక్షానికి సంఖ్యాబలమెక్కువ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తమకు తక్కువ సంఖ్యాబలం ఉండడంతో అది ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు గుబులు చెందుతున్నారు. దీంతో ఏదోలా మండలిలో సంఖ్యాబలాన్ని పెంచుకొని ఈ అవాంతరాన్ని అధిగమించేందుకు వారు తెరవెనుక ఆలోచనలు సాగిస్తున్నారు. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 50. అభివృద్ధి, సంక్షేమంతోపాటు విధానపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకోవాలంటే ఉభయ సభల్లో మెజార్టీ ఉండాలి. ఆ బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం దాల్చాకనే ఆ కార్యక్రమాలు అమలవుతాయి. బిల్లులు ప్రజావ్యతిరేక మైనవైనా, లోపభూయిష్టంగా ఉన్నా అవి ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడం సహజం. శాసనసభలో మెజార్టీ ఉంది కనుక ప్రతిపక్షం అభ్యంతరాలను తోసిరాజని అధికార టీడీపీ వాటిని ఆమోదించుకోవచ్చు. అయితే మండలిలో ఆధిక్యం లేనందున ఇబ్బందులు తప్పవేమో అన్నది ఆందోళన. ఇప్పుడిదే టీడీపీకి చిక్కుప్రశ్నగా మారింది. ప్రతి బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక మండలి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ ప్రతిపక్షానికి మెజార్టీ ఉన్నందున సభ్యులు దాన్ని వ్యతిరేకించడమో, సవరణలు ప్రతిపాదించి సెలెక్టు కమిటీకి పంపించడమో చేస్తే జాప్యం జరిగి ప్రభుత్వం ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది. అలా అయితే తాము అనుకున్న మేరకు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లలేమని అధికార నేతలు భావిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష.. మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు మెజార్టీ ఉంది. టీడీపీ సభ్యులు ఏడుగురు మాత్రమే. మండలిలో టీడీపీకి మెజార్టీ రావాలంటే 18 నుంచి 20 మంది ఎమ్మెల్సీలు అవసరమవుతారు. మండలి ద్వైవార్షిక ఎన్నికలు 2015 ఏప్రిల్ వరకు లేవు. ఈలోగానే బలం పెంచుకోవాలంటే ఇతర పార్టీల సభ్యులను ఆకర్షించాల్సి ఉంటుంది. ఇపుడిదే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌తో పాటుఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలపై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయా సభ్యులతో టీడీపీ ముఖ్యనేతలు కొందరు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇండిపెండెంట్లు, గవర్నర్ కోటాపై ధీమా.. ప్రస్తుతమున్న 42 స్థానాల్లో సాంకేతికంగా చూస్తే గవర్నర్ నామినేటెడ్ కోటా స్థానాలతో కలుపుకొని కాంగ్రెస్ బలం 20. టీడీపీకి ఏడుగురు, సీపీఐకి ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒకరు, ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. అయితే ఇవన్నీ రికార్డుల ప్రకారం ఉన్న బలాలు మాత్రమే. గవర్నర్ కోటాలో ఎంపికైన సభ్యులు అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీకి మద్దతుగా నిలిచినా ఇప్పుడు అధికార పార్టీవైపే ఉంటారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు(ఇందులో జూపూడి ప్రభాకర్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్‌వైపు ఉన్నారు). ప్రస్తుత సభ్యుల్లో మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ఆ పదవిలో ఉన్నందున పార్టీ రహితంగా భావించాలి. మరో ఎమ్మెల్సీ పోతుల రామారావు ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. మిగిలిన సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీకి 17 మంది(ఎన్నికైన వారు 14, నామినేటెడ్ 3) ఉన్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి కొందరు సభ్యులు చేరడంతో ఆ పార్టీ బలం ఆరుగా ఉంది. సీపీఐకి ఒక సభ్యుడున్నారు. తెలుగుదేశం కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ మంది సభ్యులుండడం, పైగా సభలో సంఖ్యాపరంగా ఇండిపెండెంట్లది ద్వితీయస్థానంగా ఉండడంతో సభలో ప్రతిపక్ష పార్టీల ఆధిక్యం కొనసాగనుంది. రెండునెలల క్రితం కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయిలను గవర్నర్ కోటాలో నామినేట్ చేసినా వారిని ఏ ప్రాంతానికి కేటాయించారో ఇంకా తేల్చలేదు. ఆ కోటాలో ఒక్కటే స్థానం ఖాళీగా ఉన్నందున ఒక్కరు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వస్తారు. ఆ లెక్కన చూసినా కాంగ్రెస్ మెజార్టీయే పెరుగుతుంది. దీంతో టీడీపీ నేతలు ఆయా పార్టీల సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి, డీవీ సూర్యనారాయణరాజు, ఇండిపెండెంట్లుగా కాంగ్రెస్‌కు అనుబంధంగా వ్యవహరించిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్ వర్మలతో పాటు ఇతర ఎమ్మెల్సీలు, ఇండిపెండెంట్లతో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు వివరించాయి. ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నందున వారిని కలుపుకొన్నా తమ బలం 20 అవుతుందని, కాంగ్రెస్ నుంచి మరో నలుగురైదుగురి సహకారం ఉంటే చాలునని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ రాష్ట్రానికెన్ని..? రాష్ట్ర విభజనకు ముందు సమైక్య శాసనమండలిలో మొత్తం స్థానాలు 90. అందులో 50 స్థానాలు ఆంధ్రప్రదేశ్‌కు, 40 స్థానాలను తెలంగాణకు కేటాయించారు. అయితే విభజన బిల్లు రూపొందించేనాటికి కొన్ని స్థానిక సంస్థల స్థానాలు, గవర్నర్ కోటా స్థానాలు భర్తీ కాలేదు. ఆ ఖాళీలను మినహాయించి తక్కిన సభ్యులను రెండు రాష్ట్రాలకు విభజించారు. ఆంధ్రప్రదేశ్‌కు 42 మంది సభ్యులను ఇచ్చారు. ఎనిమిది ఖాళీలున్నాయి. అందులో ఆరు స్థానిక సంస్థల కోటా, ఒకటి నామినేటెడ్ కోటా, ఇంకొకటి ఎమ్మెల్యే కోటా స్థానం.