Counterpoints Market Monitor service
-
స్మార్ట్ఫోన్ల మార్కెట్@50 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు యాపిల్, శాంసంగ్ విక్రయించే ప్రీమియం డివైజ్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది (2025లో) 50 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,28,900 కోట్లు) చేరవచ్చని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 2021లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పరిమాణం 37.9 బిలియన్ డాలర్లుగా (రూ. 3.25 లక్షల కోట్లు) నమోదైంది. ‘భారతీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది 50 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి, రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రీమియం, అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్లలో ఆకర్షణీయమైన ఆప్షన్లను అందిస్తూ యాపిల్, శాంసంగ్‌లాంటి బ్రాండ్లు మార్కెట్ వృద్ధికి సారథ్యం వహిస్తున్నాయి‘ అని నివేదిక వివరించింది. 2025లో తొలిసారిగా దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సగటు రిటైల్ విక్రయ ధర 300 డాలర్ల మార్కును (సుమారు రూ. 25,700) అధిగమించవచ్చని నివేదిక పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల విభాగం ద్వారా యాపిల్ ఇండియా రూ. 67,122 కోట్లు, శాంసంగ్ రూ. 71,158 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → స్థానికంగా తయారీ, వివిధ ఐఫోన్ల మోడల్స్ ధరల తగ్గింపు వల్ల యాపిల్ విక్రయించే ప్రో మోడల్స్‌కి డిమాండ్ పటిష్టంగా ఉండవచ్చు. అదే సమయంలో మరింత విలువైన ఫీచర్లు ఉండే డివైజ్‌లు, ముఖ్యంగా తమ ఫ్లాగ్షిప్ ఎస్ సిరీస్ ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతుండటం శాంసంగ్ అమ్మకాల వృద్ధికి దోహదపడగలవు. → అఫోర్డబుల్ ప్రీమియం కేటగిరీలో (రూ. 30,000 – 45,000 ధర శ్రేణి) అధునాతన కెమెరాలు మొదలైన ఫీచర్లను అందించడం ద్వారా వివో, ఒపో, వన్‌ప్లస్ లాంటి → చైనా బ్రాండ్లు, కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫోన్ల పనితీరును దెబ్బతీసిన డిస్ప్లే, మదర్బోర్డ్ సమస్యలకు సంబంధించి రిటైలర్ల ఆందోళనల ను పరిష్కరించడం ద్వారా మళ్లీ మార్కెట్‌పై ప ట్టు సాధించేందుకు వన్‌ప్లస్ కసరత్తు చేస్తోంది. వేగవంతమైన రికవరీ, వృద్ధి సాధన కోసం స్థా నిక మార్కెట్లో విస్తరించేందుకు దాదాపు రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. → ప్రీమియం సెగ్మెంట్ (రూ. 30,000 ధర పైన ప్రారంభమయ్యే ఫోన్లు) 20 శాతానికి మించి మార్కెట్ వాటా దక్కించుకోవచ్చు. → కొనుగోలు చేయడానికి ముందు ప్రీమియం ఫోన్లను స్వయంగా చేతిలోకి తీసుకుని, పరిశీలించేందుకు వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఎంచుకుంటున్నారు. అలాగే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత అంశాల మీద ఆసక్తితో వివిధ ఫీచర్ల గురించి అడిగి తెలుసుకుని, కొనుగోలు చేస్తున్నారు. ప్రీమియం సెగ్మెంట్లో అమ్మకాల వృద్ధికి ఇలాంటి ధోరణులు కూడా తోడ్పడుతున్నాయి. -
ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలివే!
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనీస్ బ్రాండులు సంచలనం సృష్టిస్తున్నాయి. కౌంటర్‌పాయింట్ మార్కెట్ మానిటర్ సర్వీసు ప్రకారం, ప్రస్తుతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్షేరులే ఈ బ్రాండులే 48 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా షావోమి, ఒప్పో, వివో, హ్యువాయ్ వంటి బ్రాండులు చైనా బయట మార్కెట్లలోనే రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలుతున్న 10 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలేమిటో ఓసారి చూద్దాం... శాంసంగ్ : స్మార్ట్‌ఫోన్ రారాజుగా గత కొన్నేళ్లుగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీనే కొనసాగుతోంది. 2017 క్యూ 2 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దీని షేరు 22 శాతం. ఈ క్వార్టర్లో దీని స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు స్వల్పంగా 4 శాతం వృద్ధిని నమోదుచేశాయి. ఆపిల్ : కూపర్టినోకి చెందిన ఈ టెక్ దిగ్గజానిది, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండో స్థానం. 11.2 శాతం మార్కెట్ షేరుతో ఇది గ్లోబల్‌గా రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా వెలుగొందుతోంది. హ్యువాయ్ : చైనీస్‌కు చెందిన ఈ బ్రాండు 38.4 మిలియన్ యూనిట్ల షిప్మెంట్లతో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది. ఎమర్జింగ్ మార్కెట్లు ఈ కంపెనీ వృద్ధికి కీలకంగా ఉన్నాయి. ఒప్పో : ఈ బ్రాండుకు చైనా బయటనే ఎక్కువ మార్కెట్ ఉంది. ముఖ్యంగా భారత్‌లో ఒప్పో బ్రాండు గణనీయమైన వృద్ధిని నమోదుచేస్తోంది. గ్లోబల్‌గా 8.4 శాతం మార్కెట్ షేరుతో ఒప్పో నాలుగో అతిపెద్ద బ్రాండుగా ఉన్నట్టు కౌంటర్‌పాయింట్ మార్కెట్ మానిటరీ సర్వీసు చెప్పింది. వివో : ఒప్పో లాగానే భారత మార్కెట్లో వివో కూడా దూసుకెళ్తోంది. దీని మార్కెట్షేరు గ్లోబల్‌గా 6.6 శాతం. షావోమి : ఏడాది ఏడాదికి అతివేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండులలో షావోమి ఒకటి . 23.2 మిలియన్ స్మార్ట్ఫోన్ల షిప్‌మెంట్‌తో గ్లోబల్‌గా 6.6 శాతం మార్కెట్ షేరును ఈ బ్రాండు సొంతం చేసుకుంది. దీంతో ఆరో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా ఇది పేరులోకి వచ్చింది. ఎల్జీ : దక్షిణకొరియాకు చెందిన ఈ బ్రాండు ఆసియా, యూరప్ మార్కెట్లలో మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ కంపెనీ 2017 రెండో క్వార్టర్లో మొత్తం 13.3 మిలియన్ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లను చేపట్టింది. జెడ్‌టీఈ : 3.3 మార్కెట్ షేరుతో ఈ బ్రాండు ఎనిమిదో అతిపెద్ద బ్రాండుగా నిలుస్తోంది. లెనోవో(మోటోరోలాతో కలిపి) : భారత్ లాంటి మార్కెట్లలో లెనోవోకు గట్టిపోటీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ టాప్-10 స్థానాల్లో ఈ బ్రాండు చోటు దక్కించుకుంటూనే ఉంది. అయితే 2016 క్యూ 2లో కలిగి ఉన్న గ్లోబల్ మార్కెట్ షేరునే, 2017 క్యూ 2 లోనూ ఇది కలిగి ఉంది. 3.2 శాతం మార్కెట్ షేరుతో ఇది గ్లోబల్‌గా తొమ్మిదవ స్థానంలో ఉంది. అల్కాటెల్ : గతేడాది కంటే ఈ కంపెనీ మార్కెట్ షేరు పడిపోయింది. అయినప్పటికీ టాప్-10లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది 2.1 శాతంగా ఉన్న దీని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేరు, ఈ ఏడాది 1.3 శాతానికి పడిపోయింది.