ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలివే!
ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలివే!
Published Fri, Aug 4 2017 11:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనీస్ బ్రాండులు సంచలనం సృష్టిస్తున్నాయి. కౌంటర్‌పాయింట్ మార్కెట్ మానిటర్ సర్వీసు ప్రకారం, ప్రస్తుతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌షేరులే ఈ బ్రాండులే 48 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా షావోమి, ఒప్పో, వివో, హ్యువాయ్ వంటి బ్రాండులు చైనా బయట మార్కెట్‌లలోనే రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలుతున్న 10 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలేమిటో ఓసారి చూద్దాం...
శాంసంగ్ : స్మార్ట్‌ఫోన్ రారాజుగా గత కొన్నేళ్లుగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీనే కొనసాగుతోంది. 2017 క్యూ 2 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దీని షేరు 22 శాతం. ఈ క్వార్టర్‌లో దీని స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు స్వల్పంగా 4 శాతం వృద్ధిని నమోదుచేశాయి.
ఆపిల్ : కూపర్టినోకి చెందిన ఈ టెక్ దిగ్గజానిది, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెండో స్థానం. 11.2 శాతం మార్కెట్ షేరుతో ఇది గ్లోబల్‌గా రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా వెలుగొందుతోంది.
హ్యువాయ్ : చైనీస్‌కు చెందిన ఈ బ్రాండు 38.4 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్లతో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది. ఎమర్జింగ్ మార్కెట్‌లు ఈ కంపెనీ వృద్ధికి కీలకంగా ఉన్నాయి.
ఒప్పో : ఈ బ్రాండుకు చైనా బయటనే ఎక్కువ మార్కెట్ ఉంది. ముఖ్యంగా భారత్‌లో ఒప్పో బ్రాండు గణనీయమైన వృద్ధిని నమోదుచేస్తోంది. గ్లోబల్‌గా 8.4 శాతం మార్కెట్ షేరుతో ఒప్పో నాలుగో అతిపెద్ద బ్రాండుగా ఉన్నట్టు కౌంటర్‌పాయింట్ మార్కెట్ మానిటరీ సర్వీసు చెప్పింది.
వివో : ఒప్పో లాగానే భారత మార్కెట్‌లో వివో కూడా దూసుకెళ్తోంది. దీని మార్కెట్‌షేరు గ్లోబల్‌గా 6.6 శాతం.
షావోమి : ఏడాది ఏడాదికి అతివేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండులలో షావోమి ఒకటి . 23.2 మిలియన్ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్‌తో గ్లోబల్‌గా 6.6 శాతం మార్కెట్ షేరును ఈ బ్రాండు సొంతం చేసుకుంది. దీంతో ఆరో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా ఇది పేరులోకి వచ్చింది.
ఎల్జీ : దక్షిణకొరియాకు చెందిన ఈ బ్రాండు ఆసియా, యూరప్ మార్కెట్‌లలో మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ కంపెనీ 2017 రెండో క్వార్టర్‌లో మొత్తం 13.3 మిలియన్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లను చేపట్టింది.
జెడ్‌టీఈ : 3.3 మార్కెట్ షేరుతో ఈ బ్రాండు ఎనిమిదో అతిపెద్ద బ్రాండుగా నిలుస్తోంది.
లెనోవో(మోటోరోలాతో కలిపి) : భారత్ లాంటి మార్కెట్‌లలో లెనోవోకు గట్టిపోటీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ టాప్-10 స్థానాల్లో ఈ బ్రాండు చోటు దక్కించుకుంటూనే ఉంది. అయితే 2016 క్యూ 2లో కలిగి ఉన్న గ్లోబల్ మార్కెట్ షేరునే, 2017 క్యూ 2 లోనూ ఇది కలిగి ఉంది. 3.2 శాతం మార్కెట్ షేరుతో ఇది గ్లోబల్‌గా తొమ్మిదవ స్థానంలో ఉంది.
అల్కాటెల్ : గతేడాది కంటే ఈ కంపెనీ మార్కెట్ షేరు పడిపోయింది. అయినప్పటికీ టాప్-10లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది 2.1 శాతంగా ఉన్న దీని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేరు, ఈ ఏడాది 1.3 శాతానికి పడిపోయింది.
Advertisement
Advertisement