2025లో అధిగమిస్తుందని అంచనా
దన్నుగా ప్రీమియం ఫోన్ల అమ్మకాలు
కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ నివేదిక
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు యాపిల్, శాంసంగ్ విక్రయించే ప్రీమియం డివైజ్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది (2025లో) 50 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,28,900 కోట్లు) చేరవచ్చని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 2021లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పరిమాణం 37.9 బిలియన్ డాలర్లుగా (రూ. 3.25 లక్షల కోట్లు) నమోదైంది. ‘భారతీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ఈ ఏడాది 50 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి, రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది.
ప్రీమియం, అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్లలో ఆకర్షణీయమైన ఆప్షన్లను అందిస్తూ యాపిల్, శాంసంగ్‌లాంటి బ్రాండ్లు మార్కెట్ వృద్ధికి సారథ్యం వహిస్తున్నాయి‘ అని నివేదిక వివరించింది. 2025లో తొలిసారిగా దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సగటు రిటైల్ విక్రయ ధర 300 డాలర్ల మార్కును (సుమారు రూ. 25,700) అధిగమించవచ్చని నివేదిక పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల విభాగం ద్వారా యాపిల్ ఇండియా రూ. 67,122 కోట్లు, శాంసంగ్ రూ. 71,158 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ స్థానికంగా తయారీ, వివిధ ఐఫోన్ల మోడల్స్ ధరల తగ్గింపు వల్ల యాపిల్ విక్రయించే ప్రో మోడల్స్‌కి డిమాండ్ పటిష్టంగా ఉండవచ్చు. అదే సమయంలో మరింత విలువైన ఫీచర్లు ఉండే డివైజ్‌లు, ముఖ్యంగా తమ ఫ్లాగ్‌షిప్ ఎస్ సిరీస్ ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతుండటం శాంసంగ్ అమ్మకాల వృద్ధికి దోహదపడగలవు.
→ అఫోర్డబుల్ ప్రీమియం కేటగిరీలో (రూ. 30,000 – 45,000 ధర శ్రేణి) అధునాతన కెమెరాలు మొదలైన ఫీచర్లను అందించడం ద్వారా వివో, ఒపో, వన్‌ప్లస్ లాంటి → చైనా బ్రాండ్లు, కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫోన్ల పనితీరును దెబ్బతీసిన డిస్‌ప్లే, మదర్‌బోర్డ్ సమస్యలకు సంబంధించి రిటైలర్ల ఆందోళనల ను పరిష్కరించడం ద్వారా మళ్లీ మార్కెట్‌పై ప ట్టు సాధించేందుకు వన్‌ప్లస్ కసరత్తు చేస్తోంది. వేగవంతమైన రికవరీ, వృద్ధి సాధన కోసం స్థా నిక మార్కెట్‌లో విస్తరించేందుకు దాదాపు రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది.
→ ప్రీమియం సెగ్మెంట్ (రూ. 30,000 ధర పైన ప్రారంభమయ్యే ఫోన్లు) 20 శాతానికి మించి మార్కెట్ వాటా దక్కించుకోవచ్చు.
→ కొనుగోలు చేయడానికి ముందు ప్రీమియం ఫోన్లను స్వయంగా చేతిలోకి తీసుకుని, పరిశీలించేందుకు వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఎంచుకుంటున్నారు. అలాగే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత అంశాల మీద ఆసక్తితో వివిధ ఫీచర్ల గురించి అడిగి తెలుసుకుని, కొనుగోలు చేస్తున్నారు. ప్రీమియం సెగ్మెంట్లో
అమ్మకాల వృద్ధికి ఇలాంటి ధోరణులు కూడా తోడ్పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment