Cow slaughter ban law
-
‘గోవధ నిషేధ చట్టం’ తొలగిస్తారా? సిద్ధరామయ్య ఏమ్ననారంటే..
బెంగళూరు: గోవధ నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామంటూ ప్రకటన ఇవ్వడంతో.. నిరసనలను ఉధృతం చేసేందుకు ప్రతిపక్ష బీజేపీ సిద్ధమైంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చిస్తుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే.. ఈ చట్టాన్ని ఎత్తేసే అంశంపై ఏదైనా అడుగుపడిందా? అని మీడియా అడగ్గా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘‘కేబినెట్లో ఈ అంశంపై చర్చించాల్సి ఉంది. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు’’ అని చెప్పారాయన. అంతకు ముందు కర్ణాటక పశుసంవర్థక శాఖ మంత్రి కే వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దున్నపోతుల్ని వధించినప్పుడు.. గోవుల్ని ఎందుకు వధించకూడదు? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గత బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అందులో దున్నపోతుల్ని వధించొచ్చని చెప్పింది. కానీ, గోవుల్ని మాత్రం వధించడానికి వీల్లేదని చెప్పింది. ఈ అంశంపై మేం చర్చించి.. నిర్ణయిస్తాంఅని పేర్కొన్నారాయన. అలాగే.. వయసుపైబడిన ఆవుల్ని వధించడం వల్ల రైతులకు ఉపశనమే తప్పా నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్విటర్లో మండిపడగా.. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 1964 చట్టం ప్రకారం(రద్దైన చట్టం).. 12 ఏళ్లు పైబడిన గోవులను, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడని గోవులను వధించేందుకు వీలుంది. మంత్రి వెంకటేష్ చెప్పాలనుకుంది కూడా అదే. కానీ, ఆయన సరిగా వివరించలేకపోయారు అని సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ మినిస్టర్‌ను సమర్థించారు. కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్‌ను 2020లో తీసుకొచ్చింది కర్ణాటక బీజేపీ సర్కార్. ఆ మరుసటి ఏడాది నుంచి అది అమలు అవుతోంది. దీని ప్రకారం.. కర్ణాటకలో పశువుల్ని వధించడం నిషేధం. ఆవుల్ని, లేగల్ని, ఎదుల్ని పశువుల జాబితాలో చేర్చారు. అయితే.. జబ్బు బారినపడిన పశువుల్ని, 13 ఏళ్ల వయసు పైబడిన గేదెలను(అదీ అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే) మాత్రమే వధించడానికి అనుమతి ఇస్తారు. వాటిని వధించేందుకు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలించడం కూడా నేరంగా పరిగణిస్తారు. కాదని గోవ వధకు పూనుకుంటే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే, రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఈ చట్టం అమల్లో ఉండగా.. కర్ణాటక ఆ జాబితాలో మూడో రాష్ట్రంగా చేరింది. ఇదీ చదవండి: అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా! -
మనుషులను చంపడం కంటే నేరం!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గో సంరక్షణ (ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాటిల్) బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్ 9న ఆమోదించింది. అలాంటి చట్టాలు కలిగిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లు మరీ కఠినంగా ఉంది. ఆవులే కాకుండా ఎద్దులు, లేగ దూడలను చంపడం నేరం. 13 ఏళ్ల లోపు బర్రెలను చంపడం కూడా నేరం. వాటిని స్మగ్లింగ్ చేయడం, ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించడం కూడా నేరం. ఈ నేరాలకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంటే, నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి కారణమైతే విధించే శిక్షకన్నా ఇది పెద్ద శిక్ష. ఉద్దేశ పూర్వకంగా కాకుండా కేవలం నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి బాధ్యుడైన వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి జరిమానాతో కూడిన జైలు శిక్ష కూడా విధిస్తారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు పౌష్టికాహారం కోసం చౌకగా దొరికే ఆవు, ఎద్దు, బర్రె మాంసాలపైనే ఆధారపడతారు. ఇలాంటి చట్టాల వల్ల వారి నోట్లో మట్టిపడుతుంది. ప్రభుత్వమే వారి పౌష్టికాహారం బాధ్యత తీసుకుందనుకుంటే తోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఆ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. వారందరికి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తుందనుకుంటే భారత్‌లో పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. దేశంలో పాడి పరిశ్రమ టర్నోవర్ 6.5 లక్షల కోట్ల రూపాయలు. దేశంలోని రైతులకు గోధుమలు, వరి కలిపి అమ్మితే వచ్చే లాభం కన్నా పాడి పరిశ్రమ వల్ల ఎక్కువ లాభం వస్తోంది. (చదవండి: రణరంగమైన విధాన పరిషత్) డెయిరీలకు పాలను సరఫరా చేసేది ఎక్కువగా పశు పోషకులు, రైతులే. పాలివ్వడం మానేసిన ఆవులను, బర్రెలను, వ్యవసాయానికి పనికి రాని ఎద్దులను కబేలాలకు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బే యాదవులు, రైతుల పాడి పరిశ్రమకు ప్రధాన పెట్టుబడి. అందుబాటులో ఉన్న 2014 సంవత్సరం లెక్కల ప్రకారం మహారాష్ట్రలో పశువులను కబేలాలకు తరలించడం ద్వారా ఏటా వచ్చిన సొమ్ము అక్షరాల 1,180 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా పశు వధ నిషేధం వల్ల రైతులు సరాసరి సగటున నెలవారి ఆదాయం 6,427 రూపాయలను కోల్పోయారని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. 1970లో దేశంలో క్షీర విప్లవాన్ని తీసుకొచ్చిన ‘అముల్’ వ్యవస్థాపకులు వర్గీస్ కురియన్ కూడా మొదటి నుంచి పశు వధ నిషేధ చట్టాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ‘పశు సంపదను, పాడి పరిశ్రమను పరిరక్షించుకోవాలంటే అనారోగ్య, నిరుపయోగ పశువులను కబేలాలకు తరలించడమే ఉత్తమమైన మార్గం’ అని కురియన్, ‘ఐ టూ హ్యాడ్ ఏ డ్రీమ్’ పేరిట రాసుకున్న తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. దేశంలో పనికిరాని పశువుల బాధ్యతలను స్వీకరించి అవి చనిపోయే వరకు మీరుగానీ, మరెవరైనగానీ స్వీకరిస్తారా? అంటూ పూరి శంకరాచార్యను కురియన్ ప్రశ్నించగా, ఆయన తన వద్ద సమాధానం లేదని చెప్పారు. (చదవండి: కర్ణాటక పశు సంరక్షణ) నిషేధం ఉన్న చోట తగ్గుతున్న పశువుల సంఖ్య ‘2019–లైవ్‌స్టాక్ సెన్సెక్స్’ ప్రకారం పశు వధ నిషేధం ఉన్న రాష్ట్రాల్లోనే పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2012 నుంచి 2019 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పశువుల సంఖ్య వరుసగా 10.07, 4.42 శాతం, 3.93 శాతం తగ్గుతూ వచ్చింది. ఎలాంటి నిషేధం లేని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇదే కాలానికి పశువుల సంఖ్య 15.18 శాతం పెరిగింది. ఇదే కాలానికి ఎవరూ పోషించక పోవడంతో రోడ్డున పడ్డ ఊర పశువుల సంఖ్య ఉత్తర ప్రదేశ్‌లో 17.34 శాతం, మధ్యప్రదేశ్‌లో 95 శాతం, గుజరాత్లో 17.59 శాతం పెరగ్గా, అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పశువుల సంఖ్య 73.59 శాతం తగ్గింది. పంటల నష్టం...ప్రాణ నష్టం రోడ్డున పడ్డ పశువుల వల్ల రైతులకు ఓ పక్క పంటల నష్టం వాటిల్లుతుండగా, మరోపక్క పశువుల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరగుతోంది. హర్యానాలో గత రెండేళ్లలో అనాథ పశువులు అడ్డంగా రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 241 మంది మరణించారు. -
ఒక సంస్కరణగానే చూడాలి
గోవధ నిషేధ చట్టంపై కేంద్ర మంత్రి అబ్బాస్ నక్వీ - తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమని ధీమా సాక్షి, హైదరాబాద్: గోవధ నిషేధ చట్టాన్ని మతపరంగా కాకుండా ఓ సంస్కరణగా మాత్రమే చూడాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు. పశువులను ఎలాంటి నియంత్రణ లేకుండా ఎక్కడికక్కడ వధిస్తుండడంతో ఆరోగ్యపరమైన, పర్యావరణ సంబం ధిత సమస్యలు వస్తున్నాయన్నారు. గోవధను కొందరి మనోభావాలతో ముడిపడిన అంశంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే పశువుల మార్కెట్‌ను వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యలను చేపట్టిందన్నారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉందని, చాలా రాష్ట్రాల్లో ఈ నిషేధ చట్టం అమల్లో ఉన్నా కొన్ని రాష్ట్రాలు అమలు చేయడంలేదన్నారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, చింత సాంబమూర్తి, యెండల లక్ష్మీనారాయణ, కృష్ణసాగర్‌రావు తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే బీఫ్ పార్టీలంటూ ఆవులను వధించి బహిరంగంగా ప్రదర్శించడం దేశ సామరస్యతను దెబ్బతీస్తుందని, ఇటువంటి నేరపూరిత చర్యలను ప్రభుత్వం ఉపేక్షించేది లేదని నక్వీ స్పష్టం చేశారు. మోదీ పాలనకు డిస్టింక్షన్...: మూడేళ్ల మోదీ పాలన అర్ధసంవత్సర పరీక్షలనుకుంటే.. వందకు వంద శాతం మార్కులతో డిస్టింక్షన్లో పాసైందన్నారు. తమ మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్ 15 (భారతరత్న అబ్దు ల్ కలాం జయంతి) నుంచి దేశంలోని వంద జిల్లాల్లో ‘తెహరీక్ ఏ తాలీమ్’కింద ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రభుత్వ హాస్టళ్లు, పీహేచ్సీలలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశంలోని 1.82 కోట్ల మంది విద్యార్థులకు రూ.4,740 కోట్ల మేర స్కాలర్షిప్లను పంపిణీ చేశామన్నారు. ఇక్కడా బీజేపీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందనే ధీమాను ముక్తార్ అబ్బాస్ వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీతో, బీజేపీకి తెలంగాణతో అవసరం ఉందన్నారు. తమ పాలనలో చెప్పుకోవడానికి ఏమి లేకనే టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ముందుకు తెచ్చిం దన్నారు. రాజ్యాంగబద్ధత లేనందున ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి అమిత్‌షా చెబుతుంటే ఇక్కడి ప్రభుత్వానికి కోపం వస్తోందన్నారు. ఈ లెక్కలను తాము అడగడం లేదని, ప్రజలే ప్రశ్నిస్తున్నారని అన్నారు. -
దేశవ్యాప్తంగా గోవధ నిషేధం
ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ డిమాండ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం అమలులోకి తీసుకురావాలని రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. గోవధ పేరుతో ఏరకమైన హింసనూ అంగీకరించేది లేదని, ఇందుకోసం ఒక చట్టం తీసుకురావా లని అన్నారు. గో పరిరక్షణ పేరుతో హిం సకు పాల్పడటాన్ని తప్పుబట్టిన ఆయన.. దీని వల్ల అసలు లక్ష్యం పక్కదారి పడుతోం దని చెప్పారు. గోపరిరక్షణకు సంబంధిం చిన చర్యలను మరింత ముమ్మరం చేయాలని, అయితే వీటిని పూర్తిగా చట్టానికి, రాజ్యాంగానికి లోబడి కొనసాగించాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో ఓ ముస్లిం వ్యక్తి గో సంరక్షకుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలుగోవధ నిషేధ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లయితే మిగిలిన రాష్ట్రాలూ దానిని అనుసరించే అవకాశం ఉందన్నారు. అయితే రాజకీయపరమైన కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి రావడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు.