Crime Free Zone
-
యుద్ధ నేరం అంటే ఏమిటి? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏం చేస్తుంది?
ఇజ్రాయెల్- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. తొలుత హమాస్.. ఇజ్రాయెల్‌పై ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకూ 1,300 మంది పౌరులు మరణించగా, గాజా స్ట్రిప్‌లో భారీ విధ్వంసం జరిగింది. హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో యుద్ధ నేరాలకు సంబంధించిన పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకొని యుద్ధ నేరాలలో న్యాయానికి సంబంధించిన సవాళ్లు ఎదురవుతున్నాయి. 1949లో జరిగిన జెనీవా సమావేశం యుద్ధ నేరాలపై చర్చించింది. అప్పుడు యుద్ధంలో అనుసరించాల్సిన నియమాలను రూపొందించారు. అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాలను ప్రతి దేశం ఆమోదించింది. జెనీవా సమావేశంలో సాయుధ పోరాట చట్టం, మానవతా చట్టాలకు సంబంధించిన విధానాల రూపకల్పనను పలు దేశాలు అంగీకరించాయి. యుద్ధ సమయంలో సైన్యం ప్రవర్తన, యుద్ధ ఖైదీల చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించారు. ఈ చట్టాలు హమాస్ ఉగ్రవాదులతో సహా వివిధ దేశాలు, అన్ని వ్యవస్థీకృత సాయుధ సమూహాలకు వర్తిస్తాయి. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోని చిన్నారులు, వృద్ధులు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలాగే ఇజ్రాయెల్ కూడా హమాస్‌పై ఎదురుదాడికి దిగి తీవ్ర నష్టం కలిగించింది. ఈ నేపధ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఈ దేశాలపై అభియోగాలను నమోదు చేస్తుంది. దేశీయ న్యాయస్థానాలు తమ అధికార పరిధిలోని యుద్ధ నేరాల కేసుల్లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాయి. ఏదైనా దేశంలోని పౌరులకు వ్యతిరేకంగా యుద్ధ నేరాలు చోటుచేసుకున్నప్పుడు, బాధిత దేశం చట్టాలను అమలు చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఐసీసీ ఇటువంటి వివాదాల్లో జోక్యం చేసుకుని పరిష్కరిస్తుంది. ఇది కూడా చదవండి: హమాస్‌కు ఆయుధాలు ఎక్కడివి? -
బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు!
లండన్: నేరాల కట్టడికి ప్రపంచమంతటా పోలీసులు గాలితో పందెం వేస్తూ దూసుకెళ్లే అత్యాధునిక వాహనాలను వాడుతున్నారు. కానీ బ్రిటన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా టుక్‌టుక్ (ఈ–రిక్షా)లను రంగంలోకి దించుతోంది. వేల్స్‌లోని గ్వెంట్ కౌంటీ పోలీసులు ఇప్పటికే నాలుగు టుక్‌టుక్‌లు కొనుగోలు చేశారు. స్థానిక న్యూపోర్ట్, అబెర్గ్రావెనీ ప్రాంతాల్లో ర్రాతి వేళల్లో పార్కులు, వాక్‌వేలు, బహిరంగ స్థలాల్లో గస్తీకి వాటిని వాడుతున్నారు. నేరాలు జరిగితే సమీపంలోని ఏ టుక్టుక్నైనా సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. వీటిపై ప్రజల నుంచి విపరీతమైన సానుకూల స్పందన వస్తోందట! అయితే ఈ టుక్‌టుక్‌ల గరిష్ట వేగాన్ని గంటలకు 55 కిలోమీటర్లకు పరిమితం చేయడం మరో విశేషం. ఈ–రిక్షాల సేకరణకు మహీంద్రా ఎలక్ట్రిక్‌తో గ్వెంట్ పోలీసు విభాగం భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
పిల్లల విషయంలో జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: పిల్లల విషయంలో తల్లిదండ్రులు చిన్నతనం నుంచే అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే పెరిగి పెద్దయ్యాక వారు క్రిమినల్స్‌గా, వ్యసనపరులుగా, మానసిక రోగులుగా మారే ప్రమాదం పొంచి ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నగరవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. తాజాగా నగరంలోని మీర్‌పేట పోలీస్‌స్టేసన్ పరిధిలోని ఓ టెన్త్‌క్లాస్ విద్యార్థి అదే కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కుమారుడిని కిడ్నాప్ చేయడం, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్ చేయడాన్ని పరిశీలిస్తే..పిల్లల్లో నేరప్రవృత్తి ఏ స్థాయిలో పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల్లో ఈ నేర ప్రవృత్తి పెరగడానికి ఆన్లైన్ గేమ్స్, సినిమాలు, హర్రర్ సీరియల్స్, పోర్న్ చిత్రాలతో పాటు తల్లిదండ్రుల వైఖరి కూడా ఓ కారణమని మానసిక నిపుణులు విశ్లేస్తున్నారు. సంపాదనే లక్ష్యంగా తల్లిదండ్రులు, ర్యాంకులే లక్ష్యంగా విద్యాలయాలు పని చేస్తుండటమే ఇందుకు మరో కారణమని అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు కనీస సమయం కేటాయించక పోవడం, అవసరం లేకపోయినా సంపద ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం, చేతికి ఖరీదైన స్మార్ట్ఫోన్లు అందివ్వడం వల్ల పిల్లలు విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలుండాలి విద్యాలయాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకుండా చూడాలి. సిగరెట్, పాన్ మసాలల విక్రయాలు నిషేధించాలి. చిన్నతనం నుంచే పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు స్కూలు స్థాయిలోనే కౌన్సిలర్‌ను నియమించాలి. పిల్లలకు సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అనివార్యమైతే ఇంటర్నెట్ లేని కేవలం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సదుపాయం ఉన్న ఫోన్లను మాత్రమే చేతికి ఇవ్వాలి. రోజువారి ఖర్చులకు ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. సంపద ఉంది కదా అని ఖర్చుల కోసం ఇష్టం వచ్చినట్లు వారి చేతికి నగదు, కెడ్రిట్, డెబిట్ కార్డులు ఇవ్వకూడదు. తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. క్రైం రిలేటేడ్ సినిమాలకు బదులు సందేశాత్మక సినిమాలు చూపించాలి. సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించాలి. ఆన్లైన్ గేమ్స్‌కు బదులు ఔట్‌డోర్ గేమ్స్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. టెన్నిస్, క్రికెట్, కరాటే, యోగా వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించడం వల్ల పిల్లలు శారీరకంగా ధృడంగా తయారవడమే కాకుండా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. –డాక్టర్ రాధిక, మానసిక వ్యక్తిత్వ నిపుణురాలు మెదడుపై ‘మత్తు’ ప్రభావం స్కూళ్లు, కాలేజీలకు సమీపంలోనే మద్యం, పాన్‌మసాలా దుకాణాలు ఉన్నాయి. సిగరెట్, ఆల్కహాల్‌ను సొసైటీలో హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. మత్తులో జీవితం గమ్మత్తుగా కన్పిస్తుండటంతో చిన్న వయసులోనే చాలా మంది వీటికి అలవాటు పడుతున్నారు. సిగరెట్, ఆల్కహాల్‌తో మొదలైన ఈ అలవాటు చివరకు గంజాయి, కొకైన్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ వరకు వెళ్తుంది. చిన్న వయసులోనే మత్తుపదార్థాలకు అలవాటు పడటం వల్ల పిల్లలు మొరటుగా, మెండిగా తయారవుతుంటారు. విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తికి అలవాటు పడుతుంటారు. మెదడులో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల నెగటివ్ పర్సనాలిటీ డవలప్ అవుతుంది. చేతిలో డబ్బు లేకుంటే దొంగతనం, బ్లాక్‌మెయిల్‌కు దిగడం, చివరకు కిడ్నాప్‌లు, హత్యలకు కూడా వెనుకాడబోరు. ఒక్కసారి వీటికి అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. ఎదిగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారి ప్రవర్త నపై దృష్టిసారించాలి. ఏది మంచో..ఏది చెడో చిన్నతనం నుంచే వివరించాలి. – డాక్టర్ జయరామ్‌రెడ్డి,వైజేఆర్ డీ అడిక్షన్ సెంటర్ అంతరం పెరుగుతోంది... ప్రస్తుతం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య చాలా అంతరం పెరుగుతోంది. మంచి ర్యాంకులు సాధించాలనే ఆశతో చదువు పేరుతో తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. చదువు, ర్యాంకుల పేరుతో ఉదయం నిద్ర లేచింది మొదలు..రాత్రి పడుకునే వరకు వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. అంతేకాదు ఎదిగే పిల్లలకు ఏది మంచో..ఏదీ చెడో చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా వారికి దూరంగా గడుపుతున్నారు. పిల్లల ఆలోచనలు, అభీష్టాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయ ఆటలకు బదులు ఆన్లైన్ గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ఫోన్లు చేతిలో ఉండటం వల్ల పిల్లలు సోషల్ మీడియాకు ఈజీగా కనెక్ట్ అవుతున్నా రు. సినిమాలు, సీరియల్స్‌లో హీరోయిజం కంటే విలనిజానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో పిల్లలు తమను తాము ఓ హీరోలా భావించుకుంటున్నారు. చిన్నతనంలోనే గంజాయి, ఆల్కాహాల్ వంటికి అవవాటు పడుతున్నారు. – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం -
వివాహేతర బంధమే ప్రాణం తీసింది
సాక్షి, చిత్తూరు రూరల్ : వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. చేసిన తప్పును తెలుసుకుని భర్త వద్దకు తిరిగి చేరుకోవాలన్న మహిళ చివరకు ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ప్రియుడు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లికి చెందిన హరికృష్ణ, కనకదుర్గ(36)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన త్యాగరాజు అనే వ్యక్తితో కనకదుర్గకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త హరికృష్ణ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంతో ఇద్దరూ విడిపోయారు. కనకదుర్గ పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు ఇద్దరు హరికృష్ణ దగ్గరే ఉంటున్నారు. కాగా, చివరకు చేసిన తప్పును తెలుసుకున్న కనకదుర్గ భర్తకు దగ్గర కావాలనుకుంది. గత మూడు రోజులుగా తన పిల్లలతో పాటు భర్తను కలుసుకుని కాపురం కాపురం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు త్యాగరాజు జీర్ణించుకోలేకపోయాడు. శనివారం కనకదుర్గ పుట్టింట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని త్యాగరాజుని మందలించారు. దీంతో కనకదుర్గపై కక్ష పెంచుకున్న త్యాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై మరోమారు దాడికి దిగాడు. చీరతో గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శ్రీధర్, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
జిల్లాల్లో సీసీఎస్‌లపై నజర్
సాక్షి, హైదరాబాద్: నేరాల నియంత్రణ, నేరస్థుల కదలికలపై నిఘాపెట్టడం, నేర రహస్యాల ఛేదనపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల వారీగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ల (సీసీఎస్)ను అందుబాటులోకి తేవాలను కుంటోంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటుగా నేరస్థులపై నిఘా పెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రతీ జిల్లాకు క్లూస్‌టీం: ఉమ్మడి జిల్లాల్లో బలంగా ఉన్న సీసీఎస్‌లను నూతన జిల్లాల్లోనూ ఆధునీకరించేందుకు క్లూస్ టీంలను రంగంలోకి దించనున్నారు. ఏదైనా హత్య జరిగితే ఉమ్మడి జిల్లానుంచే నూతన జిల్లాలకు క్లూస్ టీం రావాల్సి ఉంటోంది. దీనివల్ల కేసులో దర్యాప్తు ఆలస్యమవడం, అనుకున్న సమయంలో నిందితులను పట్టుకోవడం సాధ్యపడటంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాకో క్లూస్ టీం, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్, సంబంధిత బృందాలను ఏర్పాటుచేస్తే దర్యాప్తు వేగవంతమవడంతో పాటు అప్పటికప్పుడు కేసులో పురోగతి చూపడం సాధ్యమవుతుంది. అదేవిధంగా నూతన జిల్లాల్లో ప్రతీ సీసీఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. ఈమేరకు ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బందితో టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని గుర్తించి వారికి సైబర్ టెక్నాలజీ, ఆ నేరాల నియంత్రణ, ట్రాకింగ్ తదితరాలపై శిక్షణ ఇస్తున్నారు. కీలకమైన కేసుల్లో కాల్‌డేటా అనాలసిస్, లొకేషన్ ట్రాకింగ్, ఫేస్ రికగ్నైజేషన్ టూల్స్ విస్తృత వినియోగం, టీఎస్ కాప్ యాప్ డేటా బేస్ వినియోగంపై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల మారుమూల జిల్లాల్లో కేసుల దర్యాప్తును కూడా పూర్తిస్థాయి టెక్నాలజీతో చేయాలని పోలీస్ శాఖ ఈ చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల్లోని సీసీఎస్‌లకు సీనియర్ ఇన్స్పెక్టర్లతో పాటు ముగ్గురు సబ్ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లను కేటాయించనుంది. -
నేర రహిత సమాజమే లక్ష్యం
మంచిర్యాల క్రైం: నేరరహిత సమాజ స్థాపన లక్ష్యంగా నిర్బంధ తనిఖీలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. పట్లణంలోని తిలక్‌నగర్ కాలనీలో మంగళవారం ఉదయం 4నుంచి 8గంటల వరకు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే తిలక్‌నగర్‌లో నిర్బంధ తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణపత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, ఎనిమిది ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. యువత పోలీస్‌మిత్ర వలంటరీగా చేరి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను సీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో బెల్టుషాపుల నిర్వహణతో పాటు గుడుంబా, అంబార్ విక్రయాలు, పేకాట జోరుగా సాగుతున్నాయన్నారు. ఈమేరకు సీపీ స్పందిస్తూ కాలనీకి జనమైత్రి పోలీస్ ఆఫీసర్‌గా గోవింద్ సింగ్ ఏర్పాటు చేశామని, సమస్యలుంటే ఆయనకు తెలియపర్చాలన్నారు. తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, ఏసీపీ గౌస్‌బాబా, సీఐలు చంద్రమౌళి, ప్రమోధ్‌రావు, ప్రతాప్, ట్రాఫిక్ సీఐ సతీష్, జన్నారం, సీసీసీ, లక్సెట్టిపేట, శ్రీరాంపూర్, హాజీపూర్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైమ్ ఫ్రీ జోన్‌గా చిత్తూరు
నేరాల్లో 30శాతం రోడ్డుప్రమాదాలే సీపీవోల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరు (అర్బన్) : చిత్తూరును క్రైమ్ ఫ్రీ జోన్‌గా మార్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. శనివారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో ఏఎస్పీ అభిషేక్ మొహంతితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2016లో 3,970 కేసులు నమోదైతే, 3,099 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం నేరాల్లో 30 శాతాన్ని రోడ్డు ప్రమాదాలు ఆక్రమించడం ఆలోచించాల్సిన విషయమని పేర్కొన్నారు. జిల్లాలో 748 సీసీ కెమెరాలు, 37 హెచ్డీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఉంచామన్నారు. త్వరలోనే జాతీయ, రాష్ట్ర రహదారులపై కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు కిడ్నాప్ గ్యాంగ్‌లను, విదేశాలకు మహిళల్ని తరలించే ముఠాలను సైతం కటకటాల్లోకి పంపించామన్నారు. డయల్–100కు మంచి స్పందన వస్తోందని, 2016లో 23,872 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థలో రెండో విడతగా ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి త్వరలోనే దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎవరైనా మృతి చెందితే ఐడీఎఫ్ (ఇమీడియట్ డెత్ రిలీఫ్ ఫండ్)ను రాష్ట్రంలో మొదటిసారిగా చిత్తూరులోనే ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల కోసం ప్రత్యేక క్యాంటీన్లు, స్టోర్లు ప్రారంభించామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఆరోపణలపై పది మందిని పోలీ సు శాఖ నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో 107 కేసులు నమోదు చేసి 324 మందిని అరెస్టు చేశామన్నారు. 36,618 కిలోల బరువున్న 1,698 దుంగల్ని, 108 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.16.19 కోట్లు ఉంటుందని చెప్పారు. అలాగే 17 మందిపై రౌడీషీట్లు, 26 మందిపై అనుమానిత షీట్లు తెరచామన్నారు. డీఎస్పీలు శ్రీకాంత్, సూర్యనారాయణ, సీఐ వెంకటప్ప, ఎస్ఐ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.