Crimes against children
-
రక్షణ లేని బాల భారతం!
న్యూఢిల్లీ: దేశంలో బాలలపై నేరాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 53,874 పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. బాలలపై జరిగే నేరాల్లో ప్రతి మూడింటిలో ఒకటి లైంగిక నేరమే కావడం గమనార్హం. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. దేశంలో బాలలపై నేరాలకు సంబంధించి 2020లో 1,28,531 కేసులు, 2021లో 1,49,404 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదిలోనే కేసులు 16.2 శాతం పెరిగాయి. 2021లో పోక్సో చట్టం సెక్షన్ 4, 6 కింద 33,348 కేసులు నమోదయ్యాయి. వీటిలో 33,036 కేసులు బాలికలపై జరిగిన అఘాయిత్యాలకు, 312 కేసులు బాలురపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా బాలల అపహరణలకు సంబంధించి గతేడాది 67,245 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక నేరాలు బాలలపై నేరాల వ్యవహారంలో కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 7,783 కేసులు రిజిస్టరయ్యాయి. 2021లో 140 మంది చిన్నారులు అత్యాచారం, ఆపై హత్యకు గురయ్యారు. మరో 1,402 మంది కేవలం హత్యకు గురయ్యారు. అత్యధిక నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే బయటపడ్డాయి. గర్భంలోనే శిశువులను చిదిమేసినట్లు గతేడాది 121 కేసులు రిజిస్టరయ్యాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 23, గుజరాత్లో 23 నమోదయ్యాయి. ఆత్మహత్య చేసుకొనేలా బాలలను ప్రేరేపించినట్లు 359 కేసులు వచ్చాయి. గత ఏడాది 49,535 మంది చిన్నపిల్లలు కనిపించకుండా పోయారు. గతేడాది బాల కార్మిక చట్టం కింద 982 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికంగా 305 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. బాల్యవివాహ నిషేధ చట్టం కింద గతేడాది 1,062 కేసులు పెట్టగా, ఇందులో ఎక్కువ కేసులు కర్ణాటక, తమిళనాడు, అస్సాంలో నమోదయ్యాయి. -
చట్టం దృష్టిలో ఇవి కూడా నేరాలే...
►ఇంట్లో అమ్మాయికి, అబ్బాయికి మధ్య తిండి నుంచి చదువు వరకు, పని నుంచి పెంపకం వరకు వివక్ష చూపించడం, అబ్బాయిని అందలం ఎక్కిస్తూ అమ్మాయిని తక్కువ చేయడం నేరం. అలాగే నెలసరి పేరుతో అమ్మాయిలను ఇంట్లోకి రానివ్వకుండా, వారిని దూరంగా ఉంచడం వంటివి కూడా నేరాలే. ►తాత, తండ్రి, అతని తోబుట్టువులు, సోదరులు, మేనమామ, మామగారు వంటి పురుష కుటుంబ సభ్యులు కుటుంబంలోని అమ్మాయిలను పరుషంగా తిట్టడం, వారి వ్యక్తగత స్వేచ్ఛను హరించేలా తీవ్ర నిఘా పెట్టడం, శీలరక్షణ పేరిట వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించడం, మాట్లాడటం, తాకరాని చోట తాకడం, అసహజంగా ప్రవర్తించడం వంటివన్నీ గృహహింస చట్టం ప్రకారం నేరాల కిందకే వస్తాయి. ►భర్త చనిపోయిన స్త్రీని నేటికీ అశుభసూచకంగా చూస్తున్న దురాచారం ఉంది. ఆమెను అలంకారానికి దూరం చేయడం దగ్గర్నుంచి శుభకార్యాలకు హాజారు కానివ్వకపోవడం, ఎదురుపడితే అరిష్టంగా భావించడం, ఒంటిపూట మాత్రమే తినాలంటే నియమం పెట్టడం, చివరగా ఆమెను ఇంట్లో జీతంలేని పనిమనిషిగా ఖాయం చేయడం వంటివీ నేరాలే. ►నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచకపోవడం కూడా నేరమే. ►భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఇటుకల బట్టీలు, బీడీ కంపెనీలు, పొలాలు వంటి చోట్ల మహిళా కార్మికులు, మహిళా శ్రామికులను శారీరకంగా, మానసికంగా వేధించడం (కులం, రంగు, రూపు గురించి తూలనాడటం, చేయిచేసుకోవడం, కోరిక తీర్చమని ఇబ్బంది పెట్టడం మొదలైనవి) నేరమే! ►పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆడవాళ్లకు టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయకపోవడం,, ఏర్పాటు చేసినా, వాటిలో సరైన వసతులను అంటే తలుపులు లేకపోవడం, బోల్టులు లేకపోవడం, కింద నేల కనిపించేలా తలుపులు ఉండడం, కంతలు, సందులు ఉండడం, టాయ్లెట్లలో నీటి వసతి, మగ్గులు, బకెట్లు లేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం చివరకు పబ్లిక్ టాయ్‌లెట్స్‌కి కాపలాదారు లేకపోవడం కూడా నేరమే. ►అంతేకాదు పబ్లిక్ టాయ్‌లెట్స్‌తో పాటు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లోని గోడల మీద స్త్రీలకు సంబంధించి అసభ్యకరమైన రాతలు రాయడం, అశ్లీలమైన బొమ్మలు వేయడం వంటివి కూడా నేరాలే. ►షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్స్రూమ్స్లో, టాయ్‌లెట్స్‌లలో , సినిమాహాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లోని లేడీస్ టాయ్లెట్స్ల్లో రహస్య కెమెరాలు ఉంచడం నేరం. దీన్ని సైబర్ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు. ►బస్సులు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మహిళలను తాకడం, అసభ్యకరంగా మాట్లాడ్డం, పిచ్చి సైగలు చేయడం, పురుషులు తమ ప్రైవేట్‌పార్ట్స్ చూపించడం వంటి చర్యలు కూడా నేరాలే. -
2018లో మైనర్లపై నేరాలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: 2018.. రాష్ట్రంలో బాలలకు నరకం చూపించిన సంవత్సరం. చంద్రబాబు సర్కారు హయాంలో మైనర్లపై నేరాలు పెరిగిన ఏడాది ఇది. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మైనర్లపై అకృత్యాలు పెరిగిపోయాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ)–2018 నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం... 2016, 2017, 2018 సంవత్సరాల్లో 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. 2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. మైనర్లపై నేరాలకు సంబంధించి 2016లో 1,847 కేసులు, 2017లో 2,397, 2018లో 2,672 కేసులు నమోదయ్యాయి. 2018లో 2,672 ఘోరాల్లో 2,804 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారు. ఎన్సీఆర్బీ–2018 నివేదికలోని ముఖ్యమైన అంశాలు - ఏపీలో 2018లో 40 ఘటనల్లో 52 మంది బాలలు హత్యకు గురికాగా, ఒక బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైంది. 14 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాల కార్మిక నిరోధక చట్టం కింద 143 కేసులు నమోదయ్యాయి. బాలలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో ఒక సైబర్ కేసు నమోదైంది. - వ్యభిచారం రొంపిలో దించేందుకు 22 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రాస్టిట్యూషన్ అండర్ ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్–1956 కింద 14 కేసులు నమోదు చేశారు. - 19 మంది బాలికలకు వివాహాలు చేయడంపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. - జువైనల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసుల నమోదు పెరిగింది. 49 ఘటనల్లో 50 మంది బాధిత బాలికలున్నారు. - ఏపీలో బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార నిరోధక చట్టం(పోక్సో యాక్ట్) కింద 261 కేసులు నమోదు కాగా, 366 మంది బాధితులుగాఉన్నారు. - 2018లో బాలలపై జరిగిన నేరాల్లో ఏపీ పోలీసులు 81.06 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. - చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నింధితులుగా ఉన్న 2,805 మంది పురుషులు, 136 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టాలి ‘‘బాలలపై నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం. ఈ తరహా కేసుల్లో ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా తగిన సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించి, కోర్టులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం, పోలీసులు శ్రద్ధ చూపాలి. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే భయం, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు’’ – ఎన్.రామ్మోహన్, ‘హెల్ప్’ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ -
వింటర్ ‘వార్’
నేటి నుంచి బెళగావిలో శీతాకాల సమావేశాలు చెరుకు మద్దతు ధర విషయమైచట్టసభల బయట పోరు వేలాది మంది రైతులతో సువర్ణ విధానసౌధ ముట్టడికి బీజేపీ సిద్ధం కళంకిత మంత్రులు, చిన్నారులపై అత్యాచారాలు... అస్త్రాలతో ఇరుకున పెట్టేలా వ్యూహం బెంగళూరు: ఈసారి రాష్ట్ర శీతాకాల శాసనసభ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం మునుపెన్నడూ లేనంతగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి ఈనెల 20 వరకూ బెళగావిలోని సువర్ణ విధానసౌధాలో ఈ ఏడాది శీతాకాల సమవేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అటు బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యంగా చట్టసభల్లోనే కాకుండా సమావేశాల భయట కూడా ప్రభుత్వ చర్యలను ఎండగట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ విషయంలో జేడీఎస్ కంటే బీజేపీ ముందువరుసలో ఉంది. ముఖ్యంగా చెరుకు పంటకు మద్దతు ధరను ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే వేలాది మంది రైతుతో సువర్ణ విధానసౌధాను ముట్టడించాలని బీజేపీ వ్యూహం తయారు చేసుకుంది. ఈ ముట్టడిలో బీజేపీ రాష్ట్రశాఖ అ ధ్యక్షుడు ప్రహ్లాద్‌జ్యోషి, మాజీ ముఖ్యమంత్రు లు యడ్యూరప్ప, శెట్టర్తోపాటు కేంద్రమంత్రులైన అనంతకుమార్, సదానందగౌడ, సిద్దేశ్వర్ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. బీజేపీతో పాటు రైతు సంఘం నాయకులు కూడా ఈ ముట్టడిలో పాల్గొనననున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలోని డీకే శివకుమార్, దినేష్ గుండూరావు, మహదేవప్రసాద్, ఖమరుల్ ఇస్లాం, కేజే జార్జ్ వంటి మంత్రులు అధికార దుర్వినియోగం, భూ కబ్జా తదితర వాటిని చట్టసభల్లోపల ప్రధాన అస్త్రంగా విపక్షాలు వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఈ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టనున్నారు. అంతేకాకుండా అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత్ర కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల పాఠశాలల్లోని చిన్నారులపై హత్యాచారాలు పెరిగిపోవడం, పారిశ్రామిక ప్రగతి తిరోగమణ దిశలో ప్రయాణించడం వంటి విషయాల పై కూడా విపక్షాలు సిద్దు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, శెట్టర్ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పలపై వివిధ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయాన్ని ప్రస్తావించి బీజేపీను అడ్డుకోవాలని ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఏదిఏమైనా ఈసారి శీతాకాల సమావేశాలు ఎప్పుడూ లేనంత వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. అందువల్లే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆరువేల మంది పోలీసు సిబ్బందితో గట్టి భద్రతా చర్యలు చేపట్టింది.