‘ఇవి చాలా క్లిష్టమైన రోజులు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోరుున తర్వాత తాను చాలా క్లిష్టమైన రోజులను గడుపుతున్నానని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. ‘ప్రస్తుతం కష్టంగా ఉన్న నా పరిస్థితి అద్భుతంగా ఉందని నేను చెప్పాలనుకోవడం లేదు. నాకు ఇవి చాలా క్లిష్టమైన రోజులు’ అని కాన్ఫరెన్స కాల్లో తన మద్దతుదారులతో ఆమె అన్నారు. ‘మనం బాగా పనిచేశాం. పాపులర్ ఓటులో మనం గెలిచేలా కనిపిస్తున్నాం. మనం కష్టించాం అన్న దానికి అదే నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం హిల్లరీకి 47.72 శాతం, ట్రంప్‌కు 47.41 శాతం పాపులర్ ఓట్లు వచ్చారుు.