crop lone
-
పంట రుణం రూ.1,500 కోట్లు
జిల్లాలోని రైతులకు ఈ ఏడాది రూ.1,500 కోట్ల పంట రుణాలు అందనున్నాయి. బ్యాంకర్లు ఈ మేరకు 2019–20 వ్యవసాయ రుణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏటా జూన్ మాసంలో లీడ్ బ్యాంకు వ్యవసాయ రుణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఆయా బ్యాంకులు రైతులకు ఖరీఫ్, రబీ రుణాలు పంపిణీ చేస్తాయి. లీడ్ బ్యాంకు అధికారుల సమాచారం మేరకు.. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో రుణాల పంపిణీ కోసం లీడ్ బ్యాంకు రూ.1,500 కోట్లతో రుణ ప్రణాళిక రెడీ చేసినట్లు తెలిసింది. కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధ్యక్షతన 21న జిల్లా బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో వ్యవసాయ రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించనున్నారు. బ్యాంకర్ల సమావేశం నిర్వహణ కోసం లీడ్ బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రతులను రెడీ చేస్తూనే మరోవైపు సమావేశానికి రాష్ట్రస్థాయి, జిల్లాలోని బ్యాంకు అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి, వికారాబాద్: వ్యవసాయ రుణ ప్రణాళికను అనుసరించి రైతులకు రూ.1,500 కోట్ల మేర పంట రుణాలు అందజేయనున్నారు. ఖరీఫ్‌లో రూ.900 కోట్ల రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ప్లాన్ సిద్ధం చేశారు. ఖరీఫ్‌లో 1.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు రూ.900 కోట్ల పంటరుణాలను బ్యాంకర్లు అందజేయనున్నారు. జిల్లాలో మొత్తం 14 బ్యాంకులు ఉండగా ఖరీఫ్‌లో అత్యధికంగా ఎస్బీఐ రైతులకు రూ.350 కోట్లకుపైగా రుణాలు అందజేయనుంది. ఆంధ్ర బ్యాంకు రూ.190 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.98 కోట్లు, గ్రామీణ వికాస్ బ్యాంకు రూ.21 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.60 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.52 కోట్లు, కెనరా బ్యాంకు రూ.44 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.31 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.19 కోట్ల రుణాలను రైతులకు అందజేయనున్నాయి. గత ఏడాది రబీలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని శుక్రవారం జరిగే బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయశాఖ బ్యాంకర్లను కోరనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రబీలో సైతం బ్యాంకర్లు రూ.600 కోట్ల రుణాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. రబీలో సైతం ఎస్బీఐ బ్యాంకు అత్యధికంగా రూ.240 కోట్ల మేర రుణాలు ఇవ్వనుంది. అలాగే ఆంధ్రా బ్యాంకు రూ.120 కోట్లు, బరోడా బ్యాంకు రూ.20 కోట్లు, కెనరా బ్యాంకు రూ.29 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.35 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.40 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.65 కోట్లు రుణాలు ఇవ్వనున్నాయి. మిగతా మొత్తాన్ని ఇతర బ్యాంకులు రైతులకు రబీలో రుణంగా అందజేయనున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిఏటా వ్యవసాయరుణ ప్రణాళికకు అనుగుణంగా రైతులకు రుణాలు అందజేయటం తో బ్యాంకులు విఫలం అవుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 50 శాతం మేర మాత్రం రైతులకు రుణాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ ఏడాది వందశాతం రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధ అవుతోంది. అయితే బ్యాంకర్లు ఏమేరకు ఖరీఫ్, రబీలో రుణాలు ఇస్తారో వేచి చూడాలి. -
రూ.1,576 కోట్లు!
ప్రతియేటా పంట రుణం లక్ష్యాన్ని అంతోఇంతో పెంచుతూ.. ఆ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుం టున్న బ్యాంకులు.. ఆ లక్ష్యం మేరకు రైతులకు రుణాలివ్వడంలో విఫలమవుతున్నాయి. ఈసారి కూడా గతేడాది కంటే 8శాతం పెంచి 2019–20 సంవత్సరానికి రూ.1,576 కోట్ల పంట రుణాలివ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించేశాయి. కానీ, ఆ మేరకు లక్ష్యాన్ని చేరుకుంటాయా.. అనేది సందేహాస్పదమే! ఎందుకంటే, 2017–18 కంటే 2018–19లో బ్యాంకులు రుణ లక్ష్యాన్ని 15శాతం పెంచాయి. కానీ, ఆ రెండు పంట కాలాల్లోనూ బ్యాంకులు నిర్ణీత లక్ష్యాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడేమో 2018–19 కంటే 2019–20 సంవత్సరానికి 8శాతం పెంచాయి. మరి ఈ కొత్త లక్ష్యం ఏ మేరకు నెరవేరి.. రైతులకు అండగా నిలబడుతుందో వేచిచూడాలి. ఇదిలా ఉంటే, రుణ లక్ష్యం చేరుకోలేకపోవడం వెనుక బ్యాంకుల వైఫల్యమే కారణమని గతానుభవాలు చెబుతున్నాయి. ఎలాగంటే.. కొత్తగా అప్పు కోసం బ్యాంకుకు వచ్చే రైతులకు ఏవో కొర్రీలు పెడుతుండగా.. పాత రైతులకు ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం రుణాలివ్వడం కుదరదని చెప్పేస్తున్నారు. దీంతో రైతులు బ్యాంకులపై ఆశలు వదులు కొని.. గత్యంతరం లేక బయట అప్పులు చేయాల్సి వ స్తోంది. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారులు అన్నదాత రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. బ్యాంకులే గనక రుణాల మంజూరును సులభతరం చేస్తే.. తామెందుకు వడ్డీ వ్యా పారుల ఉచ్చులో పడతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా రైతుల పరిస్థితి ఎప్పటిలాగే ప్రస్తుతం కూడా ఆగమ్యగోచరంగా మారింది. పంట వేద్దామని ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. రుణాల కోసం బ్యాంకులకు వెళితే ఇస్తారన్న నమ్మకం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే అసలుకే ఎసరు పెడుతున్నారు. ఇలా ప్రతియేటా అన్నదాతల కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ, బ్యాంకులు మాత్రం ఏయేటికాయేడు పంట రుణ లక్ష్యాన్ని పెంచుతూ వస్తున్నామని చాలా ఘనంగా చెబుతున్నాయి. రుణ లక్ష్యాన్ని పెంచుతున్న బ్యాంకులు.. ఆ మేరకు రైతులకు రుణాలను మాత్రం ఇవ్వడం లేదన్నది కాదనలేని సత్యం! కొత్తగా అప్పు కోసం బ్యాంకుకు వచ్చే రైతులకు అంత తొందరగా రుణాలివ్వడం లేదు. పాత రైతులకేమో వారు తీసుకున్న తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని అంటారు. ఇక్కడ కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (పంట రుణ పరిమితి) ఉందని చెప్పి అప్పు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. అది ఖరీఫ్ గానీ.. రబీ గానీ.. ప్రతిసారీ ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగీతిరిగీ అలిసిపోయే రైతులు పంట వేసే సమయం దగ్గర పడగానే వేరే దిక్కు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. అన్నదాత నడ్డి విరుస్తున్న వడ్డీ.. గత్యంతరం లేక తమ దగ్గరికి అప్పు కోసం వస్తున్న రైతులను వడ్డీ వ్యాపారులు నిలువు దోపి డి చేస్తున్నారు. ఆ వడ్డీ.. ఈ వడ్డీ అంటూ అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. ఇక ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లోనైతే ‘దిడి’ పేరిట వడ్డీ దందా కొనసాగుతోంది. దీని ప్రకారం తీసుకున్న అప్పు ను పంటకాలం పూర్తయ్యే వరకు అంటే.. ఆరు నెలలోపే కట్టాల్సి ఉంటుంది. ఈ దిక్కుమాలిన లెక్క ప్రకారం రూ.వెయ్యి అప్పు చేస్తే.. ఇచ్చేట ప్పుడు రూ.500 అదనంగా కట్టాలి. ఈ లెక్క చూ స్తే చాలు.. రైతు ఎంత దోపిడికి గురవుతున్నాడనేది తెలిసిపోతుంది. అదే రూ.20 వేల అప్పు తీసుకుంటే రూ.30 వేలు చెల్లించాలి. ‘దిడి’ దం దాయే కాకుండా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ‘సవా యి’ వడ్డీ కూడా నడుస్తోంది. ఇందులో రూపాయి కి 25 పైసల చొప్పున వడ్డీ లెక్క కడతారు. బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండ, బోథ్, గుడిహత్నూర్, తలమడుగు, తాంసి వంటి మండలాల్లో ఈ రకరకాల వడ్డీలు రైతుల పాలిట శాపంగా మారా యి. ఒకవేళ బ్యాంకులే పూర్తిస్థాయిలో రుణమిచ్చి ఆదుకుంటే రైతులకు ఈ పరిస్థితి ఎదురుకాదు. కీలక సమయంలో ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదనేది సుస్పష్టం! గతంలోనూ ఇంతే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనూ వానాకాలం, యాసంగి సీజన్లకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యంలో బ్యాంకర్లు వెనుకబడ్డారు. జిల్లాలో వానాకాలం పంటలే ప్రధానం. ఈ సమయంలోనే రైతులకు విరివిగా రుణాలివ్వాలి. కానీ, బ్యాంకులు వివిధ కొర్రీలు పెట్టి రైతులను చుట్టూ తిప్పుకోవడం తప్ప ఆశించిన మేర రుణాలిచ్చిన దాఖలాలు చా లా స్వల్పం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ దిశగా ప్రణాళి కలేవీ కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇదిలా ఉంటే, గతేడాది జిల్లాలో 85,501 మంది రైతులు తమ రుణాన్ని రెన్యూవల్ చేసుకున్నారు. మరో 16 వేల మంది చేసుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో రుణ మాఫీ చేస్తారని పలువురు రైతులు పాత బకాయిలు కట్టకపోవడంతోపాటు కొత్త అప్పు కోసం కూడా ప్రయత్నించలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కానీ, ఇదెంత వరకు నిజమో రైతులకు, బ్యాంకర్లకే తెలియాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాల్సిందే.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. కొన్ని బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు చేయడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి బ్యాంకులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటి వరకు బ్యాంకు రుణం పొందని రైతులు బ్యాంకులకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు బయట అప్పులు తీసుకోవద్దు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు కలిసి రైతులు బ్యాంకు రుణాలే తీసుకునేలా అవగాహన కల్పించాలి.– జీవీఆర్ఎస్కె ప్రసాద్, లీక్ బ్యాంకు మేనేజర్, ఆదిలాబాద్ రెండేళ్లుగా తిరుగుతున్నా.. రెండేళ్ల కిందట విరాసత్ కింద ఐదెకరాలకు నా పేరు మీదా పట్టా అయింది. ఈ పట్టా తీసుకొని బ్యాంకుల చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నా పంట రుణం ఇవ్వడం లేదు. అదేమిటంటే పాత రైతులకు ఇచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. తీరా అందరికీ ఇచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్తే రుణం ఇచ్చే గడువు అయిపోయిందని చెప్పి దాట వేస్తున్నారు. బ్యాంకు రుణం దొరక్క రెండేళ్లుగా రూ.45 వేల చొప్పున బయట వ్యాపారుల దగ్గర వడ్డీకి తీసుకున్నా. ఈ వానాకాలం పంటల ముందైనా బ్యాంకు రుణం ఇప్పించాలి. కుంరం గజానంద్, రైతు, పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండలం -
రుణాలు అందేనా?!
సాక్షి, మెదక్: పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా(కుదువ) పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల సాగు పెట్టుబడి ఏటా పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గురువారం ప్రకటించిన పరపతి విధానంలో పూచీకత్తు లేకుండా పొందే పంట రుణ పరిమితిని రూ.1.60 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రైతులకు మేలు చేయనుంది. ఇకపై రైతులు తనఖా పెట్టకుండానే రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి ఇది అమలు కానుంది. దీంతో జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. మెదక్ జిల్లాలో 2.50 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో ప్రతీ ఏడాది 1.50 లక్షల మంది రైతులు వేర్వేరు బ్యాంకుల్లో వ్యవసాయ పంట రుణాలు తీసుకుంటున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణలోకి తీసుకుని పంటల వారిగా రైతులకు బ్యాంకర్లు రుణాలు అందిస్తుంటారు. రైతులు పంట రుణాలు పొందాలంటే తప్పనిసరిగా తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టాల్సిందే. ఎలాంటి పూచీకత్తు లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణాలు ఇవ్వాలని నిబంధన ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల బ్యాంకర్లు తప్పనిసరిగా తనఖా పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి తనఖా లేకుండా రైతులు రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రుణ పరిమితి పెరగడం వల్ల రైతులు పంటల సాగుకు అవసరమైన డబ్బుల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఎకరాకు ఇచ్చే ఆర్థిక సహాయం రూ.10వేలకు పెంచనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు రూ.6 ఆర్థిక సహాయ అందజేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. బ్యాంకర్ల తీరు మారేనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఆర్బీఐ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే బ్యాంకర్ల తీరు మాత్రం రైతులకు ఏమాత్రం మింగుడుపడని విధంగా ఉంది. ప్రతీ ఏటా బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యం పెట్టుకున్నప్పటికీ రెండేళ్లుగా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.720 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.450 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. రబీలో రూ.480 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా డిసెంబర్ వరకు రూ.60 కోట్ల రుణాలు ఇచ్చారు. రైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. తనఖా లేకుండా రుణాలు ఇచ్చే మొత్తాన్ని రూ.1.60 లక్షలకు పెంచిన నేపథ్యంలో రుణాల మంజూరులో బ్యాంకర్ల వైఖరి మారుతుందో లేదో వేచి చూడాలి. ఆర్బీఐ నిర్ణయంతో రైతులకు మేలు : పరశురాం నాయక్ తనఖా లేకుండా ఇచ్చే పంట రుణాల పరిమితిని ఆర్బీఐ రూ.1.60 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం రైతులకు మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. తనఖా లేకుండా పంట రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతాయన్నారు. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలవాలని కోరారు. -
తొలి జన్మభూమిలోనే యూటర్న్
రుణ మాఫీపై చంద్రబాబు మరో మాట హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: పంట రుణాలు అనో, లక్షన్నరలోపు రుణాలు మాత్రమేననో కాకుండా... వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. తమ రుణాలన్నీ మాఫీ అవుతాయన్న ఆశతో రైతులు వేసిన ఓట్లే ఆయన్ను సీఎంను చేశాయి. ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి రుణ మాఫీపై రకరకాల షరతులు పెడుతూ... చివరికి తొలివిడత ‘జన్మభూమి’లోనే అడ్డం తిరిగారు చంద్రబాబు. గురువారం విజయవాడలో మాట్లాడుతూ... ఏడాదికి 20 శాతం చొప్పున బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తామని, ఐదేళ్లలో రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తామని కుండ బద్దలుగొట్టేయటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వారు తమ రుణాల్ని ఏడాదిలోపు చెల్లిస్తేనే వడ్డీ మాఫీ అవుతుంది. ఏడాది దాటిపోయింది కనక ఏటా 14 శాతం వడ్డీని భరించాల్సిందే. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణాలు రూ.87వేల కోట్లు. డ్వాక్రా మహిళల రుణాలు మరో 14వేల కోట్లు. అంటే 1.01 లక్షల కోట్లు. దీనిపై ఏటా వడ్డీయే రూ.14 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఏడాదికి 20 శాతం చొప్పున అంటే... ఏటా 20వేల కోట్లు చెల్లించినా దాన్లో వడ్డీ పోను అసలు రూ.6వేల కోట్లు మించి ఉండదు. ఇలాగైతే తాము రుణ విముక్తులం కావటానికి 17 ఏళ్లకు పైనే పడుతుందన్నది రైతుల లెక్క. చంద్రబాబు ఏటా 20 శాతం చెల్లిస్తామని చెబుతున్నారు. ఇటీవల రుణవిముక్తి కమిటీ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ తొలి ఏడాది రుణ మాఫీ కార్పొరేషన్‌కు రూ.7వేల కోట్లు కేటాయిస్తామన్నారు. అంటే అసలు కాదుకదా వడ్డీ కూడా సగమే చెల్లిస్తున్నట్టన్న మాట. ఇలాగైతే మాఫీ ఎప్పటికవుతుంది? ఆ లెక్కన ఐదేళ్లలో రైతుల్ని రుణ విముక్తుల్ని చేయాలంటే... రుణ మాఫీ పరిధిలోకి వచ్చే వారిని భారీగా తొలగించి, అతికొద్దిమందికే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణ బకాయిలు రూ.14వేల కోట్లు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు... ఇపుడు రూ.7600 కోట్ల మేర మాత్రమే డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానని చెబుతున్నారు. మిగిలిన సగం రుణాల మాటేమిటి? రైతులు, డ్వాక్రా మహిళల నుంచి వస్తున్న ఈ ప్రశ్నలన్నటికీ ప్రస్తుతానికైతే సమాధానాలు లేవు.