Crore Business
-
యూజ్డ్ కార్లు @ కోటి.. పాత కారు టాప్ గేరు!
న్యూఢిల్లీ: పాత కార్ల అమ్మకాలు 2023లో దేశవ్యాప్తంగా 46 లక్షల యూనిట్లు దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య ఏటా 1 కోటి యూనిట్లను దాటుతుందని కార్స్24 తాజా నివేదిక వెల్లడించింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం.. 2030 నాటికి యూజ్డ్ కార్ల విభాగం సగటు వార్షిక వృద్ధి ఏటా 13% నమోదు కానుంది. ఈ లెక్కన వార్షిక అమ్మకాలు ఆ సమయానికి 1.08 కోట్ల యూని ట్లకు చేరుకుంటాయి. పాత కార్లకు డి మాండ్ నగరాలు, పట్టణాల్లో దూసుకెళ్లనుంది. మహా రా ష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ జోరును నడిపిస్తున్నా యి. మరింత చవక, ఆధారపడదగిన ఎంపికల కోసం వినియోగదార్ల ప్రాధాన్యతలు మారుతు న్నందున కొత్త కార్ల మార్కెట్‌తో పోలిస్తే యూజ్డ్ కార్ల మార్కెట్ పురోగమిస్తోంది. పాత కార్ల విపణిలో 2024లో 16.7 శాతం వాటాతో ఎస్‌యూవీలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎస్‌యూవీల డిజైన్, సామర్థ్యం, ప్రీమియం ఆకర్షణలు పట్టణ, గ్రామీణ కస్టమర్లకు ఇష్టమైనవిగా మారాయి. వ్యక్తిగత వాహనాలకు.. కోవిడ్ అనంతర కాలంలో వినియోగదారుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు కనిపించింది. షేర్డ్ మొబిలిటీ కంటే సౌలభ్యం, భద్రత కోసం 12 శాతం మంది కార్ల కొనుగోలుదారులు వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెట్రో, నాన్–మెట్రో నగరాల్లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా మారుతీ సుజుకీ స్విఫ్ట్ అవతరించింది. అలాగే హ్యుండై శాంట్రో, టాటా టియాగో ఎన్ఆర్జి, మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్ వంటి మోడళ్లు అసాధారణ రీసేల్ విలువను స్థిరంగా అందించాయి. బడ్జెట్ స్పృహ, విలువను చూసే కొనుగోలుదారులలో ఈ మోడళ్లకు ప్రజాదరణ పటిష్టంగా ఉంది. కొత్త కార్ల ఫైనాన్సింగ్ గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఫైనాన్సింగ్ వాటా 2010లో 60 శాతం నుండి 2024లో 84 శాతానికి చేరింది అని నివేదిక వివరించింది. నూతన వాహనాల కోసం రుణాలపై వినియోగదారులు ఆధారపడుతున్నారని చెప్పేందుకు ఈ గణాంకాలు నిదర్శనమని కార్స్24 కో–ఫౌండర్ గజేంద్ర జంగిద్ తెలిపారు.→ 2023లో అమ్ముడైన పాత కార్లు 46 లక్షల యూనిట్లు → 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్లకు విక్రయాలు → యూజ్డ్ కార్ల విపణి సగటు వార్షిక వృద్ధి ఏటా 13% → ఎస్‌యూవీలదే హవా. వీటి వాటా 2024లో 16.7 శాతం → కొత్త కార్ల ఫైనాన్సింగ్ వాటా 2010లో 60 శాతం. 2024లో 84 శాతానికి చేరిక. → వ్యక్తిగత వాహనాలకే 12 % మంది మొగ్గు → అత్యంత డిమాండ్ ఉన్న మోడల్ మారుతీ సుజుకీ స్విఫ్ట్ -
2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం లక్ష్యంగా చేసుకుంది. 2015-16లో సంస్థ 23 శాతంపైగా వృద్ధితో రూ.508 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నాలుగు శాఖలతో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంకు వచ్చే అయిదేళ్లలో మరో 12 శాఖలను తెరువనుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని నగరాల్లో అడుగు పెడతామని బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ కేడియా తెలిపారు. అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 18వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా సీఈవో ఏ.కె.గోయల్‌తో కలసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తామన్నారు. నికర నిరర్ధక ఆస్తులు 2.98 శాతం నుంచి 2.70కు తగ్గించినట్లు తెలిపారు. షెడ్యూల్డ్ బ్యాంక్ హోదాను రెండేళ్లలో దక్కించుకుంటామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించారు. కాగా, 2015- 16 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.15 డివిడెండు చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది. -
మొరం... అక్రమార్కుల పరం
నియోజకవర్గంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సహజ వనరులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి.. ఎలాంటి అనుమతి లేకుండా మొరం తవ్వకాలు చేపట్టిన అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు.. అధికారులు తనిఖీకి వస్తే మామూళ్లతో సరిపెడుతున్నారు.. వారి ఉదాసీనత వల్ల కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి.. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతోంది.. - యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు - ఏటా *2 కోట్ల వ్యాపారం - చోద్యం చూస్తున్న అధికారులు మండలంలోని అనంతపురం గుట్టల్లో, జమ్ములమ్మ రిజర్వాయర్ దగ్గర, కొండపల్లి, ముల్కలపల్లి పరిసర ప్రాంతాల్లో, సంగాల చెరువుశిఖం భూమిలో యంత్రాలతో అక్రమార్కులు మొరం తవ్వుతున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా యథే చ్ఛగా ఇతర ప్రాంతాలకు మొరంమట్టి తరలిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ శివారులోని పారిశ్రామికవాడకు కేటాయించిన స్థలంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. అలాంటిది అక్రమార్కులు సమతుల్యంగా ఉన్న భూమిని సైతం సుమారు పది అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. ఇలా మూడు ప్రాంతాల్లో అక్రమంగా తవ్వి యథేచ్ఛగా మొరంమట్టిని తరలిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ధరూర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే, నెట్టెంపాడు పనుల కోసం గతంలో మట్టి తవ్వకాలు జరపడానికి అనుమతులు తీసుకున్న కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరించిన విషయం విదితమే. అనుమతులు ఇచ్చిన క్వారీల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వర్షాకాలంలో మొరం కోసం తవ్విన గోతులు నీటితో నిండిపోతున్నాయి. గట్టు మండలంలోని ఆలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలను అక్రమంగా కొల్లగొట్టి మొరం తరలించారు. మల్థకల్ మండలంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. లక్షల్లో వ్యాపారం... అక్రమార్కులు నిత్యం లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. గద్వాలలో కొనసాగుతున్న అక్రమ క్వారీల నుంచి ప్రతిరోజూ వందకుపైగా ట్రాక్టర్ ట్రిప్పుల మొరం తరలివెళుతోంది. మొరం రకాన్ని బట్టి ట్రిప్పు *400 నుంచి *600 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన నెలకు *15 లక్షల మొరం దందా అక్రమంగా కొనసాగుతోంది. అంటే ఏడాదికి *రెండు కోట్ల వరకు అక్రమార్కులు దండుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు బడా కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టే కోట్ల రూపాయల పనులకు క్వారీ అనుమతులు తీసుకుంటున్నారు. మిగిలినచోట్ల మోటా కాంట్రాక్టర్లు, మండల, గ్రామస్థాయి నాయకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దీనిని రోడ్లు, భవన నిర్మాణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న అక్రమార్కులకు కొందరు అధికారులు వంతపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇకనైనా ఈ వ్యవహారంపై జిల్లా పాలనా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరముంది.