ఆదివారం సంస్కృతం
బెంగళూరు కబ్బన్ పార్క్‌లో ఆదివారం ఉదయం వెళితే వేరే లోకానికి వచ్చామా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చేరిన ఒక బృందం మాట్లాడినా ఆడినా చర్చించినా వాడే భాష సంస్కృతం.అంతరించిపోయే దశలో ఉన్న సంస్కృతం ఆ పచ్చని చెట్ల మధ్య చివురులేస్తోంది.సమష్టి గుబ్బి అనే అమ్మాయి ఉచితంగా సంస్కృతం నేర్పడమే కారణం.‘శాన్‌స్క్రీట్ వీకెండ్’ అనే ఈ కార్యక్రమం అన్ని చోట్లకూ విస్తరించేలా ఉంది.బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో ఆదివారం ఉదయం వెళితే ఎవరో ఒకరు ఎదురు పడి ‘తవనామధేయం కిమ్?’ అంటారు. ‘మీ పేరేమిటి?’ అని ఆ మాటకు అర్థం. ‘మెలనెన బహు సంతోషహ’ అంటారు. ‘మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’. ‘అహం సమష్టి’ అని పరిచయం చేసుకుంటారు. ‘నా పేరు సమష్టి’ అని దానికి అర్థం. కన్నడ, తెలుగు, తమిళం మాతృభాషగా కలిగిన బెంగళూరు వాసులు ఆ భాషను లేదా ఇంగ్లిష్‌ను మాట్లాడి మాట్లాడి విసుగు చెంది ఉంటే నాలుక గుండా వెలువడే సంస్కృతం మాటలు కొత్త ఉత్తేజాన్ని, సరదాని కలిగిస్తాయి. అందుకే రెండు నెలల క్రితం కబ్బన్ ΄ార్క్లో మొదలైన ‘శాన్‌స్క్రీట్ వీకెండ్’ కార్యక్రమం పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ముంబై, పూణె నగరాలకు వ్యాపించే దాకా వెళ్లింది.‘స్థాయి’ సంస్థ చొరవతోబెంగళూరులోని ‘స్థాయి’ సంస్థ సంస్కృత భాష పునరుద్ధరణకు అంకితమైంది. ఈ తరానికి సంస్కృతం పరిచయం చేయడం కోసం సంస్కృతంలో పాటలు, షార్ట్‌ఫిల్మ్‌లు, పాఠాలు తయారుచేసి యూట్యూబ్‌లో పెడుతోంది. దానిని స్థాపించిన సమష్టి గుబ్బి నేరుగా కూడా సంస్కృతాన్ని పరిచయం చేద్దామని నిశ్చయించుకుని కబ్బన్ ΄ార్క్లో ఆదివారం పూట సంస్కృతం నేర్పే ఇన్ఫార్మల్ క్లాసులను మొదలెట్టింది. మొదటివారం కేవలం ఆమె స్నేహితులు మాత్రమే వచ్చారు. కాని రెండోవారానికి నోటి మాటతో కొత్తవాళ్ల రాక మొదలైంది. ఇప్పుడు ప్రతి వారాంతం చాలామంది నాగా పెట్టకుండా వచ్చి సంస్కృతం నేర్చుకుంటున్నారు. ‘అది పాఠ్యాంశంగా కాకుండా రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగపడేలా నేర్పడం వల్ల అందరికీ ఆసక్తి ఏర్పడుతోంది’ అంటోంది సమష్టి.సామాన్యుల భాషే‘సంస్కృతం దేవతల భాష అంటారు. అది సామాన్యుల భాషే. ఇతర దేశాల వాళ్లు వాళ్ల ్ర΄ాచీన భాషలు మాట్లాడితే మనం ఆశ్చర్యపోము. కాని భారతీయులు సంస్కృతం మాట్లాడటం ఎందుకు ఆశ్చర్యకరం. సంస్కృతంలో సినిమాలు, నాటకాలు, ΄ాటలు, ΄ాడ్కాస్ట్లు చేయొచ్చు’ అంటుంది సమష్టి. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ సంస్కృత గ్రామర్ చదువుకున్న సమష్టి ‘శాన్‌స్క్రిట్ స్పారో’ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి సంస్కృత మాటలు నేర్పసాగింది. అది కబ్బన్ ΄ార్క్లు ముఖాముఖి కార్యక్రమంగా మారింది. సంస్కృత భాష వ్యాప్తి కోసం సమష్టి తన బృందాన్ని తీసుకుని బైక్‌మీద కొత్త ్ర΄ాంతాలకు వెళ్లి సంస్కృతాన్ని ప్రచారం చేస్తోంది. దీనికి ‘శాన్‌స్క్రిట్ రైడ్’ అని పేరు పెట్టింది. ‘శివమొగ్గ జిల్లాలోని మట్టూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడతారు. అందుకే అది సంస్కృత గ్రామంగా వాసికెక్కింది. నా బృందాన్ని ఆ ఊరికి తీసుకెళ్లాను’ అని చెప్పింది సమష్టి. ‘మార్కుల కోసం స్కూళ్లలో కాలేజీల్లో చాలా మంది సంస్కృతం చదివారు. కాని నిజజీవితంలో ఉపయోగించరు. అలాంటి వాళ్లంతా మా సంస్కృత ఆదివారాల గురించి విని సంస్కృతాన్ని తలుచుకుంటున్నారు. అది సంతోషం’ అంది సమష్టి. ఆమె తన బృందం చేత హిందీ ΄ాటలను సంస్కృతంలో డబ్ చేయించి ΄ాడిస్తుంది. ‘మై హూ డాన్’ ΄ాటను ‘అహం డాన్ అస్మి’ అని ΄ాడుతుంటే కేరింతలు వినిపిస్తాయి. ఏ భాష అయినా ఇంత సరదాగా, సజీవంగా ఉంటే ఎందుకు అంతరిస్తుంది?