ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు చుక్కెదురు
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కల్చరల్ సెంటర్‌ను తెరిచేందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. జేఎన్టీయూ కమిటి ఎత్తిచూపే లోపాలను మూడు నెలలలోపు సరిచేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల అనంతరం జేఎన్టీయూ కమిటీ మరోసారి ఎఫ్‌ఎన్‌సీసీని పరిశీలించాలని తెలిపింది. అప్పటివరకు కేవలం మరమ్మతులు చేసుకునేందుకు మాత్రమే ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. పది మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌పై కేసునమోదైంది.