current line
-
ఈ ప్రాణం ఖరీదెంత?
మధ్యాహ్నం ఒంటిగంట సమయం..బడి గంట కొట్టగానే వడివడిగా బయటికొచ్చారా దోస్తులు.. రోజులాగే ఒకే సైకిల్‌పై ఇళ్లకు బయలుదేరారు.. చక్రాలు జోరుగా ముందుకు కదిలాయి.. కాళ్లు చేతులూ ఆడిస్తున్నారు.. ఎప్పట్లాగే ఏంచక్కా ముచ్చట్లాడుతున్నారు.. నవ్వుతూ.. తూలుతూముందుకు సాగుతున్నారు... ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం.. తలో దిక్కు పడ్డారు.. అందాక ఆడిన ఆ కాళ్లూ చేతులు కదలకుండా పడి ఉన్నాయి.. మాటలు మూగబోయాయి.. నవ్వులు ఎప్పుడోమాయమయ్యాయి.. ఉన్నట్లుండి చిన్నారుల శరీరంపై మంటలు.. ఏమైంది.. ఏమవుతుంది.... ఆ పాత కథే.. ప్రజా భద్రత ప్రశ్నార్థకంగా మారి.. తీగలా అల్లుకుపోయిన నిర్లక్ష్యపు కథే... అధికారుల అలసత్వం అనాలా.. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అనాలా.. ఎవరినంటేనేం.. ఏమంటేనేం.. వందేళ్లు బతకాల్సినఓ నిండు ప్రాణం మొగ్గలోనే నేల రాలింది... ‘ఊపిరి’ పోసుకునేందుకు మరో ప్రాణం తల్లడిల్లుతోంది.... ఈ పాపం ఎవరిది...? ఈ శిక్ష ఎవరికి..? రోడ్లపై గుంతలా పూడ్చరు.. మురుగు కాలువ వైపుఅస్సలు తొంగి చూడరు.. గజిబిజిగా కరెంటు వైర్లు.. గందరగోళంగా కనెక్షన్లు.. పని పనికో ఖరీదు కడతారు... ప్రతి సర్వీసుకో బేరమాడతారు! ఈ నిండు ప్రాణం ఖరీదెంత? ఆ కుటుంబం జీవితాంతం పడే వేదనంత! పిల్లాడొస్తాడని గుమ్మం కాడే నిలబడి చూసే తల్లి ఎదురుచూపులంత!ఈ నిర్లక్ష్యం వెల ఎంత? పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేనంత.. జీవించే హక్కును కాలరాసేంత... నిన్న మురుగు కాలువ.. నేడు కరెంటు తీగ..పిల్లల పాలిటమృత్యు పాశాలవుతున్నాయ్..తల్లిదండ్రుల జీవితానికి సరిపడా చేదు జ్ఞాపకాలు మిగిలిస్తున్నాయ్.. కడప అర్బన్ : తెలిసీ తెలియని వయసు పిల్లలు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని సైకిల్లో మధ్యాహ్నం తాము చదువుతున్న పాఠశాల నుంచి ఇంటికి బయలు దేరారు. విద్యుత్ సరఫరా ఉన్న కరెంట్ లైన్‌కున్న తీగ వేలాడుతూ వీరికి చుట్టుకుంది. అంతే తమకు తెలియకుండానే ప్రమాదానికి గురయ్యారు. శరీరంపై యమపాశంలా విద్యుత్ తీగ పడుతుందని భావించలేకపోయారు. మంటలు చెలరేగాయి. వీరిద్దరి శరీరాలపై విద్యుత్ తీగ పడిన ప్రదేశమంతా కాలిపోయాయి. ఆ సమయంలో అదే వీధిగుండా ద్విచక్రవాహనంలో వస్తున్న వ్యక్తి వెంటనే ఈ దృశ్యాన్ని చూసి వెంటనే మరో వ్యక్తితో కలిసి కట్టెతో విద్యుత్తీగను వేరు చేశారు. స్థానిక ప్రజల సహకారంతో ఇద్దరు పిల్లలను కడప నగరంలోని క్రిస్టియన్లైన్లో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్లో చికిత్స కోసం తరలించారు. సంఘటన స్థలాన్ని, ఆసుపత్రిని కడప టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్ఐ ఎస్‌కెఎం హుసేన్ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు.క్షణాల్లో సంఘటన ..క్షణాలలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బెల్లంమండివీధిలో నివాసం ఉంటున్న అబ్దుల్ రహిమాన్ పెద్దకుమారుడు ఖురేషి తంజువుర్ రహిమాన్ (11) హాస్పిటల్‌కు తీసుకొచ్చిన కొంతసేపటికి మృతి చెందాడు. మరోబాలుడు ఆటోడ్రైవర్ అజ్మత్‌ఆలీ చిన్నకుమారుడు షేక్ అద్నాన్ (11) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరు సైకిల్‌పై ప్రతి రోజూ తమ ఇంటి నుంచి బయలుదేరి రోడ్డుకు అవతలవైపు ఇంటర్నేషనల్ కల్యాణమండపం సమీపంలో ఉన్న విద్యాసాగర్ స్కూల్లో ఐదోతరగతి చదువుతున్నారు. బుధవారం కూడా సైకిల్‌పై తమ స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో టైటానిక్ బిల్డింగ్ లైన్లో విద్యుత్ తీగ వేలాడుతూ ఉండటం గమనించలేకపోయారు. విద్యుత్ తీగ తగలడంతోనే సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు కుప్పకూలిపడిపోవడం, మంటలన్నీ వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయాయి. విద్యుత్ అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యమే ఈ విషాద ఘటనకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. విద్యుత్ ప్రమాదం సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి మర్రెడ్డి అనురాధ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద సంఘటన వివరాలను కడప లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి అద్నాన్ తండ్రి ఆజ్మత్ ఆలీని, కుటుంబసభ్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.నా కుమారుడిని బ్రతికించండి సార్ : అద్నాన్ తండ్రి నా కుమారుడు అద్నాన్, తన స్నేహితుడు రహిమాన్‌తో కలిసి ఐదోతరగతి చదువుతున్నాడు. ఇద్దరు కలిసి మెలిసి సైకిల్లో స్కూల్‌కు వెళ్లి వచ్చేవారు. అలాంటిది కరెంట్ తీగ తగిలి రహిమాన్ చనిపోవడం, తన కుమారుడు తీవ్రంగా గాయపడటం బాధాకరం. నా కుమారుడిని ఎలాగైనా బ్రతికించండి అంటూ వైద్యులను వేడుకుంటున్నాడు. స్పెషల్ డ్రైవ్ ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారిస్తాం – ఎమ్మెల్యే మాధవి కడప నగరంలో ఇష్టానుసారంగా రోడ్లకు సమీపంలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలతోపాటు, ఇతర సంస్థలకు సంబంధించిన వైర్లు కూడా చుట్టి ఉన్నాయనీ తమ పరిశీలనలో తేలింది. స్పెషల్ డ్రైవ్ ద్వారా అడ్డదిడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్థంభాలను విద్యుత్ అధికారుల ద్వారా తొలగింపచేస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థి మృతికి వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. Of what value is life in India? Two students caught between live wires hanging on streets of Kadapa #AndhraPradesh near International Welfare Mandapam. Students studying class 10 & 8 were enroute to Vidyasagar school when they ran into severed live wires. One unfortunately… pic.twitter.com/P2lRPZTqR7— Nabila Jamal (@nabilajamal_) August 21, 2024 -
కాటేసిన కరెంటు తీగలు
వేలాడుతున్న కరెంటు తీగలే మృత్యుపాశాలయ్యూరుు. అందరు చూస్తుండగానే అన్నదాత ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశారుు. పశుగ్రాసం తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో రైతు మృతదేహం దాదాపుగా కాలిపోరుుంది. పంటల సాగే కాదు.. పశుపోషణా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో పొరుగూరు నుంచి పశుగ్రాసాన్ని తరలిస్తూ కష్టజీవి మృత్యువాత పడడం చూపరులను కంటతడి పెట్టించింది. మరోచోట బోరుబావిలో పైపు దించుతున్న అన్నదాత కూడా కరెంటు తీగలకు బలయ్యూడు. పరకాలరూరల్: మండలంలోని నడికూడ శివారులోని గొల్లపల్లిలో విద్యుత్ తీగలు తగిలి రైతన్న మృతిచెందాడు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. కంఠాత్మకూరు గ్రామానికి చెందిన బాసిక బిక్షపతి(45) ఎకరం వరి, మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాల్లేక పొలం బీడుగా మారింది. తన పశువులకు మేత కరువైంది. అత్తగారి ఊరు పులిగిల్ల నుంచి గడ్డి తెచ్చేందుకు ట్రాక్టర్లో గ్రామస్తులు చేరాలు, కొంరయ్య, రవితో కలిసి గురువారం ఉదయం వెళ్లారు. సాయంత్రం గడ్డిలోడ్తో తిరుగుపయనమయ్యూరు. దారిలో కరెంటు తీగలను తప్పించేందుకు బిక్షపతి గడ్డిపైనే ఉన్నాడు. తాను పడిపోకుండా ఉండేందుకు నడుము, కాళ్లను కట్టేసుకున్నాడు. ముందు కూర్చున్న కూలీలు అప్రమత్తం చేస్తుండగా విద్యుత్ తీగలను తప్పిస్తూ వచ్చాడు. గొల్లపల్లి శివారులో డ్రైవర్ రమేశ్ ఒక్కసారిగా ట్రాక్టర్‌ను ముందుకు ఉరికించాడు. అదే సమయంలో 11కేవీ తీగలు తగిలి బిక్షపతి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం పూర్తిగా కాలిపోరుుంది. స్థానికుల అరుపులతో అప్రమత్తమైన డ్రైవర్.. ఇంజిన్ భాగాన్ని వేరు చేశాడు. ఫైరింజన్ వచ్చి మంటలార్పేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఎస్సై వినయ్‌కుమార్ ప్రయత్నించగా బిక్షపతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం జరిగిందని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. విద్యుత్ ఏఈ కన్నయ్య హామీ మేరకు ఆందోళన విరమించారు. ఒకే రోజు ఇంట్లో, అత్తారింట్లోనూ అందరితో సరదాగా గడిపిన బిక్షపతి మరణాన్ని కుటుంబసభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బిక్షపతికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ నేతాని సులోచన, నడికూడ, ధర్మారం, కంఠాత్మకూర్ సర్పంచులు సర్పంచ్ రావుల పద్మ, అయిలయ్య, గుండెబోయిన రాజు, ఎంపీటీసీ సభ్యుడు దురిశెట్టి చంద్రమౌళి పరామర్శించారు.