కాటేసిన కరెంటు తీగలు
వేలాడుతున్న కరెంటు తీగలే మృత్యుపాశాలయ్యూరుు. అందరు చూస్తుండగానే అన్నదాత ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశారుు. పశుగ్రాసం తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో రైతు మృతదేహం దాదాపుగా కాలిపోరుుంది. పంటల సాగే కాదు.. పశుపోషణా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో పొరుగూరు నుంచి పశుగ్రాసాన్ని తరలిస్తూ కష్టజీవి మృత్యువాత పడడం చూపరులను కంటతడి పెట్టించింది. మరోచోట బోరుబావిలో పైపు దించుతున్న అన్నదాత కూడా కరెంటు తీగలకు బలయ్యూడు.
పరకాలరూరల్: మండలంలోని నడికూడ శివారులోని గొల్లపల్లిలో విద్యుత్ తీగలు తగిలి రైతన్న మృతిచెందాడు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. కంఠాత్మకూరు గ్రామానికి చెందిన బాసిక బిక్షపతి(45) ఎకరం వరి, మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాల్లేక పొలం బీడుగా మారింది. తన పశువులకు మేత కరువైంది. అత్తగారి ఊరు పులిగిల్ల నుంచి గడ్డి తెచ్చేందుకు ట్రాక్టర్‌లో గ్రామస్తులు చేరాలు, కొంరయ్య, రవితో కలిసి గురువారం ఉదయం వెళ్లారు. సాయంత్రం గడ్డిలోడ్‌తో తిరుగుపయనమయ్యూరు. దారిలో కరెంటు తీగలను తప్పించేందుకు బిక్షపతి గడ్డిపైనే ఉన్నాడు. తాను పడిపోకుండా ఉండేందుకు నడుము, కాళ్లను కట్టేసుకున్నాడు.
ముందు కూర్చున్న కూలీలు అప్రమత్తం చేస్తుండగా విద్యుత్ తీగలను తప్పిస్తూ వచ్చాడు. గొల్లపల్లి శివారులో డ్రైవర్ రమేశ్ ఒక్కసారిగా ట్రాక్టర్‌ను ముందుకు ఉరికించాడు. అదే సమయంలో 11కేవీ తీగలు తగిలి బిక్షపతి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం పూర్తిగా కాలిపోరుుంది. స్థానికుల అరుపులతో అప్రమత్తమైన డ్రైవర్.. ఇంజిన్ భాగాన్ని వేరు చేశాడు. ఫైరింజన్ వచ్చి మంటలార్పేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఎస్సై వినయ్‌కుమార్ ప్రయత్నించగా బిక్షపతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం జరిగిందని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. విద్యుత్ ఏఈ కన్నయ్య హామీ మేరకు ఆందోళన విరమించారు.
ఒకే రోజు ఇంట్లో, అత్తారింట్లోనూ అందరితో సరదాగా గడిపిన బిక్షపతి మరణాన్ని కుటుంబసభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బిక్షపతికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ నేతాని సులోచన, నడికూడ, ధర్మారం, కంఠాత్మకూర్ సర్పంచులు సర్పంచ్ రావుల పద్మ, అయిలయ్య, గుండెబోయిన రాజు, ఎంపీటీసీ సభ్యుడు దురిశెట్టి చంద్రమౌళి పరామర్శించారు.