cute video
-
భార్యతో మనోజ్ క్యూట్ వీడియో
-
కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ
-
కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ కూడా ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా కూతురు అర్హతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లాడిలా మారిపోతాడు బన్నీ. ఇప్పటికే అర్హకు సంబంధించిన పలు క్యూట్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోలను షేర్ చేశాడు బన్నీ. ఇందులో అర్హ గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. అదేంటి అని అడగ్గా.. జున్ను అని బన్నీ సమాధానం ఇస్తాడు. అందుకు అర్హ.. అవును నీకెలా తెలుసు అంటూ క్యూట్‌గా అడిగింది. ఇక ఈసారి నాలుగు ఎర్ర లారీలు.. నాలుగు తెల్ల లారీలు అనే లైన్‌ను వేగంగా, కరెక్ట్‌గా చెప్పాలంటూ టంగ్ ట్విస్టర్ ఇస్తుంది. అయితే ఈ ఛాలెంజ్‌లో ఫాస్ట్‌గా చెప్పలేక అల్లు అర్జున్ ఓడిపోతాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. -
చిట్టిచేతులతో అమ్మకోసం డిన్నర్.. వీడియో వైరల్..
బుడి బుడి అడుగులు వేసే ఓ రెండేళ్ల పసిపాప తన తల్లికోసం పసిప్రాయంలోనే చెఫ్‌గా మారింది. చిట్టిచేతులతో కూరగాయలు కట్ చేసి ప్రత్యేకంగా డిన్నర్ తయారు చేసింది. ఈ చిన్నారి ఎంతో ఓపికతో ఇష్టంగా ఆహారం వండిన తీరు నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేసింది. ఆగస్టు చివరి వారంలో అప్లోడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నారి స్వయంగా కూరగాయలు కట్ చేసింది. వాటిని జాగ్రత్తగా బాయిలర్‌లో పెట్టింది. పాప పని చేస్తూనే క్యారట్ కొరుక్కుని తినడం చాలా క్యూట్‌గా అనిపించింది. అంతేకాదు ఆ తర్వాత చికెన్ కూడా వండింది. టిక్‌టిక్‌టిక్ అంటూ చికెన్ ముక్కలను ఎయిర్ ఫ్రయర్లో వేసింది. ఓ పాకెట్ రైస్‌ను మైక్రోవేవ్‌లో పెట్టి దానికి కాస్త ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసింది. ఆ తర్వాత రైస్‌ను ఓ బౌల్లోకి తీసుకుంది. చివరకు మొత్తం డిన్నర్‌ను ప్రిపేర్ చేసి టేబుల్‌పై పెట్టింది ఈ పసిపాప. ఆ తర్వత ఆమె తల్లి వచ్చాక.. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ డిన్నర్ చాలా రుచిగా ఉందంటూ తల్లి కూతుర్ని మెచ్చుకుని మురిసిపోయింది. ఈ క్షణం కోసం, తన వ్యక్తిగత చెఫ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. చిన్నారి వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. వావ్, అమేజింగ్ అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Bruna Fava and Natalie (@natalieandbruna) చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
బుజ్జాయి అమేజింగ్ వీడియో!
సృష్టిలో మధురమైనది అమ్మ మాట. తీయనైనది అమ్మ పిలుపు. మరీ అలాంటి అమ్మ మాట తొలిసారి చెవినపడినప్పుడు.. బిడ్డ స్పందన ఎలా ఉంటుంది. వెయ్యి నక్షత్రాలు ఒక్కసారిగా వెలిగినట్టు.. లక్ష చందమామలు చల్లని వెన్నెల కురిపించినట్టు.. సృష్టిలోని ఆనందమంతా కుప్ప పోసి తనపై గుమ్మరించినట్టు అనిపిస్తుంది కదా! ఆ అనుభూతికి అద్దం పట్టేది ఈ వీడియో. ఈ బుజ్జాయికి పుట్టుకతో చెవులు వినపడవు. అతను అందరినీ చూడటం తప్పించి ఎలాంటి ధ్వనులు అతని చెవికి చేరేవి కావు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఇయరింగ్ ఎయిడ్ (ధ్వనులు వినే మిషిన్)ను అమర్చారు. ఆ తర్వాత తొలిసారి అమ్మ తనతో మాట్లాడినప్పుడు.. ఆ బుజ్జాయి ఎంతగా ఆనందిస్తూ.. నవ్వులు కురిపించాడో మీరే చూడండి.. ఈ వీడియోలో..! -
బుజ్జాయి అమేజింగ్ వీడియో!