
బుజ్జాయి అమేజింగ్ వీడియో!
సృష్టిలో మధురమైనది అమ్మ మాట. తీయనైనది అమ్మ పిలుపు. మరీ అలాంటి అమ్మ మాట తొలిసారి చెవినపడినప్పుడు.. బిడ్డ స్పందన ఎలా ఉంటుంది. వెయ్యి నక్షత్రాలు ఒక్కసారిగా వెలిగినట్టు.. లక్ష చందమామలు చల్లని వెన్నెల కురిపించినట్టు.. సృష్టిలోని ఆనందమంతా కుప్ప పోసి తనపై గుమ్మరించినట్టు అనిపిస్తుంది కదా! ఆ అనుభూతికి అద్దం పట్టేది ఈ వీడియో. ఈ బుజ్జాయికి పుట్టుకతో చెవులు వినపడవు. అతను అందరినీ చూడటం తప్పించి ఎలాంటి ధ్వనులు అతని చెవికి చేరేవి కావు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఇయరింగ్ ఎయిడ్ (ధ్వనులు వినే మిషిన్)ను అమర్చారు. ఆ తర్వాత తొలిసారి అమ్మ తనతో మాట్లాడినప్పుడు.. ఆ బుజ్జాయి ఎంతగా ఆనందిస్తూ.. నవ్వులు కురిపించాడో మీరే చూడండి.. ఈ వీడియోలో..!