Dabulbed Room
-
‘రెవెన్యూ’లో స్తబ్దత
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సందడి నెలకొంది. మరో నెలన్నర కాలంలో పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో చివరి స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్టాండింగ్ కమిటీ నియామకం జరిగినా కేవలం 34 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అయినా చివరి స్టాండింగ్ కమిటీలో చోటు కోసం ఆశావాహుల నుంచి భారీగానే పోటీ పెరిగింది. జూలై 2తో పాలకవర్గం గడువు ముగియనుంది. నగరపాలక సంస్థలో పూర్తిస్థాయి బలం టీఆర్ఎస్కు మాత్రమే ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్కు చెందిన 15 మంది సభ్యులకు మూడు దఫాల్లో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగే అవకాశం దక్కింది. చివరి కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు మేయర్, ఎమ్మెల్యేలకు విన్నవిస్తున్నారు. సహచర కార్పొరేటర్ల మద్దతు కూడగడుతున్నారు. గతంలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మూడు సార్లు పోటీలో ఉండేందుకు ఆసక్తిచూపించినప్పటికీ ఎమ్మెల్యే, మేయర్ సూచనలతో పోటీ నుంచి తప్పుకున్నామని, ఈసారి మాత్రం తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని కొంతమంది కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. దీంతో ఈ చివరి కమిటీలో ఎవరికి స్థానం దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు గతంలో జరిగిన మూడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ దీటుగా రెవెన్యూ ఉద్యోగులు తమ పనులను పూర్తి చేసుకోని 5 గంటలకే తాళాలు వేసి ప్రభుత్వానికి తెలిసేలా నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు అధికారులంతా పోలింగ్ విధుల్లో తలమునకలయ్యారు. తర్వాత సాధారణ విధుల్లో చేరడంతో కార్యాలయానికి వచ్చే పౌరుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రక్షాళన అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా డీలాపడ్డారు. మొత్తంగా కొన్ని రోజులు తహసీల్ కార్యాలయాలకు తాకిడి తగ్గుముఖం పట్టింది. నాడు గృహనిర్మాణ.. రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో అంటే 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల ఆనంతరం కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు అధికంగా సాగుతున్నాయని, పెద్దగా పనికూడా లేదంటూ గృహ నిర్మాణ శాఖను రద్దు చేసింది. కాంగ్రెస్ హయాంలో రూ.70 వేల నుంచి రూ.లక్ష చొప్పున అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. అప్పట్లో తీవ్ర అవినీతి సాగిందని, కొందరు నాయకులు తమకు ఇష్టం వచ్చిన వారికి ఇళ్లను మంజూరు చేయించారని, కనీసం వాటిని నిర్మించిన పాపాన పోలేదనే ఆరోపణలు వినిపించాయి. ఒక ఇంటికే రెండు నుంచి నాలుగుసార్లు బిల్లులు పొందారని, ప్రభుత్వ లక్ష్యం ఏ మాత్రం నెరవేరలేదనే అసంతృప్తులు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని కొన్ని మండలాలను ఎంపిక చేసి విచారణ చేయించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని డివిజన్లో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు దుమారాని లేపిన విషయం విదితమే. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నివేదిక సైతం అందించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు చదివిన తర్వాత అవినీతి పెచ్చుమీరినట్లు గమనించారు. పైగా టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఏకంగా రూ.5.04 లక్షలు ఇస్తానంటూ ఎన్నికల్లో ప్రకటించింది. ఈ పనులన్నీ గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిస్తారని అంతా భావించినప్పటికీ చివరకు ప్రభుత్వం శాఖను రద్దు చేసి, నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖలకు కట్టబెట్టింది. అప్పట్లో ఆ శాఖలో హౌసింగ్‌లో పని చేస్తున్న పదుల సంఖ్యలోని వర్క్ ఇన్స్పెక్టర్లను, ఏఈలను నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు బదలాయించింది. తాజాగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరిట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగంలో గుబులు మొదలైంది. గతంలో గృహ నిర్మాణ శాఖకు తలెత్తిన పరిస్థితి నెలకొంటుందన్న ఆందోళన.. ఉత్కంఠ రెవెన్యూ సిబ్బందిలో మొదలైంది. కీలకం కానున్న ధరణి... రెవెన్యూ శాఖను రద్దు చేసి ఆ శాఖలోని వీఆర్వోలను పంచాయతీరాజ్ శాఖకు, గిర్దవార్, ఉపతహసీల్దారు, తహసీల్దార్లను వ్యవసాయ శాఖలోకి పంపిస్తారంటూ విసృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో రెవెన్యూ ఉద్యోగులు కొంత మేరకు ఆందోళన చెందుతున్నారు. సామాన్య ప్రజానీకంలోనూ చర్చనీయాంశంగా మారింది. భూములకు సంబంధించి వ్యవహరాలన్నింటినీ ధరణి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న కీలక శాఖ మీద ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
పల్లెల్లో డబుల్ కు ట్రబుల్
♦ ఒక్కో ఇంటిపై అదనంగా రూ.70 వేల భారం ♦ అంచనా వ్యయం సవరించాలంటున్న కాంట్రాక్టర్లు ♦ గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు పడకల’పై సందిగ్ధత ♦ ప్రభుత్వ నిర్ణయం కోసం యంత్రాంగం ఎదురుచూపు ♦ ఆ లోపు పట్టణాల్లో నిర్మాణాల ప్రారంభానికి సన్నాహాలు మంజూరైన ఇళ్లు: 6,850 గ్రామీణ ప్రాంతాలకు: 3,610 పట్టణ ప్రాంతాలకు: 3,240 నిర్మించే స్థలాలు: 105 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రెండు పడక గదుల ఇళ్ల’ నిర్మాణ అంచనా వ్యయం లెక్క తప్పింది. నిర్దేశిత యూనిట్ విలువకు అనుగుణంగా ఇళ్లను నిర్మించలేమని కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేశాయి. ఒక ఇంటి యూనిట్ విలువను సగటున రూ.70వేలు పెంచితే తప్ప.. డబుల్‌బె డ్రూం ఇళ్ల నిర్మాణంలో ముందడుగు వేయలేమని తేల్చిచెప్పాయి. యూనిట్ విలువను రాష్ర్టస్థాయిలో ఖరారు చేసినందున.. ప్రభుత్వ నిర్ణయం కోసం జిల్లా యంత్రాంగం ఎదురుచూస్తోంది. ప్రతిపాదిత వ్యయాన్ని సవరిస్తే తప్ప పునాదిరాయి పడే అవకాశం లేకపోవడంతో టె ండర్ల ప్రక్రియ చేపట్టేందుకు వెనుకడుగు వేస్తోంది. ఈ పరిస్థితి గ్రామాల్లో నిర్మించే ఇళ్ల విషయంలోనే ఎదురవుతుండడంతో దీనిపై విధానపర నిర్ణయం తీసుకునేలోపు పట్టణ ప్రాంతాల్లో (మున్సిపాలిటీ) ఇళ్ల నిర్మాణాలను చేపట్టడానికి యంత్రాంగం ప్రణాళికలు తయారు చేస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి పట్టణాల్లో నో ప్రాబ్లమ్ గ్రామీణ ప్రాంతాల తో పోలిస్తే పట్టణాల్లో ప్రభుత్వం ఖ రారు చేసిన ధరకే ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టు సంస్థలు అంగీకరించాయి. జీ+1, అపై అంతస్తులతో జరిగే అపార్ట్మెంట్ల నిర్మాణంతో యూనిట్ విలువ కలిసివస్తుందని అంచనా వేసిన కాంట్రాక్టర్లు నిర్దేశిత ధరకే గృహ నిర్మాణాలను చేపట్టగలమనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తాండూరు, వికారాబాద్, బడంగ్‌పేట, మేడ్చల్, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీలతోపాటు శివార్లలోని ఫీర్జాదిగూడ, చెంగిచర్ల, ఘట్కేసర్, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, జిల్లెల్గూడ పంచాయతీల్లో జీ+1+2+3 భవనాల్లో ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వం ఏప్రిల్‌లో వీటికి పునాదిరాయి వేసే దిశగా ఆలోచన సాగిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: డబుల్బెడ్రూం పథకం కింద జిల్లాకు 6,850 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,610, పట్టణ ప్రాంతాల్లో 3,240 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లావ్యాప్తంగా 105 చోట్ల ఈ మేరకు ఇళ్లను నిర్మించేందుకు స్థలాలను కూడా ఎంపిక చేసింది. కాగా, స్థలాల లభ్యతకు అనుగుణంగా ప్రస్తుతం పల్లెల్లో 3,290, పట్టణాల్లో 1,160 ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ తయారు చేసింది. యూనిట్ విలువను కూడా ఇదివరకే ఖరారు చేసిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని భావించింది. అయితే, నిర్దేశిత వ్యయానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ విలువ (ఒక ఇల్లు) రూ.5.04 లక్షలు. దీంట్లో కేంద్రం రూ.35వేలు, రాష్ట్రం రూ.4.69 లక్షలను సబ్సిడీ రూపంలో అందజేస్తోంది. అదే పట్టణ ప్రాంతంలో యూనిట్ కాస్ట్ రూ.5.30లక్షలు. దీంట్లో కేంద్రం రూ.లక్ష, రాష్ట్రం రూ.4.30 లక్షలను రాయితీగా భరిస్తోంది. తొలిదశలో 78 గ్రామాల్లో సగటున 20 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం.. లేఅవుట్లను కూడా కొలిక్కి తెచ్చింది. ఇక ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలనుకుంటున్న తరుణంలో కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తుండడం అధికారులను కలవరపరుస్తోంది. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడూల్స్ ఆఫ్ రేట్స్) రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం యూనిట్ విలువను ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని కాంట్రాక్టు ఏజెన్సీలు అంటున్నాయి. ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రాతిపదికన పల్లె ప్రాంతంలో ఒక గృహాన్ని నిర్మించాలంటే రూ.5.98 లక్షల వ్యయం అవుతుందని లెక్క తేల్చాయి. చేవెళ్లలోని గ్రామాల్లో ఇళ్లను నిర్మించేందుకు ఈ మేరకు కోట్ చే యడంతో బిత్తెరపోయిన యంత్రాంగం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఒక్కో ఇంటికి అదనంగా రూ.70వేల భారం భరించాల్సి రావడం.. జిల్లా వ్యాప్తంగా ఈ భారం రూ.25.27 కోట్లు కావడంతో యంత్రాంగానికి ఎటూ పాలుపోవడంలేదు. ఈ నేపథ్యంలో తడిసిమోపెడవుతున్న అంచనా వ్యయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేగానీ టెండర్లను పిలిచే అవకాశం కనిపించడంలేదు. రాష్ట్ర స్థాయిలో విధానపర నిర్ణయం తీసుకునేలోపు పట్టణ ప్రాంతాల్లో జీ+1 (గ్రౌండ్ + అంతస్తులు) గృహాసముదాయాల నిర్మాణాలను మొదలు పెట్టేదిశగా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేస్తోంది. ఇదిలావుండగా, గృహ నిర్మాణ వ్యయంలో 13.5శాతాన్ని కాంట్రాక్టర్‌కు ప్రాఫిట్ బెన్ఫిట్ కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ‘లబ్ధిదారులకే ఇళ్ల నిర్మాణ బాధ్యతలను బదలాయిస్తే.. అదనపు భారం నుంచి సర్కారుకు వెసులుబాటు దక్కుతుంది. డిజైన్‌కు అనుగుణంగా సొంత స్థలాల్లో నిర్మించుకునే వీలు కలిగిస్తే స్థలాల కొరతను కూడా అధిగమించవచ్చని’ గృహనిర్మాణరంగ నిపుణులు అంటున్నారు. -
గూడు దొరికేనా?
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు లేనట్టేనా..? సొంతింటి కోసం నిరుపేదలకు తప్పని నిరీక్షణ మన ప్రణాళికలో 2లక్షల దరఖాస్తులు నల్లగొండ టుటౌన్ : నిలువ నీడ లేక అద్దె ఇళ్లల్లో, గుడిసెల్లో నివసించే నిరుపేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్, కిచెన్, హాల్‌తో కూడిన ఇల్లు నిర్మించి ఇస్తాం.. ఇది సార్వత్రి ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ.. కానీ ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఇప్పటి వరకు డబుల్‌బెడ్ రూమ్ పథకంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకే ఇటీవల బకాయిల కింద నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. జిల్లాలో సొంతిళ్లులేని వారు లక్షల్లోనే ఉన్నారు. వీరంతా గూడు కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకే నిధులు... ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో 2006 నుంచి 2014 ఏప్రిల్ వరకు వివిధ దశల్లో ప్రభుత్వం మొత్తం 4.20 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో గత ఏప్రిల్ నెలాఖరు వరకు 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా మరో 60 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరో లక్షా 10 వేల ఇళ్లను లబ్ధిదారులు అసలు ప్రారంభించనేలేదు. గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిల కింద జిల్లాకు 20 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కేవలం బకాయిలు చెల్లించడంతో పాటు వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే డబ్బులు చెల్లించడానికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక ఇంటిని కూడా మంజూరు చేయలేదు. ఈ ఏడాది ఇళ్ల మంజూరు లే నట్టేనా..? తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీపై లక్షల మంది లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వీరి ఆశలు ఈఏడాది ఫలించేలా కనిపించడంలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల అయితే ముగిసిపోనుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇక ఈ సంవత్సరం ఇళ్ల మంజూరు కలగానే మిగిలే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఈ ఏడాది అంతా ఇళ్ల నిర్మాణంపై ఆశలు పెట్టుకున్న వారికి అడియాశలుగానే మిగిలేఉన్నాయి. మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఇక వీటిపై నిర్ణయం తీసుకునేది ఎప్పుడు, నిధుల మంజూరు ఎలా, అనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తీరు చూస్తుంటే ఇక ఈ సంవత్సరం కొత్త పథకం వచ్చే అవకాశం ఉండకపోవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ‘మన ప్రణాళిక ద్వారా 2 లక్షల దరఖాస్తులు గత ఏడాది వరకు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఆర్థిక భారంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారు లక్ష 10 మంది ఉన్నారు. అదే విధంగా కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తరువాత నిర్వహించిన మన వార్డు మన ప్రణాళిక, మన పట్టణం, మన వార్డు ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది కొత్త ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఎస్సీలకైతే రూ. లక్ష, ఎస్టీలకైతే రూ. 1.10 లక్షలు, ఇతరులకు 70 వేల రూపాయలు ఇచ్చేది. పెరిగిన ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కనీసం కట్టడానికి కూడా సరిపోవని చాలా మందికి ఇళ్లు మంజూరు అయినా నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. కానీ ప్రభుత్వం 3.50 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్, కిచెన్, హాల్ నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో మన వార్డు మన ప్రణాళిక లో 2 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.