‘రెవెన్యూ’లో స్తబ్దత  | Standing Election Commission In Telangana | Sakshi
Sakshi News home page

‘రెవెన్యూ’లో స్తబ్దత 

Published Mon, May 20 2019 9:16 AM | Last Updated on Mon, May 20 2019 9:16 AM

Standing Election Commission In Telangana - Sakshi

కరీంనగర్‌కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో రాజకీయ సందడి నెలకొంది. మరో నెలన్నర కాలంలో పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో చివరి స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల కోసం కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్టాండింగ్‌ కమిటీ నియామకం జరిగినా కేవలం 34 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అయినా చివరి స్టాండింగ్‌ కమిటీలో చోటు కోసం ఆశావాహుల నుంచి భారీగానే పోటీ పెరిగింది. జూలై 2తో పాలకవర్గం గడువు ముగియనుంది. నగరపాలక సంస్థలో పూర్తిస్థాయి బలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు చెందిన 15 మంది సభ్యులకు మూడు దఫాల్లో స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా కొనసాగే అవకాశం దక్కింది.

చివరి కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు మేయర్, ఎమ్మెల్యేలకు విన్నవిస్తున్నారు. సహచర కార్పొరేటర్ల మద్దతు కూడగడుతున్నారు. గతంలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో మూడు సార్లు పోటీలో ఉండేందుకు ఆసక్తిచూపించినప్పటికీ ఎమ్మెల్యే, మేయర్‌ సూచనలతో పోటీ నుంచి తప్పుకున్నామని, ఈసారి మాత్రం తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని కొంతమంది కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.

దీంతో ఈ చివరి కమిటీలో ఎవరికి స్థానం దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు గతంలో జరిగిన మూడు స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ దీటుగా రెవెన్యూ ఉద్యోగులు తమ పనులను పూర్తి చేసుకోని 5 గంటలకే తాళాలు వేసి ప్రభుత్వానికి తెలిసేలా నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు అధికారులంతా పోలింగ్‌ విధుల్లో తలమునకలయ్యారు. తర్వాత సాధారణ విధుల్లో చేరడంతో కార్యాలయానికి వచ్చే పౌరుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రక్షాళన అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా డీలాపడ్డారు. మొత్తంగా కొన్ని రోజులు తహసీల్‌ కార్యాలయాలకు తాకిడి తగ్గుముఖం పట్టింది.
 
నాడు గృహనిర్మాణ..
రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో అంటే 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల ఆనంతరం కొలువుదీరిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు అధికంగా సాగుతున్నాయని, పెద్దగా పనికూడా లేదంటూ గృహ నిర్మాణ శాఖను రద్దు చేసింది. కాంగ్రెస్‌ హయాంలో రూ.70 వేల నుంచి రూ.లక్ష చొప్పున అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. అప్పట్లో తీవ్ర అవినీతి సాగిందని, కొందరు నాయకులు తమకు ఇష్టం వచ్చిన వారికి ఇళ్లను మంజూరు చేయించారని, కనీసం వాటిని నిర్మించిన పాపాన పోలేదనే ఆరోపణలు వినిపించాయి. ఒక ఇంటికే రెండు నుంచి నాలుగుసార్లు బిల్లులు పొందారని, ప్రభుత్వ లక్ష్యం ఏ మాత్రం నెరవేరలేదనే అసంతృప్తులు ఉన్నాయి.

వాటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని కొన్ని మండలాలను ఎంపిక చేసి విచారణ చేయించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని డివిజన్‌లో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు దుమారాని లేపిన విషయం విదితమే. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నివేదిక సైతం అందించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు చదివిన తర్వాత అవినీతి పెచ్చుమీరినట్లు గమనించారు.

పైగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి ఏకంగా రూ.5.04 లక్షలు ఇస్తానంటూ ఎన్నికల్లో ప్రకటించింది. ఈ పనులన్నీ గృహనిర్మాణ శాఖ  ఆధ్వర్యంలో కొనసాగిస్తారని అంతా భావించినప్పటికీ చివరకు ప్రభుత్వం శాఖను రద్దు చేసి, నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖలకు కట్టబెట్టింది. అప్పట్లో ఆ శాఖలో హౌసింగ్‌లో పని చేస్తున్న పదుల సంఖ్యలోని వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను, ఏఈలను నీటిపారుదల శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలకు బదలాయించింది. తాజాగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరిట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగంలో గుబులు మొదలైంది. గతంలో గృహ నిర్మాణ శాఖకు తలెత్తిన పరిస్థితి నెలకొంటుందన్న ఆందోళన.. ఉత్కంఠ రెవెన్యూ సిబ్బందిలో మొదలైంది. 

కీలకం కానున్న ధరణి...
రెవెన్యూ శాఖను రద్దు చేసి ఆ శాఖలోని వీఆర్‌వోలను పంచాయతీరాజ్‌ శాఖకు, గిర్దవార్, ఉపతహసీల్దారు, తహసీల్దార్లను వ్యవసాయ శాఖలోకి పంపిస్తారంటూ విసృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో రెవెన్యూ ఉద్యోగులు కొంత మేరకు ఆందోళన చెందుతున్నారు. సామాన్య ప్రజానీకంలోనూ చర్చనీయాంశంగా మారింది. భూములకు సంబంధించి వ్యవహరాలన్నింటినీ ధరణి వెబ్‌సైట్‌ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న కీలక శాఖ మీద ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement