Daimler India
-
శ్రీరామ్ ఆటోమాల్.. ఎక్సేంజీలో భారత్ బెంజ్ ట్రక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహన రంగంలో ఉన్న దైమ్లర్ ఇండియా కమర్షియల్‌వెహికిల్స్ తాజాగా పాత వాహనాల క్రయ విక్రయాల్లో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదార్లు తమ పాత ట్రక్స్‌ను ఎక్సే్ంజ్ కింద భారత్ బెంజ్ శ్రేణి కొత్త, పాత వెహికిల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. శ్రీరామ్ ఆటోమాల్ వేదికగా భారత్ బెంజ్, ఇతర ఓఈఎంల వాహనాలను విక్రయిస్తారు. -
భారత్ బెంజ్ వాహన ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ విభాగమైన భారత్ బెంజ్ తాజాగా తన వాహన ధరలను 2.5 శాతం వరకు తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మోడల్, ప్రాంతం ప్రాతిపదికన ధర తగ్గింపు 0.4 శాతం– 2.5 శాతం శ్రేణిలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాగా ఇప్పటికే టాటా మోటార్స్‌తో పాటు పలు కార్ల కంపెనీలు, టూవీలర్ల సంస్థలు కూడా వాటి వాహన ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. -
విజయవాడలో భారత్ బెంజ్ తొలి బస్సు విడుదల
ప్రముఖ కమర్షియల్ వాహన తయారీ కంపెనీ భారత్ బెంజ్ (డైమ్లర్ ఇండియా) తాజాగా స్కూల్, స్టాఫ్, టూరిస్ట్ బస్సులను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఏపీలో భారత్ బెంజ్‌కు డీలర్‌గా వ్యవహరిస్తోన్న వరుణ్ మోటర్స్.. కంపెనీ తొలి కమర్షియల్ వాహనాన్ని (బస్సు) వివా ఇంటర్నేషనల్ స్కూల్‌కు అందజేసింది. కస్టమర్లకు 40, 49 సీట్ల సామర్థ్యపు బస్సులను ఏసీ/నాన్ ఏసీ విభాగాలతో అత్యున్నత ప్రమాణాలతో అందిస్తామని వరుణ్ మోటర్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. చిత్రంలో వివా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ సోఫీ పెరాల్బాకు వాహన తాళాలను అందజేస్తున్న విజయవాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పురేంద్ర.