the Dalai Lama
-
జూలై 6న పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు
ఈ రోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపు కుంటున్న ప్రముఖులు: దలైలామా (బౌద్ధ గురువు), మంగళంపల్లి బాలమురళీకృష్ణ (సంగీత విద్వాంసుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యం వల్ల నాస్తికులు కూడా ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు ఏమంత అనుకూలంగా ఉండవు. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పడి సంసార జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,5,6; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు; సూచనలు: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం, గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. - రెహమాన్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ -
‘క్రికెట్ పర్యాటకం’పై దృష్టి పెట్టండి!
ప్రభుత్వానికి అనురాగ్ ఠాకూర్ విజ్ఞప్తి ధర్మశాల: అందమైన పర్వతాల మధ్య, ప్రకృతి సోయగంతో అందరినీ కట్టిపడేసే ప్రత్యేకత ధర్మశాల సొంతం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ చిన్న పట్టణం శివారులోనే బౌద్ధుల మత గురువు దలైలామా నివాసముండే మెక్లియోగంజ్ కూడా ఉంది. అయితే క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా మారిన తర్వాతే ఈ ప్రాంతానికి ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఈ ప్రాంతంలో దాదాపు రూ. 200 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఒక వన్డే మ్యాచ్‌కు ఈ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. శుక్రవారం భారత్, వెస్టిండీస్ మధ్య ఇక్కడ నాలుగో వన్డే జరగనుంది. అయితే పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకట్టుకునే సౌకర్యాల విషయంలో మాత్రం ఇది చాలా వెనుకబడి ఉంది. ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ కూడా లేకపోవడం, రైలు మార్గం, రెగ్యులర్ ఫ్లయిట్లు లేకపోవడం సమస్యగా మారింది. దీనిపై బీసీసీఐ సంయుక్త కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ధర్మశాలకు క్రికెట్ ఎంతో గుర్తింపు తెచ్చింది. ఎన్నో సమస్యలు ఉన్నా అత్యుత్తమ స్టేడియంను నిర్మించగలిగాం. ఇక ఈ ప్రాంతానికి ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేను విస్తరించాలి. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత పర్యాటక అభివృద్ధి జరుగుతుంది’ అని ఠాకూర్ విజ్ఞప్తి చేశారు.