జూలై 6న పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు
ఈ రోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపు కుంటున్న ప్రముఖులు: దలైలామా (బౌద్ధ గురువు), మంగళంపల్లి బాలమురళీకృష్ణ (సంగీత విద్వాంసుడు)
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యం వల్ల నాస్తికులు కూడా ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి.
న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు ఏమంత అనుకూలంగా ఉండవు. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పడి సంసార జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,5,6; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు; సూచనలు: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం, గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం.
- రెహమాన్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్