Damodar Prasad
-
వరద బాధితుల సహాయానికి ప్రత్యేక కమిటీ
‘‘విజయవాడ, ఖమ్మం ప్రాంత ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందు ఉంటుంది’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరఫున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అదే విధంగా ఫెడరేషన్ తరఫున ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం.రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్‌తోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సాయం చేయాలనుకునేవారు ఈ ఖాతాలకు డబ్బులు పంపవచ్చు’’ అన్నారు. ‘‘మా కుటుంబం నుంచి రూ.కోటి విరాళం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. ‘‘కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను మనమందరం ఆదుకోవాలి’’ అని డైరెక్టర్ రాఘవేంద్రరావు తెలి΄ారు. ‘‘మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరోపాతిక లక్షలు ఇస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు. ‘‘వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలి΄ారు. ‘‘అన్ని కార్మిక యూనియన్లు ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చేలా ΄్లాన్ చేస్తున్నాం’’ అని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎం΄్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ వరద బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు హీరో వరుణ్ తేజ్, నిర్మాత అంబికా కృష్ణ. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి వరుణ్ తేజ్ రూ. 10 లక్షలు (5 లక్షల చొప్పున), అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే అంబికా కృష్ణ రూ.10 లక్షలు (5 లక్షల చొప్పున) విరాళం ప్రకటించారు. -
ప్రొడ్యూసర్ కౌన్సిల ఎన్నికల్లో దిల్ రాజు హవా..
-
తెలుగు నిర్మాత మండలి అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్
-
'టాలీవుడ్‌కు ఇవే పెద్ద దిక్కు, ప్రభుత్వాలు వీటితోనే చర్చ జరపాలి'
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్, ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ముందుకు వెళతాం’’ అని ఫిల్మ్ చాంబర్ జనరల్ సెక్రటరీ, నిర్మాత దామోదర ప్రసాద్ అన్నారు. కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు ‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో నిర్మాత జి.ఆది శేషగిరిరావు అధ్యక్షతన సినీ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘చాంబర్ తరఫున సబ్ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాల కోసం ముందుకువెళతాం. మూడు నెలల తర్వాత మరోసారి సమావేశమై చర్చిస్తాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్‌కి ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పెద్ద దిక్కు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినిమాలకు సంబంధించి ఏ చర్చ అయినా వీటితోనే జరపాలి’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ అన్నారు. సినిమా పరిశ్రమకు మేలు జరిగేందుకు ప్రభుత్వాలతో ఎవరు చర్చించినా అభ్యంతరం లేదు. కానీ, కలిసే ముందు ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలిని సంప్రదించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. కాగా ఈ సమావేశానికి 250మందిని ఆహ్వానించినా కేవలం 60–70 మంది మాత్రమే వచ్చారు. స్టార్ హీరోలెవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, నవీన్ ఎర్నేని, చదలవాడ శ్రీనివాసరావు, నిరంజన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్, అశోక్ కుమార్, వై. రవి, అనిల్ సుంకర, నటులు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
టాలీవుడ్ మీటింగ్, హాజరైన రాజమౌళి!
సాక్షి, హైదరాబాద్: సినీపరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆయా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నాం. పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించాం. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాం. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏర్పాటు చేసిన భేటీ' అని పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. 'క్యూబ్, టికెట్ రేట్లు, చిత్ర పరిశ్రమ అంతర్గత విషయాలు చర్చకు వస్తాయి. ఏపీ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ విషయాలను సైతం చర్చిస్తాము. పూర్తి వివాదరహితంగా సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాము' అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం' అని తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరధ్వాజ, ముత్యాల రాందాస్ ,మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే! ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే టాలీవుడ్ ప్రతినిధులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రభుత్వానికి టాలీవుడ్ ధన్యవాదాలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ మీద వరాల జల్లు కురిపించిన తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. టాలీవుడ్‌కు సంబంధించిన వివిధ శాఖల ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో పలు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు రాయితీలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కారకులైన చిరంజీవి, నాగార్జునకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అందరం చర్చించుకొని అమలు చేస్తామన్నారు. ఏపీలో కూడా కొన్ని సమస్యలు వున్నాయని, వాటి పైన కూడా చర్చలు జరిపి రెండు మూడు రోజుల్లో థియేటర్స్ ఎప్పుడు తెరుస్తామనే విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. (చదవండి: సినీ పరిశ్రమను కాపాడుకుంటాం: కేసీఆర్) తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు నాన్నలు నిర్మాతల మండలి అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. 'జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో సినిమా వాళ్లకు కొన్ని రాయితీలు ప్రకటించారు. దీనికోసం చిరంజీవి నాగార్జున, మంత్రి తలసాని చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మాతో రెండున్నర గంటలు మాట్లాడారు. రోజుకు ఎక్కువ షో లు వేసుకొనే విధంగా అనుమతి ఇచ్చారు. ఇది దేశంలో ఒక్క తెలంగాణాలో మాత్రమే వుంది. దీని వల్ల చాలా చిన్న సినిమాలు వస్తాయి. ఫలితంగా ఉపాధి కూడా పెరుగుతుంది. ఇక తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు నాన్నలు.. ఒకరు కేసీఆర్, మరొకరు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సినీ ఇండస్ట్రీ గురించి ఏపీ సీఎం జగన్ గారితో కూడా చర్చిస్తాం. మా ఇండస్ట్రీ తరుపున పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇద్దరు సీఎంలను ఆహ్వానించి, కృతజ్ఞతలు తెలుపుతాము' అని చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీ కోసం రాయితీలు ప్రకటించిన కేసీఆర్‌కు మా అసోసియేషన్ సెక్రెటరీ జీవిత, డైరెక్టర్స్ అధ్యక్షుడు ఎన్.శంకర్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: మాయలు మంత్రాలు అంటే ఆసక్తి ఉండేదట) -
‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ సమర్పణలో వలజ గౌరి, రమేష్ ఉడత్తు నిర్మాతలుగా, వలజ క్రాంతి దర్శకత్వంలో ప్రదీప్ వలజ, మిధున ధన్పాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముందుగా ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి న్యూ కమర్స్ ట్రూ స్టోరీస్‌తో వస్తున్నారు. ఇది అభినందించవలసిన విషయం. భగత్ సింగ్ నగర్ అనగానే నాకు విజయవాడ గుర్తొచ్చింది. లవ్ థ్రిల్లర్ స్టోరీ అని విన్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు. దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ.. ‘కొత్త వాడిని అయినా, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇక సినిమా విషయానికి వస్తే... భగత్ సింగ్ నగర్ అనే స్లమ్ ఏరియాలో జరిగే లవ్ స్టోరీతో మొదలై థ్రిల్లర్‌గా టర్న్ అయ్యే చిత్రం. ఇక నిర్మాత రమేష్ గారు కేవలం డబ్బు పెట్టడమే కాదు.. నేను స్ట్రెస్‌లో ఉన్నప్పుడు చాలా మోటివేట్ చేసేవారు. ఆయన లేకపోతే నేను ఈ వేదిక లేదు. ఓ మంచి సినిమా చేసాము ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. హీరో ప్రదీప్ వలజ మాట్లాడుతూ... ‘ముంబయిలో యాక్టింగ్ కోర్సు చేసాను. మా నాన్న మునిచంద్ర గారే దగ్గరుండి చేర్పించారు. ఇలా పేరెంట్స్ సపోర్ట్ ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకు నేను మానాన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక యాక్టింగ్ కోర్సు అవగానే అవకాశం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ కష్టం లేకుండానే మా అన్నయ్య క్రాంతినే డైరెక్ట్ చేసి అవకాశం ఇచ్చాడు. కానీ షూటింగ్ టైంలో మాత్రం చాలా కష్టపెట్టాడు. మా కష్టానికి తగ్గట్టు సినిమా బాగోచ్చింది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. హీరోయిన్ మిధున ధన్ పాల్ మాట్లాడుతూ.. ‘మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ అయ్యింది. తెలుగులో నా మొదటి సినిమా ఇది. అందరూ ఎంతో సహకరించారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా’ అన్నారు. నిర్మాత రమేష్ మాట్లాడుతూ... ‘ఎన్ ఆర్ ఐ అంటే ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ మేము వెళ్ళేది కూడా ఇక్కడ నుంచే కదా.. అందులోనూ నేను ఒక బిజినెస్ మ్యాన్‌ను. నాకు తెలిసింది రెండే ఒకటి సక్సెస్, మరోటి ఫెయిల్యూర్. కనుక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. మంచి సినిమా చేసాను అనే ఫీలింగ్ నాకుంది’ అన్నారు. -
తేజ మార్కు ప్రేమకథ!
ప్రేమకథా చిత్రాలతో దర్శకుడు తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారనే చెప్పొచ్చు. ఇప్పటి వరకూ ఆయన చేసినవన్నీ దాదాపు ప్రేమకథలే. ఎంతోమంది నూతన నటీనటులను పరిచయం చేశారాయన. ఇప్పుడు నూతన తారలతో ‘హోరాహోరీ’ చిత్రం చేస్తున్నారు. దిలీప్, దక్ష జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాత. ‘‘డీటీయస్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తేజ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కల్యాణ్, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్ రెడ్డి వి. -
మాఫియా కారణంగా...
ఓ ప్రేమజంటను విడదీయడానికి మాఫియా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మాఫియా కారణంగా ఆ ప్రేమజంట చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ‘ప్యారడైజ్’ చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు రవిచంద్రన్. షఫీ ప్రధాన పాత్రలో హేమంత్, షిప్రా జంటగా సత్యనారాయణ బత్స నిర్మిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి అల్లు రామకృష్ణ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. షఫీ మాట్లాడుతూ -‘‘చాలా మంచి కథ ఇది. ఇందులో నాది పోలీసాఫీసర్ పాత్ర’’ అని చెప్పారు. ఇది విభిన్న ప్రేమకథ అని, క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: యోగి, సంగీతం: స్ట్రింగ్స్ సతీశ్.