పట్టాలు తప్పిన ధనపూర్ -కామఖ్య రాజధాని ఎక్స్ప్రెస్
బీహార్లోని పాట్నా సాహిబ్ స్టేషన్ వద్ద గత అర్థరాత్రి దన్పూర్ కమాఖ్య రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందని తూర్పు మధ్య రైల్వే అధికార ప్రతినిధి యూ.కే.ఘా బుధవారం వెల్లడించారు. పదకొండు బోగీలు పట్టాలు తప్పాయని తెలిపారు. అయితే ప్రయాణీకులంతా సురక్షింతంగా ఉన్నారని చెప్పారు.
ఈ రోజు ఉదయం 5 బోగీలను పట్టాలపైకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. మరో ఆరు బోగీలను పట్టాలపైకి తీసుకురావలసి ఉందన్నారు. అయితే ప్రయాణీకులకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి అసోంలోని కామఖ్యకు పంపినట్లు చెప్పారు.