అసలే పోలీసు.. ఆపై తాగి తందనాలు!
ఉత్తరప్రదేశ్లో ఒక పోలీసు తాగి తందనాలు ఆడుతూ వీడియోకు దొరికేశాడు. ఈ ఘటన శ్రావస్తి జిల్లాలో జరిగింది. అక్కడ ఏదో కార్యక్రమం సందర్భంగా అమ్మాయిల డాన్సు ఏర్పాటు చేశారు. అందులో బార్ గరల్స్తో ఆ పోలీసు డాన్సు చేస్తూ, వాళ్ల మీదకు నోట్లు విసురుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అందులోనూ అతగాడు యూనిఫాంలో ఉండే ఇదంతా చేయడం గమనార్హం.
శ్రావస్తి జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి అతడు విధి నిర్వహణ కోసం వెళ్లాడని, తీరా అక్కడ వరకు వెళ్లిన తర్వాత తాగేసి బార్ గరల్స్తో డాన్సులు చేశాడని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా వెళ్లింది. ఇటీవలి కాలంలో అధికారుల పనితీరుపై తీవ్రంగా స్పందిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరి ఈ తాగుబోతు పోలీసు విషయంలో ఏమంటారో చూడాలి.