Daredevil feet
-
ఐఏఎఫ్ డేర్‌డెవిల్ ఆపరేషన్
జమ్మూ: భారత వైమానిక దళం సిబ్బంది ధైర్య సాహసాలు ప్రదర్శించి వరదల్లో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కాపాడారు. జమ్మూకు చెందిన నలుగురు మత్స్యకారులు జమ్మూలోని భగవతి నగర్ వద్ద తావీ నదిలోకి దిగారు. ఒక్కసారిగా నదిలో వరద ఉధృతి పెరగడంతో వారు అక్కడే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌పైకి ఎక్కారు. అంతకంతకు నీటి మట్టం పెరుగుతుండటంతో స్థానికుల సాయంతో అధికారులకు సమాచారం అందించారు. ఐఏఎఫ్ వెంటనే రంగంలోకి దిగింది. ఐఏఎఫ్ హెలికాప్టర్ పిల్లర్‌కు అతి సమీపానికి రాగా గరుడ్ కమాండో కింది దిగారు. అక్కడున్న ఇద్దరినీ సురక్షితంగా హెలికాప్టర్లోకి ఎక్కేలా చేసి, మరో ఇద్దరి కోసం తాడు నిచ్చెనను వదిలారు. అయితే, వారిద్దరూ పైకి ఎక్కలేక తిరిగి నీళ్లలో పడిపోయారు. దీంతో గరుడ్ కమాండోలు తిరిగి పిల్లర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని, వారిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చేయగలిగారు. దాదాపు రెండుగంటలపాటు సాగిన ఈ సాహసోపేత చర్యను స్థానికులు ఉత్కంఠగా తిలకించారు. నలుగురినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఐఏఎఫ్ సిబ్బంది సాహసాన్ని వారు కొనియాడారు. ఇది డేర్‌డెవిల్ ఆపరేషన్ అని ఐఏఎఫ్ అధికారులు అభివర్ణించారు. ఇదంతా హెలికాప్టర్ పైలెట్, గరుడ్ కమాండో మధ్య సమన్వయం వల్లే సాధ్యమైందన్నారు. నగరంలోని హర్కిపౌడి ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో.. ఉధంపూర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ తావి నది వరదలో చిక్కుకుపోగా పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. -
అమ్మ కోసం సాహసాలు.. పట్టుతప్పి ప్రాణం పోయింది
బీజింగ్ : అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించేందుకు ఓ యువకుడు ప్రమాదకరమైన స్టంట్లు చేసి ఆ వీడియోలను అమ్ముకోవటం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని ప్రాణాలు పోగా.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఏషియన్ ఏజ్ కథనం ప్రకారం... 26 ఏళ్ల యోంగ్ నింగ్ సోషల్ మీడియా హీరో. తన తల్లి వైద్య ఖర్చుల కోసం ఈ ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నాడు. ఎత్తైన భవనాలు, ప్రాంతాల్లో వేలాడుతూ ఫోటోలు, వీడియోలు తీసుకోవటం.. వాటిని నెట్లో వైరల్ చేసి డబ్బు సంపాదించటం అతనికి వృత్తిగా మారిపోయింది. ఈ క్రమంలో అతను నిపుణుల పర్యవేక్షణ లేకుండా పైగా రక్షణ చర్యలు కూడా పాటించేవాడు కాదు. ఫేస్ బుక్‌లో అతనికి 3 లక్షలకు పైగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో గత నెల 8వ తేదీన ఓ ఎత్తైన భవనం మీద సాహసం చేస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. గాజు భవనం మీద నుంచి వేలాడుతూ విన్యాసాలు చేసిన అతను.. రెండోసారి అదే పని చేస్తున్న క్రమంలో పట్టుజారి పడిపోయాడు. అతని మరణ వార్తను అతని ప్రియురాలు ధృవీకరించింది. సరిగ్గా నెల క్రితం ఈ నన్ను, ఈ ప్రపంచాన్ని నువ్వు విడిచి వెళ్లిన క్షణం అంటూ వైబోలో సందేశం ఉంచింది. చైనా ఫస్ట్ రూఫ్టాపర్ వీరుడిగా యాంగ్నింగ్కు మంచి పేరు ఉంది. తల్లి వైద్యం కోసం సాహసం చేయబోయి.. -
25 వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకి..
లాస్ ఎంజిల్స్: గాలిలో 25 వేల అడుగుల(7.6 కిలోమీటర్ల) ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్ లేకుండా అమాంతం కిందికి దూకితే.. దాదాపు మటన్ కీమాలా మనిషి శరీరం నుజ్జునుజ్జుకావడం ఖాయం. ఇంకెవరో దూకితే అదే జరుగుండేంది. కానీ ఆ సాహసం చేసింది లూక్ ఐకిన్స్.. ది డేర్ డెవిల్ స్కైడైవర్! గాలిలో ఎగురుతున్న విమానాలు, హెలికాప్టర్ల నుంచి లెక్కలేనన్నిసార్లు(నిజానికి 18వేల సార్లు) కిందికి దూకి స్కైడైవింగ్ సాహసక్రీడకు మరింత క్రేజ్ పెంచిన లూక్.. స్వదేశం అమెరికాలోనేకాక ప్రపంచ దేశాల్లోనూ ఫేమస్ అయిపోయాడు. 42 ఏళ్ల లూక్.. గడిచిన 26 ఏళ్లుగా, అంటే తన 16వ ఏట నుంచే సాహస కృత్యాలు చేస్తున్నాడు. అయితే శనివారం అతనుచేసిన ఫీట్ మాత్రం అత్యంత భయంకర.. ప్రాణాంతకమైన ఫీట్. విత్ అవుట్ పారాచుట్ 25 వేల అడుగుల ఎత్తునుంచి ఇప్పటివరకు ఎవ్వరూ డైవ్ చెయ్యలేదు. అంత ఎత్తునుంచి దూకి సరాసరి నిర్దేశిత వలలోకే చేరుకున్నాడు లూక్. ఒకవేళ వల నుంచి పక్కకు పోయి ఉంటే ఈపాటికి అతని చావు వార్తలు చదువుకునేవాళ్లం. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ సిటీకి సమీపంలోగల సిమి వ్యాలిలో.. భూమి కి 400 అడుగుల ఎత్తులో 100 ఫీట్ల పొడవు, వెడల్పున్న వలను ఏర్పాటుచేశారు. ముగ్గురు సహాయకులతో కలిసి విమానం నుంచి దూకిన లూక్ అతను వలలో పడ్డప్పుడు అది 61 మీటర్లు కిందికి సాగింది. అంటే అతను ఎంత వేగంగా దూసుకొచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. లూక్ భూమిని చేరుకోవడానికి రెండు నిమిషాల సమయం పట్టింది. మిగతా ముగ్గురూ పారాచూట్లతో నేలకు చేరుకున్నారు. 'భూమికి చేరువ అవుతున్నకొద్దీ నేను స్తంభించిపోయినంతపనైంది'అంటూ సాహస అనుభవాన్ని పంచుకున్నాడు లూక్. ఫీట్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన వెంటనే భార్య మోనికా, కొడుకు లోగన్ లను హత్తుకున్నాడు లూక్. -
25 వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకి..