Datsun brand
-
డాట్సన్ ‘రెడి-గో’
ధర 2.5 లక్షలు రేపటి నుంచి బుకింగ్స్; జూన్‌లో డెలివరీ న్యూఢిల్లీ: జపాన్ దిగ్గజ వాహన కంపెనీ నిస్సాన్ తాజాగా తన ‘డాట్సన్ బ్రాండ్’ కింద మరొక కొత్త కాంపాక్ట్ కారు ‘రెడి-గో’ను మార్కెట్లోకి తీసుకురానున్నది. దీని ధర రూ.2.5 లక్షలు-3.5 లక్షల శ్రేణిలో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ‘రెడి-గో’ ముందస్తు బుకింగ్స్ మే నెల 1 నుంచి ప్రారంభమౌతాయని, వీటి డెలివరీ జూన్ నెల నుంచి ఉంటుందని తెలిపింది. వినియోగదారులు ‘రెడి-గో’ కార్లను ఆఫ్లైన్లోనైతే నిస్సాన్ డీలర్షిప్స్ వద్ద (రూ.5,000 డౌన్ పేమెంట్‌తో), ఆన్లైన్లో స్నాప్‌డీల్‌లో బుకింగ్ చేసుకోవచ్చని వివరించింది. ఇక ఎక్స్ షోరూమ్ ధర, వేరియంట్స్ తదితర వివరాలను కారు విడుదల సమయం(జూన్)లో వెల్లడిస్తామని తెలిపింది. ‘ముఖ్యంగా యువతకు చేరువకావడమే లక్ష్యంగా.. ఎప్పటికప్పుడు కొత్త కార్లు తీసుకొస్తున్నాం’ అని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. -
నిస్సాన్ డాట్సన్ రెడీ-గో వచ్చింది..
♦ వచ్చే నెల నుంచి బుకింగ్స్, జూన్ నుంచి డెలివరీలు... ♦ ధర రూ.2.5 లక్షలు-3.5 లక్షల రేంజ్లో (అంచనాలు) న్యూఢిల్లీ: నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ కింద కాంపాక్ట్ కారు రెడీ-గోను ఆవిష్కరించింది. గో, గో ప్లస్ కార్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. వచ్చే నెల నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని, జూన్ నుంచి డెలివరీలు ఇస్తామని నిస్సాన్ ఇండియా కంపెనీ పేర్కొంది. డాట్సన్ కార్ల కొనుగోళ్లకు రుణాలిచ్చే స్కీమ్‌లను త్వరలో అందుబాటులోకి తేనున్నామని, దీంతో తమ అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్(ఆపరేషన్స్) గుయిల్యామ్ సికార్డ్ చెప్పారు. రూ.2.5 లక్షల నుంచి రూ.4.42 లక్షల రేంజ్లో ఉన్న మారుతీ సుజుకీ ఆల్టో, హ్యుందాయ్ ఇఆన్, రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనిచ్చే ఈ రెడీ-గో కారు ధరలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ధరలు ధర రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. కారు ప్రత్యేకతలు...: 800 సీసీ 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, విశాలమైన వెనక సీట్లు, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్, బంపర్‌పై ఎల్ఈడీ డీఆర్ఎల్లు, వెనుక స్పోర్టింగ్ వెర్టికల్ టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ కేటగిరీలో తమ కారే అత్యుత్తమ మైలీజీనిస్తుందని తెలిపింది. రెనో క్విడ్ రూపొం దిన సీఎంఎఫ్-ఏ ప్లాట్ఫార్మ్పైనే ఈ కారును రూపొందించారు. -
దీపావళికల్లా డాట్సన్ 800 సీసీ
పరిశీలనలో ఎలక్ట్రిక్ కారు ‘ద లీఫ్’ కూడా... - 2020 నాటికి 5 శాతం వాటా లక్ష్యం - నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ నిస్సాన్... దేశంలో 800 సీసీ కారును దీపావళి నాటికి ఆవిష్కరించనుంది. డాట్సన్ బ్రాండ్‌లో ‘రెడీ గో’ పేరుతో రానున్న ఈ మోడల్ ధర వేరియంట్‌ను బట్టి రూ.3-5 లక్షల మధ్య ఉండొచ్చు. చైనె ్న సమీపంలో రెనో నిస్సాన్‌ల సంయుక్త ప్లాంటులో ఈ ఎంట్రీ లెవెల్ మోడల్ రెడీ అవుతోందని, చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంటోందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా సోమవారం వెల్లడించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఇటీవల క్విడ్ పేరుతో 800 సీసీ కారును రెనో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. నిస్సాన్ అనుబంధ బ్రాండ్ అయిన డాట్సన్ విక్రయిస్తున్న మోడళ్లు డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ రెండూ కూడా 1,198 సీసీ సామర్థ్యం గలవి. 2014-15లో భారత్‌లో నిస్సాన్ విక్రయించిన 50 వేల యూనిట్లలో డాట్సన్ మోడళ్ల వాటా సుమారు 18 వేల యూనిట్లుంది. లీఫ్‌కు సిద్ధమే కానీ.. ఎలక్ట్రిక్ కారు ‘ద లీఫ్’ మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు అరుణ్ మల్హోత్రా తెలియజేశారు. ఇక్కడి గచ్చిబౌలిలో వైబ్రాంట్ నిస్సాన్ షోరూంను ప్రారంభించిన అనంతరం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ఆయన ఈ విషయాలు చెప్పారు. ద లీఫ్ విడుదలకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించటం లేదని ఆయన తెలియజేశారు. ‘చార్జింగ్ కేం ద్రాలు విరివిగా ఏర్పాటు కావాలి. అందుకు తగ్గ మౌలిక వసతులు ఉండాలి. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలి’ అని అన్నారు. ఇక కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కూడా రానుందని చెప్పారాయన. 2020 నాటికి మార్కెట్ వాటా 5 శాతం లక్ష్యంగా చేసుకున్నామని, షోరూంల సంఖ్యను మూడేళ్లలో 300 లకు విస్తరిస్తామని ఆయన వివరించారు.