మోడీతో మలేసియా మంత్రి భేటీ
న్యూఢిల్లీ: మలేసియా సహజ వనరుల శాఖ మంత్రి డాటుక్ సేరి జి పలనివేల్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత పర్యటనకు వచ్చిన పలనివేల్ మంగళవారం మోడీతో సమావేశమైనట్టు కేంద్ర సమాచార శాఖ అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు. పలనివేల్ భారత పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కూడా సమావేశమయ్యారు. వాతావరణం, పర్యావరణ సంరక్షణలో ఇరు దేశాల భాగస్వామ్యం గురించి చర్చించారు.