daycare centre
-
ఆఫీస్‌లో కొత్త వర్క్ పాలసీ.. ఉద్యోగులు పాటించాల్సిందే! లేదంటే
‘త్వరలో ఆఫీసులో కొత్త వర్క్ పాలసీని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవు! అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ కంపెనీ బాస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ మెమో ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతోంది. రెడిట్‌లో గుర్తు తెలియని యూజర్ చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది. ‘ఉద్యోగులకు గమనిక! వర్క్ అంటే వినోదం కాదు. ఇది మీ బాధ్యత. ఆఫీస్ వర్క్ చేయకుండా.. బయట విషయాల గురించి అస్సలు చర్చించ కూడదు. పనివేళల్లో స్నేహానికి తావివ్వకూడదు. “work is not meant to be fun” by u/DiorRoses in mildlyinfuriating ఏదైనా మాట్లాడుకోవాలంటే అది ఆఫీస్ అవర్స్ తర్వాతే. ఆఫీస్ వేళల్లో మీ సహచర ఉద్యోగి.. ఆఫీస్ వర్క్ గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీతో మాట్లాడితే నన్ను సంప్రదించండి. పని మీ బాగోగులు చూసుకునే ‘డేకేర్’ కాదు. అంటూ సంబంధిత ఆఫీస్ బాస్ సంతకం చేసిన మెమోలో పేర్కొని ఉంది. ఈ నోటీస్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రెడిట్‌లో పోస్ట్ చేసిన నాటి నుంచి సుమారు 26 వేల మంది కామెంట్లు చేశారు. బాస్ చాలా ప్రమాదకరంగా ఉన్నారే. ఆ ఆఫీస్ వర్క్ కల్చర్ చెత్తగా ఉంది. ఆఫీస్‌లో స్నేహపూరితమైన వాతావరణం ఉంటే వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది’ అని కామెంట్లలో చెబుతున్నారు యూజర్లు. చదవండి👉 ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన! -
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో! -
ఎందుకిలా చేశారు?
గుర్ గావ్: 'వీళ్లకు హృదయం లేదు. దేవుడు, చట్టం, సమాజం అంటే భయం లేదు'... తన ముద్దుల కూతురి చేతివేలు పోవడానికి కారణమైన డేకేర్ సెంటర్ నిర్వాహకులపై ఓ మహిళ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. తన గారాలపట్టికి జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ఆమె గొంతెత్తింది. లాభార్జన ధ్యేయంగా పనిచేస్తూ పసిపిల్లల ప్రాణాలను ఫణంగా పెడుతున్న విద్యా వ్యాపారులపై విప్లవ శంఖం పూరించింది. దేశ రాజధాని సమీంలోని గుర్ గావ్ లో ఏప్రిల్ 28న చోటుచేసుకున్న ఈ ఘటన కార్పొరేట్ విద్యాసంస్థల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. శివాని శర్మ అనే మహిళ తన మూడేళ్ల కూతురు మిరాను చెరబ్ ఏంజెల్ అనే డేకేర్ సెంటర్ లో చేర్చారు. ఏప్రిల్ 28న ఆమెకు టీచర్ ఫోన్ చేసి మీ అమ్మాయి కుడిచేతి బొటనవేలు చితికిపోయిందని, ఆస్పత్రికి తరలించామని చెప్పింది. వెంటనే ఆమె ఆస్పత్రికి వెళ్లారు. చేతివేతి గాయంతో విలవిల్లాడుతున్న మిరాను చూసి చలించిపోయారు. ఏమైందని టీచర్లను నిలదీశారు. కార్తీక్ అనే విద్యార్థి తలుపు వేయడంతో మిరాకు గాయమైందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. జాగ్రత్తగా చూసుకోమని మీకు అప్పగిస్తే ఇలా చేస్తారా అని టీచర్లను శివాని ప్రశ్నించింది. బొటనవేలు పైభాగం బాగా చితికిపోవడంతో దాన్ని తొలగించారు. డే కేర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తన కూతురు బొటనవేలు కోల్పోయిందని శివాని ఆవేదన వ్యక్తం చేసింది. డేకేర్ నిర్వాహకులపై కేసు పెట్టింది. దీంతో దిగొచ్చిన డేర్ కేర్ యజమానులు క్షమాపణ చెప్పారు. మిరాకు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీయిచ్చారు. అయితే తర్వాత వారు పత్తా లేకుండా పోయారు. తాను ఫోన్ చేస్తే స్పందించడం లేదని, పోలీసులతో బెదిరిస్తున్నారని శివాని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా జాగ్రత్త పడాలని ఫేస్ బుక్ ద్వారా కోరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డే కేర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.