‘త్వరలో ఆఫీసులో కొత్త వర్క్ పాలసీని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవు! అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ కంపెనీ బాస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ మెమో ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతోంది.
రెడిట్‌లో గుర్తు తెలియని యూజర్ చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది. ‘ఉద్యోగులకు గమనిక! వర్క్ అంటే వినోదం కాదు. ఇది మీ బాధ్యత. ఆఫీస్ వర్క్ చేయకుండా.. బయట విషయాల గురించి అస్సలు చర్చించ కూడదు. పనివేళల్లో స్నేహానికి తావివ్వకూడదు.
“work is not meant to be fun”
by u/DiorRoses in mildlyinfuriating
ఏదైనా మాట్లాడుకోవాలంటే అది ఆఫీస్ అవర్స్ తర్వాతే. ఆఫీస్ వేళల్లో మీ సహచర ఉద్యోగి.. ఆఫీస్ వర్క్ గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీతో మాట్లాడితే నన్ను సంప్రదించండి. పని మీ బాగోగులు చూసుకునే ‘డేకేర్’ కాదు. అంటూ సంబంధిత ఆఫీస్ బాస్ సంతకం చేసిన మెమోలో పేర్కొని ఉంది.
ఈ నోటీస్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రెడిట్‌లో పోస్ట్ చేసిన నాటి నుంచి సుమారు 26 వేల మంది కామెంట్లు చేశారు. బాస్ చాలా ప్రమాదకరంగా ఉన్నారే. ఆ ఆఫీస్ వర్క్ కల్చర్ చెత్తగా ఉంది. ఆఫీస్‌లో స్నేహపూరితమైన వాతావరణం ఉంటే వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది’ అని కామెంట్లలో చెబుతున్నారు యూజర్లు.
చదవండి👉 ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన!
Comments
Please login to add a commentAdd a comment