the death
-
తల్లి మృతిచెందిన రెండో రోజే తనయుడు మృతి
టేకులపల్లి(ఖమ్మం) : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన సర్పంచ్ తనయుడు సోమవారం రాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తడికలపూడి పంచాయతీ పరిధిలోని కోక్యాతండాకు చెందిన బానోతు నీల తీవ్ర జ్వరంతో ఈనెల 4న మృతిచెందిన విషయం విదితమే. తల్లి మరణంతోపాటే పెద్ద కొడుకు సురేష్‌కుమార్(21) అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఖమ్మం తరలించగా.. జన్యులోపం వల్ల సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న అతడికి రక్త మార్పిడీ చేయిస్తున్నారు. ఇటీవలే బీటెక్ పూర్తి పూర్తి చేసిన అతడు ఎంటెక్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉండి పరీక్షకు శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో తల్లి అస్వస్థతకు గురికావడంతో వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం తల్లి మృతిచెందడంతో అంత్యక్రియల కోసం సురేష్‌ను ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. తర్వాత అస్వస్థతకు గురైన సురేష్‌ను ఖమ్మం తరలించగా.. పరిస్థితి విషమించడంతో సోమవారం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా.. తల్లీ, సోదరుడు కళ్లముందే మృతిచెందడంతో తమ్ముడు కల్యాణ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇతడికి కూడా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉండటం గమనార్హం. -
కల్వర్టు పైనుంచి పడి బాలిక మృతి
మహబూబాబాద్ : కల్వర్టు పై నుంచి పడటంతో బలమైన గా యాలై గుర్తు తెలియని బాలిక(16) మృతిచెందిన సంఘటన మానుకోటలోని కురవి రోడ్ ఆర్ఓబీ వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. టౌన్ సీఐ నం దిరామ్ నాయక్ కథనం ప్రకా రం.. కోతులు పట్టేందుకు వచ్చిన కొన్ని కుటుంబాలు కురవి రోడ్లో డేరాలు వేసుకొని నివసించేవి. ఇటీవల వారు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. వారికి సంబంధించిన బాలిక మతిస్థిమితం లేకపోవడంతో కల్వర్టు పైనుంచి పడి మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
నాడు తండ్రి.. నేడు తల్లి మృతి అనాథలైన చిన్నారులు పరకాల : ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పెండెల మౌనిక(29)కు వెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. రాజు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఐదేళ్ల క్రితం రాజు మృతిచెందాడు. అప్పటి నుంచి మౌనిక తన ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చి పులిగిల్లలోనే నివాసముంటోంది. తల్లిదండ్రులు ఇచ్చిన 20 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు. భర్త రాజును ఆస్పత్రిలో చూపించడానికి చేసిన అప్పులతోపాటు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన మౌనిక ఈ నెల 20న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం (కృష్ణా): మండలంలోని గుంటుపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో అతడి భార్యకు స్వల్పంగా గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన వాతా శ్రీనివాసరావు(50), హనుమాయమ్మ(48) దంపతులు మోటార్‌సైకిల్‌పై ఇబ్రహీంపట్నం ఫెర్రి గ్రామానికి బయలుదేరారు. గుంటుపల్లి వద్ద వీరి వాహనం అదుపుతప్పి ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దంపతులు కింద పడిపోయారు. శ్రీనివాసరావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. హనుమాయమ్మకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లుడి ఇంటికి వస్తూ... శ్రీనివాసరావు దంపతులు ఫెర్రిలో నివాసం ఉంటున్న తమ అల్లుడు బుర్రి సత్యనారాయణ ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కళ్లెదుటే భర్త చనిపోవడంతో హనుమాయమ్మ కన్నీరుమున్నీరైంది. ప్రమాదం గురించి తెలియగానే బంధువులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చారు. వ్యవసాయదారుడైన శ్రీనివాసరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.