సినిమా చూస్తూ.. గుండెపోటుతో వ్యక్తి మృతి
విజయవాడ: సినిమా చూస్తూ.. వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన విజయవాడ అప్సర థియేటర్లో బుధ వారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పడగల పుల్లారావు అనే వ్యక్తి అప్సర థియేటర్లో ప్రదర్శితమవుతున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు వచ్చాడు.
సినిమా చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. సినిమా మధ్యలోనే గుండెపోటు వచ్చినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ఆస్పత్రికి తీసుకెళ్లకుడా షో కొనసాగించారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.