death rate hike
-
బ్రిటన్‌లో ముందుంది విలయం!
లండన్: రానున్న శీతాకాలంలో కోవిడ్–19 కారణంగా బ్రిటన్‌లో కనీసం లక్షా ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. చలి కారణంగా ప్రజలు ఎక్కువగా ఇళ్లు, భవనాల్లో ఎక్కువ సమయం గడిపే అవకాశమున్నందున చలికాలంలో వైరస్ మరోసారి వ్యాప్తి చెందే అవకాశముందని పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చునని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఎంఎస్) స్పష్టం చేసింది. కేవలం 9 నెలల కాలంలో లక్షకుపైగా మరణాలు నమోదవుతాయని తెలిపింది. బ్రిటన్‌లో కోవిడ్–19 మహమ్మారి ఏ రూపం సంతరించుకుంటుందన్న విషయంపై ప్రస్తుతం చాలా అస్పష్టత ఉందని, ఒకరి నుంచి ఎంతమందికి వ్యాధి సోకుతుందన్న విషయాన్ని సూచించే ఆర్–నాట్ ప్రస్తుతమున్న 0.9 నుంచి సెప్టెంబర్‌కల్లా 1.7కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఏఎంఎస్ తెలిపింది. ఏఎంఎస్ నిర్వహించిన మోడలింగ్ ప్రకారం సెప్టెంబర్ 2020 నుంచి జూన్ 2021 మధ్యకాలంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లోనే 1,19,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారు. ఇది తొలిసారి వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ. -
36 శాతం పెరిగిన న్యూరో మృతుల సంఖ్య
మాస్కో: గడిచిన 25 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా నరాల సంబంధిత వ్యాధుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 36.7 శాతం పెరిగినట్లు తాజా అధ్యయనంలో తేలింది. 1990–2015 మధ్య వైకల్యం బారిన పడిన వారి సంఖ్య 7.4 శాతం పెరిగినట్లు వెల్లడైంది. పెరుగుతున్న జనాభా, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు వెల్లడించింది. జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడం, ఆరోగ్య సంరక్షణ పాటించడంతో సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొంది. నరాల వ్యాధులు రావడానికి దీర్ఘ ఆయుర్దాయం కూడా ఓ కారణమని రష్యాలోని నేషనల్ రీసెర్చ్ వర్సిటీ ప్రొఫెసర్ వెస్లీ వ్లాసోవ్ తెలిపారు. -
పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
ఓబుళదేవరచెరువు (పుట్టపర్తి) : జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం వేర్వేరు ప్రాంతాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. ఓబుళదేవరచెరువు మండలం నల్లగుట్లపల్లికి చెందిన వేమనారాయణ(55) అనే గొర్రెల కాపరి వడదెబ్బకు గురై మరణించాడినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం పగలంతా మేత కోసం జీవాలను అటవీ ప్రాంతానికి తోలుకెళ్లిన అతను రాత్రి ఇంటికొచ్చాడు. భోజనం చేసిన కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108లో కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి భార్య లక్ష్మీనరసమ్మ, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుత్తిలో మరొకరు.. గుత్తిలోని గుంతకల్లు రోడ్డులో గల బ్రిడ్జి వద్ద నివాసముంటున్న రాముడు(55) కూడా వడదెబ్బకు గురై శనివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. సొంత పని మీద శుక్రవారం పగలంతా ఎండలో తిరిగొచ్చిన అతను సాయంత్రం ఇంటికి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ వెంటనే వాంతులు, వీరేచనాలయ్యాయన్నారు. దీంతో అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికొచ్చిన అతను శనివారం ఉదయమే మృతి చెందాడని చెప్పారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.