మాస్కో: గడిచిన 25 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా నరాల సంబంధిత వ్యాధుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 36.7 శాతం పెరిగినట్లు తాజా అధ్యయనంలో తేలింది. 1990–2015 మధ్య వైకల్యం బారిన పడిన వారి సంఖ్య 7.4 శాతం పెరిగినట్లు వెల్లడైంది. పెరుగుతున్న జనాభా, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు వెల్లడించింది.
జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడం, ఆరోగ్య సంరక్షణ పాటించడంతో సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొంది. నరాల వ్యాధులు రావడానికి దీర్ఘ ఆయుర్దాయం కూడా ఓ కారణమని రష్యాలోని నేషనల్ రీసెర్చ్ వర్సిటీ ప్రొఫెసర్ వెస్లీ వ్లాసోవ్ తెలిపారు.
36 శాతం పెరిగిన న్యూరో మృతుల సంఖ్య
Oct 15 2017 2:42 AM | Updated on Oct 20 2018 7:38 PM
Advertisement
Advertisement