debt loan
-
ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు!
భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరంటే ముక్తకంఠంతో 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) అని చెబుతారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నడుపుతూ లక్షల కోట్లు ఆర్జిస్తున్న ఈయన.. అప్పుల్లో కూడా అగ్రగామిగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.. 👉ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 3.13 లక్షల కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ప్రధమ స్థానంలో ఉన్నట్లు సమాచారం. 👉దేశంలోని పెద్ద విద్యుత్ రంగ కంపెనీలలో ఒకటైన 'నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్' (NTPC) రూ. 2.20 లక్షల కోట్ల అప్పుతో ఈ జాబితాలో రెండవ స్థానంలో చేరింది. 👉వోడాఫోన్ ఐడియా అప్పుల గురించి గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని అప్పు రిలయన్స్ కంటే తక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ అప్పు మాత్రం రూ. 2.01 లక్షల కోట్లని సమాచారం. 👉భారతి ఎయిర్టెల్ కూడా దేశంలో ఎక్కువ అప్పు తీసుకున్న కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ మొత్తం అప్పు రూ.1.65 లక్షల కోట్లని తెలుస్తోంది. 👉దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (IOCL) రూ.1.40 లక్షల కోట్ల అప్పులను, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రూ.1.29 లక్షల కోట్ల అప్పుతో ఈ జాబితాలో చేరాయి. 👉పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (PGCIL) అప్పు రూ. 1.26 లక్షల కోట్లు కాగా, దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ అప్పుడు రూ. 1.25 లక్షల కోట్ల వరకు ఉందని స్పష్టమవుతోంది. 👉చంద్రయాన్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన 'లార్సెన్ అండ్ టుబ్రో' (Larsen & Toubro) సంస్థ మొత్తం అప్పు రూ.1.18 లక్షల కోట్లు. లక్ష కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుత అప్పు రూ.1.01 లక్షల కోట్లు. అయితే ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్ లేకపోవడం గమనార్హం. నిజానికి ఏదైనా ఒక కంపెనీ ఎదిగే సయమంలో నిధుల సమీకరణ చాలా అవసరం. ఇందులో భాగంగానే ప్రముఖ సంస్థలు నిధులు సమీకరిస్తాయి. కేవలం భారతీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా పెద్ద సంస్థలు ఇదే విధానాలతో ముందుకు సాగుతూ దినిదినాభివృద్ది చెందుతున్నాయి. -
అమరావతి అప్పులు కన్సల్టెన్సీలకు ఫలహారం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో గత సర్కారు అందినకాడికి తీసుకున్న అప్పులు నూతన ప్రభుత్వానికి పెనుభారంగా మారాయి. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను కన్సల్టెంట్లు, వడ్డీల చెల్లింపుల కోసం చంద్రబాబు సర్కారు వ్యయం చేసింది. రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేదు. అమరావతి బాండ్ల పేరుతో రూ.2,000 కోట్లు అధిక వడ్డీకి అప్పు తీసుకుని అనుత్పాదక కన్సల్టెన్సీలకు రూ.322 కోట్లను చెల్లించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి అథారిటీ నిధి కింద రూ.215 కోట్లు ఉండగా ఇందులో నుంచి రూ.22 కోట్లను కన్సల్టెన్సీలకు చెల్లించింది. రాజధానిలో సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్ల నుంచి చంద్రబాబు సర్కారు రూ.329 కోట్లను వడ్డీల చెల్లింపులకు వెచ్చించడం గమనార్హం. అప్పు రూ.2,000 కోట్లు.. వడ్డీలు రూ.2,000.82 కోట్లు విదేశీ, స్వదేశీ బ్యాంకులు ఇచ్చే రుణాలను సంబంధిత ప్రాజెక్టు కోసమే వినియోగించాలి. అయితే ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు బాండ్ల ద్వారా అప్పులు చేయాలని టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిర్ణయించారు. దీన్ని అప్పట్లోనే పలువురు ఐఏఎస్ అధికారులు తప్పుబట్టారు. ఒకపక్క పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జీహెచ్ఎంసీ ప్రభుత్వ గ్యారెంటీ లేకుండానే బాండ్లు జారీ చేస్తే కేవలం 9.38 శాతం వడ్డీకే అప్పులు ఇవ్వడానికి భారీగా సంస్థలు ముందుకు వచ్చాయని, కర్ణాటక కూడా 5.85 శాతానికే అప్పులు చేస్తోందని, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ ఏకంగా అమరావతి బాండ్లకు 10.32 శాతం వడ్డీ చెల్లించాలని ఎలా నిర్ణయిస్తారని అభ్యంతరం తెలిపారు. బాండ్ల దళారీకి అప్పులో 0.1 శాతాన్ని ఫీజు కింద జీహెచ్ఎంసీ చెల్లిస్తుండగా, అమరావతి బాండ్ల దళారీకి మాత్రం 0.85 శాతం చెల్లించాలని నిర్ణయించడంపై కూడా విస్మయం వ్యక్తమైంది. ఇక అమరావతి బాండ్ల ద్వారా చంద్రబాబు సర్కారు ఎంత అప్పు తీసుకుందో అంతకు మించి వడ్డీలు, ఫీజుల రూపంలో చెల్లించాల్సి రావడం గమనార్హం. అమరావతి బాండ్లకు భారీ వడ్డీ, దళారీ ఫీజుతో కలిపి పదేళ్లలో రూ.2,000.82 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుల భారాన్ని తగ్గించుకుని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగటంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. -
రుణ మాఫీపై ఉత్కంఠ!
12 మండలాల్లో జరగని గ్రామ సభలు - జాబితాల్లో పేర్లు లేక రెతన్నల ఆందోళన - అర్హుల పూర్తి జాబితా ఇవ్వని బ్యాంకర్లు - ఆందోళనలో రైతన్నలు సాక్షి, కరీంనగర్ : రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణాలు తీసుకున్న రైతుల గుర్తింపునకు చర్యలు తీసుకుంది. ముందుంగా బ్యాంకర్లు.. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయాధికారులతో ఈ నెల 27, 28 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. 30లోగా జిల్లావ్యాప్తంగా రుణమాఫీకి అర్హులైన రైతుల బాబితాను తయారు చేసి.. నివేదిక పంపించాలని ఆదేశించింది. సభ ల్లో ఆయా బ్యాంకులు తమ నుంచి రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల పేర్లు ప్రకటిం చాలి. ఆ సభల్లోనే అర్హుల జాబితాతో బ్యాంకర్లు జాబితా తయారు చేసి అధికారులకు ఇవ్వాలి. కానీ.. జిల్లాలో పలు చోట్ల గ్రామ సభల నిర్వహణ తూతూమంత్రంగా జరుగుతోంది. రెండ్రోజుల్లోగా అన్ని గ్రామాల్లో సభలు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంతవరకు 12 మండలాల్లో సభలు నిర్వహించలేదు. పలు మండలాల్లో సగం గ్రామాలకే సభలు పరిమితమయ్యాయి. జగిత్యాలలో 31 గ్రామాలుండగా ఇం తవరకు ఏడు గ్రామాల్లోనే సభలు జరిగాయి. మహదేవ్‌పూర్‌లో 22 గ్రామాలుంటే.. 14 గ్రామాల్లోనే సభలు జరిగాయి. ఇలాంటి మండలాలు జిల్లాలో మరిన్ని ఉన్నాయి. అయినా.. ఈ నెల 31న (ఆదివారం) జిల్లావ్యాప్తంగా గ్రామ సభలన్నీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ జేడీఏ ప్రసాద్ చెప్పారు. మరోపక్క.. సభల్లో బ్యాంకర్లు చదువుతోన్న పేర్లలో అర్హులైన తమ పేర్లు లేవని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. ఇతర బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నామని.. ఆ జాబితా రాక.. సభలో తమ పేర్లు రాకపోవడంతో అర్హులైన రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. అల్గునూరులో నిర్వహించిన గ్రామ సభలో.. ఆంధ్ర, యూనియన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారి పేర్లు చదవకపోవడంతో రైతులు ఆందోళన చేశారు. అయినా యూనియన్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతుల పేర్ల జాబితా మాత్రం అధికారులకు అందలేదు. జిల్లాలో పలు చోట్ల అధికారులకు ఇలాంటి చేదనుభవాలు ఎదురయ్యాయి. గ్రామ సభలు పూర్తయి.. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితా తయారు చే సి.. ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు అందిస్తారో అధికారులూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ‘ప్రస్తుతం గ్రామ సభలు పూర్తిగా జరగలేదు.. 12 మండలాల నుంచి మాకు సమాచారం రాలే దు. వచ్చిన తర్వాతే తుది జాబితా తయారు చేస్తాం. శనివారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించాం. అయినా వివరాలు రాలేదు’ అని లీడ్ బ్యాంక్ మేనేజర్ చౌదరి వివరణ ఇచ్చారు.