debt mobilization
-
కరోనాతో కేంద్రంపై మరింత రుణ భారం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణాలపైనా కోవిడ్–19 భారం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్– 2021 ఏప్రిల్) మధ్య తన స్థూల మార్కెట్ రుణ సమీకరణ అంచనాలను కేంద్రం శుక్రవారం గణనీయంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది. నిజానికి తొలి అంచనా రూ.7.8 లక్షల కోట్లు. అంటే రుణ సమీకరణ అంచనా 4.2 లక్షల కోట్లు పెరిగిందన్నమాట. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో తగ్గుతుందని భావిస్తున్న తన ఆదాయాన్ని పూడ్చుకునే క్రమంలో రుణ సమీకరణ అంచనాలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారం వారీ రుణ సమీకరణ లక్ష్యాన్ని కూడా రూ.21,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు కేంద్రం పెం చింది. తన ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం మార్కెట్ రుణాలను ఒక సాధనంగా ఎంచుకునే సంగతి తెలిసిందే. 2019–20లో మార్కెట్ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యాన్ని (ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో 3.5%)కూడా ఆర్థికశాఖ పెంచే అవకాశం ఉంది. -
ప్రథమార్ధంలో రూ. 2.88 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) కేంద్రం రూ. 2.88 లక్షల కోట్ల మేర రుణ సమీకరణ జరపనుంది. ఇది బడ్జెట్లో నిర్దేశించుకున్న స్థూల రుణ సమీకరణలో 47.56 శాతంగా ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కేంద్రం రూ. 3.72 లక్షల కోట్ల మేర స్థూల రుణ సమీకరణ జరిపింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, రిటైల్ ద్రవ్యోల్బణ ఆధారిత ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్లు కూడా ప్రభుత్వం జారీ చేయనుందని ఆయన వివరించారు. అలాగే 1–4 సంవత్సరాల స్వల్పకాలిక వ్యవధి ఉండే బాండ్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గడిచిన అయిదేళ్లుగా బడ్జెట్లో నిర్దేశించుకున్న దాంట్లో 60–65 శాతం రుణ సమీకరణ ప్రథమార్ధంలో జరిగిందని, కొత్త ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గుతుందని గర్గ్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం గవర్నమెంట్ సెక్యూరిటీస్ బైబ్యాక్ పరిమాణం రూ. 25,000 కోట్ల మేర తగ్గించుకోవడంతో పాటు జాతీయ చిన్న మొత్తాల పొదుపు ఫండ్ (ఎన్ఎస్ఎఫ్) నుంచి రూ. 1 లక్ష కోట్ల దాకా ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. -
హెచ్‌పీసీఎల్ కొనుగోలు డీల్...
25వేల కోట్లు సమీకరిస్తున్న ఓఎన్జీసీ ► ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.13 వేల కోట్ల నగదు నిల్వలు ► కంపెనీ చరిత్రలో తొలిసారి రుణ సమీకరణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు–గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ భారీస్థాయిలో రుణ సమీకరణకు సమాయత్తమవుతోంది. మరో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థ హెచ్పీసీఎల్లో కేంద్రానికి ఉన్న 51.11 శాతం వాటాను దక్కించుకోవడం కోసం ఓఎన్జీసీ డైరెక్టర్ల బోర్డు గత నెలలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కొనుగోలు కోసం దాదాపు రూ.37 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వదేశీ/విదేశీ మార్కెట్ల నుంచి బాండ్లు, నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు ఇతరత్రా రుణ పత్రాల రూపంలో రూ.25 వేల కోట్ల మొత్తాన్ని సమీకరించడం కోసం త్వరలో వాటాదారుల అనుమతి కోరనుంది. రూపాయి లేదా విదేశీ కరెన్సీ రుణాలు లేదా ఈ రెండింటి ద్వారా ఈ రుణ సమీకరణ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నెల 27న జరిగే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఈ రుణ సమీకరణపై వాటాదారుల ఓటింగ్ కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఓఎన్జీసీ వద్ద రూ.13 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీ చరిత్రలో ఇదే తొలి రుణ సమీకరణ కావడం గమనార్హం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో (ఐఓసీ) ఓఎన్జీసీకి ప్రస్తుతం 13.77% వాటా ఉంది. దీని ప్రస్తుత విలువ సుమారు రూ.28,800 కోట్లు. గెయిల్‌లో ఉన్న 4.83% వాటా విలువ ఇప్పుడు రూ.1,550 కోట్లు. అయితే, హెచ్‌పీసీఎల్ కొనుగోలు కోసం ఇతర పీఎస్‌యూల్లోని తమ వాటాలను విక్రయించబోమని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. డీల్‌కు విధివిధానాలు, సూచనలను బోర్డుకు అందించేందుకుగాను ఆరుగురు సభ్యులతో కంపెనీ ఒక కమిటీని నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానే(వచ్చే ఏడాది మార్చి నాటికి) ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉంది.