deepesh
-
విషాదం.. క్రికెట్ ఆడుతూ ప్రముఖ నటుడు మృతి
సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కామెడియన్ దీపేష్ భాన్(41) కన్నుమూశారు. నేడు ఉదయం క్రికెట్ ఆడుతూ కిందపడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణవార్తను అసిస్టెంట్ డైరెక్టర్ కవిత కౌశిక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం దీపేష్ హఠ్మారణంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపేష్ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు కూడా లేవంటూ ఆమె భావోద్వేగానికి లోనియ్యారు. కాగా దీపేష్ మృతికి పలువుకు సినీ, టీవీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ‘భాబీ జీ ఘర్ పర్ హై’ అనే సీరియల్‌తో పాటు ‘కామెడీ కా కింగ్ ఖాన్’, ‘కామెడీ క్లబ్’, ‘భూత్వాలా’, ‘ఎఫ్ఐఆర్’, ‘ఛాంప్’ వంటి షోలతో ఆయన మంచి గుర్తింపు పొందారు. -
వేధింపులు తట్టుకోలేక...
న్యూఢిల్లీ: వేధింపులను తట్టుకోలేక జాతీయస్థాయి వర్ధమాన క్రీడాకారిణి అర్జు ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థి, బంధువు కూడా అయిన దీపేశ్ శంకర్ అనే యువకుడి వేధింపులను భరించలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి దీపం, క్రీడాజ్యోతి ఆరిపోయిందని అర్జు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. అర్జు తల్లిదండ్రులిద్దరూ ఉన్నతోద్యోగులు. అన్న శివం డాక్టర్ వృత్తిలో వున్నాడు. చిన్నప్పటినుంచి ఆమెకు బాస్కెట్ బాల్ అంటే ప్రాణం. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే కెప్టెన్‌గా ఎదిగింది. ఇటీవల గుజరాత్ లో జరిగిన జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో తన జట్టును రెండవ స్థానంలో నిలిపింది. భవిష్యత్తు మరింత ఎత్తుకు ఎదగాలని కలలు కంది. కానీ ఓ మృగాడి రూపంలో విధి ఆమెతో ఆడుకుంది. అర్జును తరచూ వేధించే దీపేశ్ శుక్రవారం ఇంటికి వచ్చి మరీ గొడవ పడ్డాడు. సోదరుడు శివం అడ్డుకోవడంతో ఇద్దరి మధ్యా తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో శివం ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అర్జు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.