
సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కామెడియన్ దీపేష్ భాన్(41) కన్నుమూశారు. నేడు ఉదయం క్రికెట్ ఆడుతూ కిందపడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణవార్తను అసిస్టెంట్ డైరెక్టర్ కవిత కౌశిక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
చదవండి: నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం
దీపేష్ హఠ్మారణంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపేష్ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు కూడా లేవంటూ ఆమె భావోద్వేగానికి లోనియ్యారు. కాగా దీపేష్ మృతికి పలువుకు సినీ, టీవీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ‘భాబీ జీ ఘర్ పర్ హై’ అనే సీరియల్‌తో పాటు ‘కామెడీ కా కింగ్ ఖాన్’, ‘కామెడీ క్లబ్’, ‘భూత్‌వాలా’, ‘ఎఫ్‌ఐఆర్’, ‘ఛాంప్’ వంటి షోలతో ఆయన మంచి గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment