నీటికోసం వెళ్లి... ప్రాణాలు కోల్పోయింది
జహీరాబాద్ టౌన్: నీటి ఎద్దడి ఓ జింకపిల్ల ప్రాణం తీసింది. నీటికోసం వెళ్లిన ఓ జింక పిల్ల ప్రమాదవశాత్తు పాడుబడ్డ బావిలో పడింది. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం మన్నాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో వీరేశం అనే రైతు తనబావిలో పడిన జింక పిల్లను చూసి స్థానికులకు సమాచారమిచ్చాడు.
యువకులు ముందుకు వచ్చి బావిలో నుంచి జింక పిల్లను బయటకు తీశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీ అధికారి చంద్రశేఖర్‌కు అప్పగించారు. గాయాలు కావడంతో చికిత్స అందించిన అనంతరం దాన్ని న్యాల్కల్ మండలం హద్నూర్‌లోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు తీసుకెళ్తుండగా ప్రాణాలు విడిచింది.