గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రాజాపేట : సూర్యాపేట, నల్లగొండ, భువనగిరిలో నూతనంగా ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ భూక్యా శకృనాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 23న బీఏ, బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్), 24న బీఎస్‌స్సీ–ఎంపీసీ, బీఎస్సీ–ఎంఎస్సీఎస్, బీఎస్సీ–బీజెడ్సీ, బీఎస్సీ–జెడ్ఎంసీ గ్రూపులకు సూర్యాపేట ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్‌కు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10:30కు ఆయా తేదీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఉదయం 11 గంటల తరువాత ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ మెమో, టీసీ, కుల, ఆదాయం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్, రేషన్‌కార్డు, ఫిజికల్ ఫిట్నెస్, లోకల్ క్యాండెట్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.