Delhi boy
-
13 ఏళ్ల బాలుడిపై హిజ్రా వేషగాళ్ల దాష్టీకం
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని 13 ఏళ్ల బాలుడికి బలవంతగా శస్త్ర చికిత్స చేయించి, హిజ్రాగా మార్చారు నలుగురు హిజ్రా వేషగాళ్లు. ఆ బాలుడిపై గత కొన్ని సంవత్సరాలుగా లైంగిక దాడులకు పాల్పడుతూ, బంధించి చిత్రహింసలకు గురిచేశారు. స్థానిక మహిళా కమీషన్ తెలిపిన వివరాల మేరకు..హిజ్రాల వేశంలో ఉండే నలుగురు మృగాళ్లు.. మూడేళ్ల కిందట జరిగిన ఓ డ్యాన్స్ ఈవెంట్లో బాధిత బాలుడికి డ్యాన్స్ నేర్పిస్తామని ఆశ చూపించి, తమతో పాటు తీసుకెళ్లి బంధించారు. అప్పటి నుంచి బాలుడిపై లైంగిక దాడులకు పాల్పడుతూ, మాదకద్రవ్యాలకు బానిసను చేశారు. కొన్ని రోజుల తర్వాత బాలుడికి శస్త్ర చికిత్స చేయించి హిజ్రాగా మార్చారు. అంతేకాకుండా బాధితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అవయవాలు మారేలా చేశారు. ఇంతటితో ఆగకుండా ఇతరులతో లైంగిక దాడులు చేయించడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద భిక్షాటన చేయించేవారు. ఎవరైనా ప్రయాణికులు ఒంటరిగా కనిపిస్తే వారిపై దాడి చేసి దోచువాలని ఆదేశించేవారు. వారు చెప్పినట్లు చేయకపోతే తిండి కూడా పెట్టేవారు కాదు. నిందితులు మరో బాలుడిని ట్రాప్ చేసే పనిలో ఉండగా బాధితుడు వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. నిందితులలో ఇద్దరిని అదుపులోని తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
దేశ రాజధానిలో దారుణం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించిన దుండగులు 16 ఏళ్ల బాలుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఇందరపురిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మద్యం మత్తులో బాలుడి బట్టలు విప్పించి దారుణంగా కొట్టారని డీసీపీ(నైరుతి) సురేందర్ కుమార్ తెలిపారు. అకారణంగా కొట్టినందుకు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అయితే బాధితుడిపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని వైద్య పరీక్షల్లో తేలినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాలుడి కాళ్లుచేతులు కట్టేసి కొట్టినట్టు వీడియోలో కనబడుతోంది. అతడు కొట్టొద్దని వేడుకుంటున్నా వినకుండా హింసించారు. ఈ వీడియోను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే బాలుడిపై లైంగిక దాడి జరిగిందని అతడి బంధువులు ఆరోపించారని, ఈ అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. -
సవతి తండ్రి పేరే కావాలి
న్యూఢిల్లీ: కన్నతండ్రి కంటే.. సవతి తండ్రే తనకు ముఖ్యమంటున్నాడు ఢిల్లీకి చెందిన ఓ బాలుడు. కన్నకొడుకు కంటే మిన్నగా ఆదరించిన ఆయననే తనకు చట్టబద్ధమైన తండ్రిగా గుర్తించాలంటున్నాడు. అతని కొడుకుగానే తనకు విదేశాల్లో చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలంటున్నాడు. ఇంటర్ చదువుతున్న ఢిల్లీకి చెందిన విద్యార్థి (17) పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. అందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేశాడు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. దరఖాస్తు ఫారంలో తండ్రి పేరు స్థానంలో తన సవతి తండ్రి పేరు రాశాడు. దీంతో అధికారులు పాస్‌పోర్టును తిరస్కరించారు. అంతే.. వివాదం మొదలైంది. దీనిపై సదరు బాలుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. సవతి తండ్రినే తనకు నిజమైన గార్డియన్‌గా గుర్తించాలని కోర్టును కోరుతున్నాడు. తల్లిదండ్రులుగా.. అసలు తల్లిదండ్రులు లేదా పెంపుడు తల్లిదండ్రులు లేదా సవతి తల్లిదండ్రుల పేర్లను పేర్కొనే అవకాశాన్ని అభ్యర్థులకే వదిలేయాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశాడు. తండ్రి నుంచి తను, తన తల్లి ఎపుడో విడిపోయామని, ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. విడాకుల పత్రంలో ఈ విషయం స్పష్టం ఉందని అతడు చెప్పాడు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆ విద్యార్థి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేమని నిపుణులంటున్నారు. చట్ట ప్రకారం దత్తత తీసుకుంటే తప్ప వారి బంధాన్ని అంగీకరించలేమంటున్నారు. అందునా ఆ విద్యార్థికి ఇంకా 18 ఏళ్లు నిండలేదు కనుక కన్నతండ్రే గార్డియన్ అవుతాడంటున్నారు. ఇలాంటి చిక్కు సమస్యలు చాలాసార్లు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళల పిల్లలు తరచు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ చట్టంలోని నిబంధనను మార్చాలని న్యాయవాది ఫ్లావియా ఏగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బాలుని తండ్రి స్పందిస్తూ.. ఒక్క బర్త్ సర్టిఫికెట్లో తప్ప, మిగిలిన అన్ని సర్టిఫికెట్లలో తండ్రిగా తన పేరే ఉందన్నారు. ఈ పాస్‌పోర్ట్ వ్యవహారంలో ఒకవేళ కన్నతండ్రి పేరును ప్రస్తావిస్తే మరింత గందరగోళంగా మారేదన్నారు. అటు నిబంధనలకు విరుద్ధంగా తామేమీ చేయలేమని పాస్‌పోర్టు జారీ అధికారులు తెలిపారు. మరి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. -
ఢిల్లీ విద్యార్థికి గూగుల్ భారీ ఆఫర్
న్యూఢిల్లీ: ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థి చేతన్ కక్కర్‌కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. గూగుల్ తనకు ఏడాదికి 1.27 కోట్ల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేసినట్టు చేతన్ కక్కర్ చెప్పారు. ఢిల్లీకి చెందిన చేతన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫైనలియర్ చదువుతున్నారు. చేతన్ కోర్సును పూర్తి చేశాక వచ్చే ఏడాది కాలిఫోర్నియాలో గూగుల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరనున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆఫర్ అందుకున్న విద్యార్థి చేతన్ కావడం విశేషం. గూగుల్ సంస్థలో చేరడానికి ఉత్సుకతతో ఉన్నానని చేతన్ సంతోషం వ్యక్తం చేశారు. చేతన్ తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులు. తల్లి రీతా కెమిస్ట్రీ విభాగంలో, తండ్రి సుభాష్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో పనిచేస్తున్నారు.